కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) గతంలో భారత మార్కెట్లో విక్రయించి, ప్రస్తుతం నిలిపివేసిన 5 సీటర్ ఎస్‌యూవీ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ (Volkswagen Tiguan) లో కంపెనీ ఇప్పుడు ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఇది ఈ ఏడాది నవంబర్ 2021 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

ఇది వరకు కంపెనీ తమ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయించేంది. అయితే, దేశంలో బిఎస్6 కాలుష్య ఉద్గార నిబంధనలు అమల్లోకి తెచ్చిన తర్వాత కంపెనీ ఈ మోడల్ అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా, ఇప్పుడు కొత్తగా రానున్న ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కేవలం పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్ తో మాత్రమే రానుంది.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

కొత్త 2021 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ (Volkswagen Tiguan) ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో ఇంజన్ అప్‌గ్రేడ్స్ తో పాటుగా చిన్నపాటి కాస్మెటిక్ అప్‌డేట్‌లు కూడా ఉంటాయని తెలుస్తోంది. కంపెనీ దీనిని సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ తో అందిస్తుందని భావిస్తున్నారు. ఇది కొంచెం ఎక్కువ కోణీయంగా ఉండే ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను మరియు పూర్తిగా రీడిజైన్ చేయబడిన కొత్త ఫ్రంట్ బంపర్‌లను పొందనుంది.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

ఈ మార్పుల వలన 2021 టిగువాన్ ముందు వైపు నుండి మరింత అగ్రెసివ్ గా కనిపించనుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇందులో కొత్త డిజైన్ తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించనున్నారు. అయితే, బాడీ లైన్స్, సైడ్ మిర్రర్స్ మరియు డోర్ హ్యాండిల్స్ వంటి వాటిల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఇక వెనుక డిజైన్‌లో కూడొ కొన్ని రివైజ్డ్ టెయిల్ ల్యాంప్స్ మరియు బంపర్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

ఇక క్యాబిన్ లోపల లభించే ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో కొత్తగా పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే స్క్రీన్ లభించే అవకాశం ఉంది. ఇదివరకటి పాత మోడల్ లో ఇది అనలాగ్ డయల్ రూపంలో ఉండేది. ఇంకా ఇందులో కొత్త స్టీరింగ్ వీల్, బెటర్ కనెక్టింగ్ ఫీచర్లు మరియు టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా లభ్యం కానున్నట్లు సమాచారం. దీని స్టీరింగ్ వీల్ మరియు ఎక్స్టీరియర్లపై కొత్త లోగో ఉంటుందని ఆశిస్తున్నారు.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

ఇవే కాకుండా, క్యాబిన్ లోపల 30 రంగులతో కూడిన పరిసర (యాంబియెంట్) లైటింగ్ ఫీచర్ ను కూడా ఆఫర్ చేయనున్నారు. డ్రైవర్ మరియు ప్రయాణికుల మూడ్ ని బట్టి ఈ లైటింగ్ ను మార్చుకోవచ్చు మరియ ఇది రాత్రివేళ్లలో క్యాబిన్ రూపాన్ని మార్చడంలో సహకరిస్తుంది. ఇతర ఫీచర్లలో Apple CarPlay మరియు Android Auto తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా ఉంటుంది.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో పవర్డ్ డ్రైవర్ సీట్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, పానోరమిక్ సన్‌రూఫ్, ట్రై-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు స్లైడింగ్ రియర్ బెంచ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ మొదలైనవి లభ్యం కానున్నాయి.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

ఇంకా ఇందులో, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభించే అవకాశం ఉంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని ప్రస్తుత 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌నే కొత్త మోడల్ లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

కంపెనీ ఈ ఇంజన్ ను 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ తో అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆప్షనల్ 4x4 డ్రైవ్ సిస్టమ్‌ లభించే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2021 టిగువాన్ ధర సుమారు రూ. 28 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభం కావచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో జీప్ కంపాస్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వంటి ప్రీమియం కార్లతో పోటీపడే అవకాశం ఉంది.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

బుకింగ్స్‌లో అదరగొడుతున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్..

ఇదిలా ఉంటే, ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తాజాగా మార్కెట్లో విడుదల చేసిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగన్ (Taigun) బుకింగ్స్ పరంగా దూసుకెళ్తోంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కాగా, ఈ ఎస్‌యూవీ కోసం ఇప్పటి వరకు 12,221 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

కొత్త టైగన్ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్స్, టచ్ సెన్సిటివ్ బటన్‌లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, లెథర్ అప్‌హోలెస్ట్రీ మరియు యాంబియెంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.

కమింగ్ సూన్..: కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, హిల్-హోల్డ్ కంట్రోల్ మరియు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ యాంకర్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
New 2021 volkswagen tiguan facelift suv india launch timeline revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X