క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

భారత మార్కెట్లో స్థిరమైన స్థానాన్ని దక్కించుకునేందుకు చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా గట్టిగా ప్రయత్నిస్తోంది. దేశీయ విపణిలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించడం ద్వారా దాదాపు అన్ని విభాగాల్లో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

ఇప్పటికే మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా 'కుషాక్' అనే ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న స్కొడా, తాజాగా ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు పోటీగా తమ అప్‌డేటెడ్ కొడియాక్ ఎస్‌యూవీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

స్కొడా కోడియాక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది తృతీయ త్రైమాసికంలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్కొడా ఆటో ఇండియాలో సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిన్స్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

జాక్ హోలిన్స్ చేసిన ట్వీట్ ప్రకారం "ఈ సంవత్సరం మూడవ ప్రయోగం ఫేస్ లిఫ్ట్ కోడియాక్ అవుతుంది, దీనిని శక్తివంతమైన 2.0 టిఎస్ఐ ఇంజన్‌తో క్యూ 3లో ప్రారంభించబోతున్నాం" అని పేర్కొన్నారు.

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కొడియాక్ ఎస్‌యూవీ కూడా ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది. వాస్తవానికి ఈ ఎస్‌యూవీ 2020 చివరి నాటికి భారత మార్కెట్లోకి వస్తుందని భావించారు. అయితే, దేశంలోని కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఇది సాధ్యపడలేదు.

MOST READ:షిప్పుల గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.. ఇక్కడ మీకోసం..ఓ లుక్కేసెయ్యండి

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

మారుతి సుజుకి మాదిరిగానే స్కొడా ఆటో కూడా భారతదేశంలో కేవలం పెట్రోల్ ఇంజన్లతో నడిచే కార్లనే విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే, గతంలో స్కొడా కొడియాక్‌లో ఆఫర్ చేసిన 2.0 డీజిల్ ఇంజన్ ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కనిపించదు. దీనికి బదులుగా, ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది.

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

ఈ పవర్‌ఫుల్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 4200 ఆర్‌పిఎమ్ వద్ద 188 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఇంజన్ నుండి విడుదలయ్యే శక్తిని అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

గతంలో స్కొడా కొడియాక్ ఎస్‌యూవీలో ఉపయోగించిన 2.0-లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 340 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసేది. ఈ ఇంజన్‌తో పోలిస్తే కొత్త 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 30 బిహెచ్‌పి ఎక్కువ శక్తిని మరియు 20 ఎన్ఎమ్ తక్కువ టార్క్‌ని జనరేట్ చేస్తుంది.

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ఎక్కువగా కాస్మెటిక్ మరియు కొన్ని ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో సవరించిన హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ డిజైన్, రీడిజైన్ చేయబడిన గ్రిల్ మరియు ఇరువైపులా కొత్త బంపర్ డిజైన్‌లు ఉంటాయి. ఇవి కాకుండా, కొడియాక్ ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ఇదివరకటిలానే ఉంటుంది.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

కొత్త 2021 స్కొడా కొడియాక్ లోపలి భాగంలో ఆశించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్ట్ టెక్నాలజీ మరియు పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఇది వర్చువల్ కాక్‌పిట్ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

ఇంకా ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్, పవర్-ఆపరేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వాయిస్ అసిస్టెంట్, లెథర్‌తో చుట్టబడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్స్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో లభించవచ్చని సమాచారం.

క్యూ3లో 2021 స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తాం: జాక్ హోలిన్స్

స్కొడా ఇండియా తమ మొత్తం లైనప్‌ను ఇంకా బిఎస్6 ప్రమాణాలకు అప్‌డేట్ చేయలేదు. అందుకే, కొత్త తీసుకురానున్న కొడియాక్‌ను కేవలం ఇంజన్ అప్‌గ్రేడ్‌తోనే కాకుండా ఫీచర్ అప్‌డేట్స్‌తో కూడా తీసుకువాలని చూస్తోంది. ఇది ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్, ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా అల్టురాస్ జి4 మరియు ఎమ్‌జి గ్లోస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
New 2021 Skoda Kodiaq Facelift India Launch Timeline Revealed, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X