హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

జపాన్‌కి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తమ కొత్త తరం హోండా సివిక్ (Honda Civic) సెడాన్ ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ ఎగ్జిక్యూటివ్ సెడాన్ లో 11 వ తరం మోడల్ ని కొత్త ఇంజన్స్ మరియు సరికొత్త డిజైన్ తో ప్రవేశపెట్టింది.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

హోండా ఇప్పుడు ఈ సివిక్ సెడాన్ ను పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే చైనా మార్కెట్ కోసం రూపొందించిన కొత్త 2022 హోండా సివిక్ సెడాన్ కంపెనీ ఆవిష్కరించింది. చైనా మార్కెట్లో ఈ మోడల్ ని కంపెనీ హోండా ఇంటెగ్రా (Honda Integra) పేరుతో విక్రయించనుంది.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

ఇంటెగ్రా అనేది హోండా యొక్క లగ్జరీ కార్ బ్రాండ్ అక్యూరా (Acura) కి చెందిన ఐకానిక్ నేమ్‌ప్లేట్. కంపెనీ ఇదే పేరుతో అక్యురా బ్రాండ్ లో ఓ కొత్త మోడల్ ను తీసుకువస్తుందని అందరూ భావించారు. అయితే, కంపెనీ ఈ పేరును చైనీస్ మార్కెట్ కోసం వినియోగించింది మరియు తమ కొత్త సివిక్ సెడాన్ ను 2022 హోండా ఇంటెగ్రా పేరుతో ప్రారంభించనుంది.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

కొత్త హోండా ఇంటెగ్రా సెడాన్ ని చైనా బ్రాండ్ జాయింట్ వెంచర్ అయిన గ్వాంగ్జీ హోండా అభివృద్ధి చేసింది. ఈ సెడాన్ ను గ్వాంగ్‌జౌలోని హోండా కార్ ప్లాంట్ లో తయారు చేయనున్నారు. కాగా, సివిక్ సెడాన్ ను వుహాన్‌లో డాంగ్‌ఫెంగ్ హోండా తయారు చేస్తుంది. నిజానికి, ఈ రెండు సెడాన్లు (సివిక్, ఇంటెగ్రా) కూడా చూడటానికి దాదాపు ఒకేలా కనిపిస్తాయి.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

అయితే, హోండా ఇంటెగ్రా స్లిమ్ ఎల్ఈడి హెడ్‌లైట్లు మరియు పెద్ద ఫ్రంట్ గ్రిల్ వంటి స్టైలింగ్ అప్‌డేట్‌ లను కలిగి ఉంటుంది. అలాగే, వెనుక ప్రొఫైల్‌ లో మసకబారినట్లుగా ఉండే ఎల్ఈడి టెయిల్ లైట్లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ వెంట్స్ మరియు లైట్ స్పాయిలర్ వంటి మార్పులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ కారులో కొత్తగా అభివృద్ధి చేసిన 18 ఇంచ్ 5-స్పోక్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ ని ఉపయోగించారు.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

కొత్త 2022 హోండా ఇంటెగ్రా ఎమరాల్డ్ బ్లూ మరియు స్పోర్టీ యల్లో కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టబడింది. ఇంటెగ్రా యొక్క అంతర్గత ఫోటోలను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. కాబట్టి, ఇందులోని ఇంటీరియర్ వివరాల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అయితే, దీని క్యాబిన్ హోండా సివిక్ సెడాన్‌తో పంచుకుంటుందని భావిస్తున్నారు.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

అలాగే, మరింత స్పోర్టీనెస్ అనుభూతి కోసం కంపెనీ దాని ఇంటీరియర్స్ కొత్త కలర్ ఆప్షన్లు కూడా ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ సెడాన్ వెనుక భాగంలో 240 ఎన్ఎమ్ టార్క్ సూచించే "240 టర్బో" బ్యాడ్జ్ ఉంటుంది. అంటే, ఇది సివిక్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ తో పనిచేస్తుందని సమాచారం. ఈ ఇంజన్ 180 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

హోండా ఈ ఏడాది చివరి నాటికి తమ కొత్త ఇంటెగ్రా (Integra) సెడాన్‌ను చైనా మార్కెట్‌ లో విడుదల చేయనుంది. ఇది చైనా స్పెసిఫిక్ మోడల్ కాబట్టి, ఇతర గ్లోబల్ మార్కెట్లలో అమ్ముడయ్యే అవకాశం కనిపించడం లేదు. హోండా ఇటీవల భారత మార్కెట్ నుండి తమ సివిక్ సెడాన్ మరియు సిఆర్-వి ఎస్‌యూవీలను తొలగించిన సంగతి తెలిసినదే. అయితే, ఈ రెండు మోడళ్లను తిరిగి మన మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రస్తుతం కంపెనీ నుండి ఎలాంటి తక్షణ ప్రణాళికలు లేవు.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

అయితే, గతంలో హోండా చేసిన ప్రకటన ప్రకారం, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లకు పోటీగా కంపెనీ ఓ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలిపింది. ఇది మార్కెట్లోకి రావడానికి మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

ఎస్‌యూవీల విషయంలో భారతీయ వినియోగదారులు చూపుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని హోండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్‌యూవీ విభాగంలో హోండా నుండి భారత మార్కెట్లో బిఆర్-వి (BR-V) అనే ఎస్‌యూవీ మాత్రమే అందుబాటులో ఉంది. కాగా, కొత్తగా రాబోయే హోండా మిడ్-సైజ్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రావచ్చని సమాచారం.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

ఇక హోండాకి సంబంధించిన ఇతర వార్తలను పరిశీలిస్తే, ఈ బ్రాండ్ నుండి తాజాగా రూపొందించబడిన సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఎన్7ఎక్స్ (N7X) కంపెనీ గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. హోండా తన N7X కాన్సెప్ట్‌ను BR-V పేరుతో ఇండోనేషియా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ 7-సీటర్ ఎస్‌యూవీ పూర్తిగా విభిన్నమైన ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌తో పాటుగా విస్తృత శ్రేణి సాంకేతికతలు మరియు ఫీచర్లను కూడా కలిగి ఉంది.

హోండా ఇంటెగ్రా (Integra) పేరుతో వచ్చిన సివిక్ (Civic) సెడాన్!

ఈ కొత్త 2022 హోండా బిఆర్-వి (ఎన్ఎక్స్-7) లో హోండా లైన్ వాచ్, హోండా సెన్సింగ్, వాక్-అవే ఆటో లాక్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ మరియు స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్ వంటి అనేక వినూత్న ఫీచర్లు ఉన్నాయి. ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.5 లీటర్ డిఓహెచ్‌సి ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 121 బిహెచ్‌పి పవర్ మరియు 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New 2022 honda integra sedan unveiled a more stylish version of civic sedan
Story first published: Friday, October 1, 2021, 17:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X