కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

మారుతి సుజుకి ఇండియా తన విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌తో భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్‌గా నిలిచింది. భారత మార్కెట్లో మారుతి కార్లు అత్యధికంగా అమ్ముడవుతుంటాయి. ప్రత్యేకించి ఈ కంపెనీ విక్రయించే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ యువతలో మంచి క్రేజ్‌ను కలిగి ఉంది. అందుకే ఈ కారు దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్‌గా మార్కెట్లో నిలిచింది.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

మారుతి సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తమ కొత్త 2021 మోడల్ స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్‌లో కంపెనీ కొన్ని కాస్మెటిక్, ఫీచర్ మరియు ఇంజన్ అప్‌గ్రేడ్స్ చేసింది. ప్రస్తుతం ఈ ఫన్-టూ-డ్రైవ్ కారు LXi, VXi, ZXi మరియు ZXi + అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

మారుతి సుజుకి అందిస్తున్న చిన్న కార్లలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. ఒకవేళ మీరు కూడా కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలని చూస్తున్నట్లయితే, ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో ఒక్కసారి తెలుసుకోవటం మంది. మరి ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

1. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఎల్‌ఎక్స్ఐ (మాన్యువల్: రూ.5.81 లక్షలు)

మారుతి స్విఫ్ట్‌లో ఇది బేస్ వేరియంట్. ఈ వేరియంట్‌లో 14 ఇంచ్ స్టీల్ వీల్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ ప్రీటెన్షనర్, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

ఇంకా ఇందులో మ్యాన్యువల్ ఎయిర్ కండీషనర్, టిల్ట్ అడ్జస్టబల్ పవర్ స్టీరింగ్, లోపలి వైపు నుండి సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్, ముందు వరుసలో ప్రయాణీకుల కోసం 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

2. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ (మాన్యువల్: రూ.6.51 లక్షలు, ఏఎమ్‌టి: రూ.7.01 లక్షలు)

స్విఫ్ట్‌లో సెకండ్ బేస్ వేరియంట్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో ఫుల్ వీల్ కవర్స్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్, బయటి ఉష్ణోగ్రత ప్రదర్శన (ఏఎమ్‌టి మోడల్‌లో మాత్రమే), సన్ వైజర్, టాకోమీటర్, ఈఎస్‌పి (ఏఎమ్‌టి మోడల్‌లో మాత్రమే), రిమోట్ సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ (ఏఎమ్‌టి మోడల్‌లో మాత్రమే) వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

ఇవే కాకుండా, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, పార్సెల్ ట్రే, యుఎస్‌బి, ఆక్స్-ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్, 4 స్పీకర్లు, డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్, అడ్జస్టబల్ ఫ్రంట్ హెడ్‌రెస్ట్స్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ (మ్యాన్యువల్ వేరియంట్లో మాత్రమే) మరియు గేర్ స్థానాన్ని సూచించే ఇండికేటర్ (ఏఎమ్‌టి వేరియంట్లో మాత్రమే) వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

3. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ జెడ్‌ఎక్స్ఐ (మాన్యువల్: రూ.7.14 లక్షలు, ఏఎమ్‌టి: రూ.7.64 లక్షలు)

ఈ వేరియంట్‌లో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫాగ్ లాంప్స్, లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, బాహ్య ఉష్ణోగ్రత ప్రదర్శన, డ్రైవర్ విండో ఆటో అప్ మరియు యాంటీ పించ్ ఫంక్షన్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

ఇవే కాకుండా, ఇందులో స్మార్ట్ ప్లే స్టూడియో అప్లికేషన్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, రియర్ వాష్, వైపర్ మరియు డీఫాగర్, సర్దుబాటు చేయగల వెనుక హెడ్‌రెస్ట్‌లు మరియు 60:40 ఫోల్డింగ్ రియర్ సీటు, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్‌తో కూడిన నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

4. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ జెడ్‌ఎక్స్ఐ + (మాన్యువల్: రూ.7.92 లక్షలు, ఎఎమ్‌టి: రూ.8.42 లక్షలు)

ఇది స్విఫ్ట్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్. ఈ వేరియంట్లో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను అందిస్తోంది. ఇందులో ఎల్ఈడి డిఆర్‌ఎల్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, 15 ఇంచ్ ప్రెసిషన్ కట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ కలర్ ఆప్షన్, కలర్ ఎమ్ఐడి, రియర్ వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

కొత్త స్విఫ్ట్ ఇంజన్ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో కొత్తగా 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది పాత 1.2-లీటర్ ఇంజన్ కంటే 7 బిహెచ్‌పిల అదనపు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2021 మారుతి స్విఫ్ట్‌లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

అయితే, కంపెనీ ఈ మోడల్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. మునుపటిలానే ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (ఏఎమ్‌టి) ఆప్షన్లతో లభిస్తుంది. ఇప్పుడు అన్ని వేరియంట్లు కూడా ఇంజన్ ఐడిల్ స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఈ ఫీచర్ వలన కారు మైలేజ్ పెరుగుతుందని కంపెనీ చెబుతోంది.

Most Read Articles

English summary
New 2021 Maruti Suzuki Swift Variant-wise Features And Price Details. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X