కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

కొరియన్ కార్ బ్రాండ్ Hyundai అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ Creta లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త 2022 మోడల్ Hyundai Creta ముందుగా బ్రెజిల్ మరియు దక్షిణ అమెరికా మార్కెట్లలో లభ్యం కానుంది. ప్రస్తుత Creta తో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్‌లో డిజైన్, ఫీచర్లు మరియు టెక్నాలజీ పరంగా భారీ మార్పులు ఉన్నాయి.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో అత్యంత పాపులర్ అయిన ఏడిఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)తో కూడిన సేఫ్టీ ఫీచర్లను మరియు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో ఈ కొత్త 2022 Hyundai Creta ని రూపొందించారు. మనదేశంలో తాజాగా వచ్చిన Mahindra XUV700 లో కూడా ఈ తరహా లేటెస్ట్ టెక్నాలజీ మరియు సేఫ్టీ ఫీచర్లను మనం చూడొచ్చు.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

Hyundai ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న Creta మోడల్‌తో పోలిస్తే కొత్త 2022 మోడల్‌లో డిజైన్ పరంగా ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. దీని ఫ్రంట్ ఫాసియా ఈ మార్పులను గమనించవచ్చు. ఇందులో Hyundai యొక్క లేటెస్ట్ ఎస్‌యూవీ Alcazar (అల్కజార్) నుండి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్‌ను మనం చూడొచ్చు.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

కేవలం ఫ్రంట్ గ్రిల్ ను మాత్రమే కాకుండా, ఈ కొత్త 2022 Creta లో Alcazar నుండి గ్రహించిన కొత్త రకం అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా ఇందులో గమనించవచ్చు. కాకపోతే, దీని హెడ్‌లైట్ క్లస్టర్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ కారులోని టెయిల్ లైట్ డిజైన్‌లో మాత్రం కొద్దిపాటి మార్పు కనిపిస్తుంది. ఈ టెయిల్ లైట్ ఇప్పుడు బూట్ లిడ్ వరకూ విస్తరించబడి ఉంటుంది.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

ఇంటీరియర్స్‌లో చేసిన మార్పులను గమనిస్తే, కొత్త 2022 Hyundai Creta క్యాబిన్ డ్యూయల్ టోన్ షేడ్‌ని కలిగి ఉంటుంది. ఇది బ్లాక్ అండ్ బీజ్ లుక్‌లో ఉంటుంది. చూడటానికి ఇది ప్రస్తుత వెర్షన్ మాదిరిగానే కనిపిస్తుంది. సెంటర్ కన్సోల్ లో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ను అడ్డుగా అమర్చబడి ఉంటుంది. ఇది డాష్‌బోర్డులో ప్రధాన భాగాన్ని ఆక్రమించి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

ఈ కొత్త ఎస్‌యూవీలోని ఆటోమేటిక్ వేరియంట్ కోసం స్టీరింగ్ వీల్‌పై ప్యాడిల్ షిఫ్టర్‌లను కూడా ఆఫర్ చేస్తున్నారు. స్టీరింగ్ వీల్ పై టెలిఫోన్ బటన్లు ఎడమ వైపున మరియు క్రూయిజ్ కంట్రోల్ బటన్లు కుడి వైపున ఉంచారు. ఇంకా ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7.0 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు స్టీరింగ్ వీల్ మౌంటెడ్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

కొత్త 2022 Hyundai Creta లో కంపెనీ కొన్ని అదనపు భద్రతా ఫీచర్లను అందిస్తోంది. ఈ కారులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లలో భాగంగా బ్లైండ్-స్పాట్ మోనిటరింగ్ కెమెరా, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో కొత్తగా లెఫ్ట్ కన్వర్జెన్స్ డిటెక్షన్ ఫీచర్ ఉంటుంది, ఇది కారు లేన్‌లను విలీనం చేసేటప్పుడు లేదా కదిలేటప్పుడు ఎడమ వైపును పర్యవేక్షిస్తుంది, అవసరమైతే అది అత్యవసర బ్రేక్‌లను కూడా వర్తింపజేస్తుంది.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

అంతేకాకుండా, ఈ కారు డ్రైవర్ ఫెటీగ్ డిటెక్టర్, అడాప్టివ్ హై లైట్, అడాప్టివ్ స్పీడ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా పొందుతుంది. అదనంగా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు మరియు నాలుగు చక్రాల డిస్క్ బ్రేక్‌లను కూడా కంపెనీ అందిస్తోంది. డ్రైవర్ ఎంచుకునేందుకు వీలుగా ఇందులో నార్మల్, స్మార్ట్, ఎకో మరియు స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, బ్రెజిల్‌లో, ఈ కొత్త 2022 Hyundai Creta ను రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. ఇందులో మొదటిది 1.0 లీటర్ టర్బో జిడిఐ డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 120 పిఎస్ పవర్ ను మరియు 171 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 167 పిఎస్ ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది హై-ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

మరి ఈ కొత్త 2022 Hyundai Creta ఎస్‌యూవీ భారత మార్కెట్ కు వస్తుందా? ఈ విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. నిజానికి గతేడాది ఆరంభంలోనే కంపెనీ కొత్త 2020 Creta ని భారత మార్కెట్లో విడుదల చేసింది. కాబట్టి, ఈ కొత్త 2022 మోడల్ ఇప్పట్లో భారత్ కు రాదని తెలుస్తోంది. ఈ మోడల్ మన దేశానికి చేరుకోవడంలో కొంచెం ఆలస్యం కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ.. దీని ఫీచర్స్ అదుర్స్..

సెప్టెంబర్ 2న Hyundai i20 N-Line

Hyundai ఇటీవల భారత మార్కెట్లో ఆవిష్కరించిన తమ కొత్త i20 N-Line ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను సెప్టెంబర్ 2వ తేదీన అధికారికంగా విడుదల చేయనుంది. స్టాండర్డ్ i20 తో పోల్చుకుంటే, ఈ కొత్త i20 N-Line వెర్షన్ డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New 2022 hyundai creta unveiled with adas and ai technology
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X