భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్ష్ (Porsche) భారత మార్కెట్లో తమ కొత్త 2021 మకాన్ (Macan) ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. పోర్ష్ ఈ లగ్జరీ స్పోర్ట్స్ ఎస్‌యూవీతో పాటుగా టేకాన్ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కూడా భారతదేశంలో విడుదల చేసింది. పోర్ష్ మకాన్ ఎస్‌యూవీని కంపెనీ మొదటిసారిగా 2019 లో అప్‌డేట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో రెండవసారి మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ ను ప్రవేశపెట్టారు.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ అప్‌డేటెడ్ 2021 పోర్ష్ మకాన్ (2021 Porsche Macan) ఎస్‌యూవీ కంపెనీ ఈ సంవత్సరం జూలై 2021 నెలలో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఎస్‌యూవీలో స్టైలింగ్ అప్‌డేట్స్, పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్స్ తో పాటుగా ఇంటీరియర్లను కూడా మెరుగుపరచింది. భారత మార్కెట్లో కొత్త పోర్ష్ మకాన్ ఎస్‌యూవీ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి - మకాన్, మకాన్ ఎస్ మరియు మకాన్ జిటిఎస్.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త పోర్ష్ మకాన్ ఎస్‌యూవీ మొత్తం 14 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్‌యూవీ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్ లను ప్రారంభించామని, డెలివరీలు వచ్చే జనవరి 2022 నుండి ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. ఈ కొత్త 2021 పోర్ష్ మకాన్ స్టైలింగ్ పరంగా ఇది మునుపటి కన్నా చాలా చాలా షార్ప్ గా కనిపిస్తుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఆప్రాన్, విస్తృతమైన ఎయిర్ ఇన్‌టేక్‌లు మరియు కొత్త ఫ్రంట్ స్పాయిలర్‌తో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

అలాగే, సైడ్ డిజైన్ ను గమనిస్తే ఈ కారు కోసం ఎంచుకోవడానికి ఏడు విభిన్న డిజైన్లలో అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయి. పోర్ష్ మకాన్ GTS 21 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ తో లభిస్తుంది. ఇతర ట్రిమ్‌ లలో 19 ఇంచ్ మరియు 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వెనుకవైపు ఉన్న బ్లాక్ డిఫ్యూజర్ స్టైలిష్ మరియు స్పోర్టీ లుక్‌ని పొందుతుంది. వెనుక వైపు క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పోర్ష్ డైనమిక్ లైట్ సిస్టమ్ (PDLS) మరియు స్పోర్ట్ డిజైన్ ఎక్స్‌టీరియర్ మిర్రర్‌లతో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్లు ఇప్పుడు అన్ని మోడళ్లలో స్టాండర్డ్ ఫీచర్ గా లభిస్తాయి.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

క్యాబిన్ లోపల ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, కొత్త 2021 పోర్ష్ మకాన్ డాష్‌బోర్డ్ పైభాగంలో సిగ్నేచర్ అనలాగ్ క్లాక్ (గడియారం) ఉంటుంది. అయితే దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లోని డయల్స్ ఇప్పుడు రీడిజైన్ చేయబడిన లేఅవుట్‌ను పొందుతాయి. ఇక ఇందులో ఇతర ముఖ్యమైన మార్పులలో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సీట్స్, 10.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు పార్క్ అసిస్ట్ యాక్టివ్ పార్కింగ్ సపోర్ట్ మొదలైనవి చాలానే ఉన్నాయి.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త తరం మకాన్ ఎస్‌యూవీలో పోర్ష్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ యొక్క 10.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డి టచ్ డిస్‌ప్లే ఉంటుంది ఇది Apple CarPlay, నావిగేషన్, వాయిస్ కంట్రోల్, Wi-Fi హాట్‌స్పాట్ మరియు పోర్ష్ కనెక్ట్ యాప్ లను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ కారులో కొత్త ఇంటీరియర్ ట్రిమ్ ఎంపికలతో పాటుగా కొత్తగా రూపొందించిన సెంటర్ కన్సోల్‌ ఉంటుంది. ఈ సెంటర్ కన్సోల్ పై కంపెనీ చాలా చోట్ల భౌతిక బటన్లకు బదులుగా టచ్ సర్ఫేస్ లను ఉపయోగించింది. యూజర్లు ఇప్పుడు కేవలం చేతి స్పర్శతోనే అనేక ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు మరియు కంట్రోల్ చేయవచ్చు.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 మకాన్ ఎస్‌యూవీలో పోర్ష్ విక్రయిస్తున్న 911 మరియు పనామెరా మోడళ్ల మాదిరిగా కొత్త మల్టీ-ఫంక్షన్ మరియు GT స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ ను ఉపయోగించారు. ఇంటీరియర్ థీమ్ మొత్తం చాలా వరకూ బ్లాక్ కలర్ ఫినిష్ చేయబడి ఉంటుంది. కస్టమర్ల ఎంపిక కోసం ఇందులో అనేక రకాల లెదర్ అప్‌హోలెస్ట్రీ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇక చివరిగా ఇంజన్ మరియు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త 2021 పోర్ష్ మకాన్ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని స్టాండర్డ్ మోడల్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్ 261 బిహెచ్‌పి పవర్ ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

అలాగే, ఇందులోని శక్తివంతమైన 2.9 లీటర్ ట్విన్-టర్బో వి6 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 375 బిహెచ్‌పి పవర్ ను మరియు 520 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులోని టాప్-స్పెక్ మకాన్ జిటిఎస్ వేరియంట్లో ఇదే ఇంజన్ 434 బిహెచ్‌పి పవర్ ను మరియు 550 ఎన్ఎమ్ టార్క్‌ ను జనరేట్ చేసేలా ట్యూన్ చేయబడింది. ఈ ఇంజన్ కూడా 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తోనే లభిస్తుంది.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బేస్ వెర్షన్ కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 232 కిలోమీటర్లుగా ఉంటుంది. అదే 2.9 లీటర్ వి6 ఇంజన్ ను ఉపయోగించే మకాన్ జిటిఎస్ మోడల్ అయితే, గరిష్టంగా గంటకు 272 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులోని మిడ్-స్పెక్ మకాన్ ఎస్ వేరియంట్ కేవలం 4.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

భారత మార్కెట్లో కొత్త 2021 Porsche Macan ఎస్‌యూవీ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

చివరగా, ధరను గమనిస్తే దేశీయ విపణిలో ఈ కొత్త 2021 పోర్ష్ మకాన్ (2021 Porsche Macan) ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 83.21 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూప్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 మరియు రేంజ్ రోవర్ వెలార్ వంటి లగ్జరీ కార్లతో పోటీ పడుతుంది.

Most Read Articles

English summary
New 2021 porsche macan launched in india price specs features and booking details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X