కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

కొరియన్ కార్ బ్రాండ్ (Kia) భారత మార్కెట్లో ప్రస్తుతానికి ఎస్‌యూవీ, ఎమ్‌పివి వాహనాలను మాత్రమే విక్రయిస్తోంది. అయితే, ఈ బ్రాండ్ అంతర్జాతీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ మొదలుకొని ఎలక్ట్రిక్ కార్ వరకూ వివిధ రకాల మోడళ్లను ఆఫర్ చేస్తోంది. అలాంటి, పాపులర్ వాహనాలలో ఒకటి కియా ఫోర్ట్ (Kia Forte) సెడాన్. ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో కంపెనీ ఈ కారును విక్రయిస్తోంది.

కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

కియా మోటార్స్ తాజా తమ ఫోర్ట్ సెడాన్ లో ఓ కొత్త 2022 మోడల్ ని ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ కియా విక్రయించిన ఫోర్ట్ సెడాన్లతో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 మోడల్ మునుపటి కన్నా మెరుగైన డిజైన్ మరియు స్పోర్టీ ఇంటీరియర్స్ తో లభ్యం కానుంది. కొత్త డిజైన్ అప్‌గ్రేడ్‌లు మరియు ప్రధాన ఫీచర్ అప్‌డేట్‌లతో కంపెనీ కొత్త 2022 కియా ఫోర్ట్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.

కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

కొత్త 2022 కియా ఫోర్ట్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో గొప్ప కాంపాక్ట్ సెడాన్ గా ఉంది మరియు ఇందులో తాజాగా చేసిన కొత్త అప్‌డేట్‌లు ఈ కారు డిమాండ్ ని మరింత పెంచుతాయని కంపెనీ అభిప్రాయపడింది. ప్రత్యేకించి ఉత్తర అమెరికా మార్కెట్లో కియా ఫోర్ట్ బాగా ప్రాచుర్యం పొందిన కారు. సరసమైన ధర, అత్యుత్తమ ఫీచర్లతో ఇది అక్కడి వినియోగదారులను ఆకర్షిస్తోంది.

కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

కియా ఫోర్ట్ 2022 మోడల్ డిజైన్ విషయానికి వస్తే, ఈ కారులో కొత్త హెడ్ లైట్లు, నెక్ట్స్ జనరేషన్ టైగర్-నోస్ గ్రిల్, మరింత స్పష్టమైన విజువల్ అప్పీల్ మరియు కొత్త ట్రంక్ లిడ్ స్పాయిలర్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ వంటి అంశాలతో పాటుగా, స్పోర్టీయర్ ఇంటీరియర్స్, బకెట్ స్టైల్ ఫ్రంట్ సీట్స్ మరియవ విలాసవంచమైన ఇంటీరియర్ క్యాబిన్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

కొత్త 2022 కియా ఫోర్ట్ సెడాన్ మొత్తం నాలుగు ట్రిమ్ స్థాయిలలో అందించబడుతుంది. వీటిలో FE, LXS, GT-Line మరియు GT ఉన్నాయి. వీటిలో, GT-Line ట్రిమ్ స్పోర్ట్ ప్రీమియం ప్యాకేజీని కలిగి ఉంటుంది. ఇందులో సరికొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి ఫాగ్ లైట్లు, స్పోర్ట్ కాంబినేషన్ సీట్లు, స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ మరియు 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

ఈ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కొన్ని ఇతర ట్రిమ్‌లలో కూడా ఉపయోగించబడింది. కస్టమర్లు కొత్త 2022 కియా ఫోర్ట్ ఇష్టపడటానికి ప్రధాన కారణం, ఇందులో 6 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు స్టాండర్డ్ గా అందించనున్నారు. వీటిలో లేన్ ఫాలో అసిస్ట్, నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ మరియు సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

ఇక, కొత్త 2022 కియా ఫోర్ట్ జిటి+ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ట్రిమ్ 201 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది మరియు ఈ ఇంజన్ 7 స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది 147 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఇంటెలిజెంట్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT) గేర్‌బాక్స్ తో లభిస్తుంది.

కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

అమెరికన్ కార్ మార్కెట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌ల వాడకం దాదాపుగా ఆగిపోతున్నప్పటికీ, కియా ఫోర్ట్ సెడాన్ లోపల మాత్రం కంపెనీ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ను అందిస్తోంది. ఇక భారతదేశం విషయానికి వస్తే, కియా ఇండియా ప్రస్తుతానికి మన మార్కెట్లో ఎస్‌యూవీలను అందించడానికి మాత్రమే కట్టుబడి ఉంది. వేరే ఏ ఇతర బాడీ టైప్ వాహనాలను అందించేందుకు కియా ఇప్పట్లో అయితే సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

ఈ నేపథ్యంలో, గ్లోబల్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న కియా ఫోర్ట్ మనదేశంలో ఇప్పట్లో విడుదలయ్యే అకాశాలు అయితే శూన్యమే అని చెప్పాలి. కానీ, మనదేశంలో కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో పాటుగా కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ సెడాన్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి, కియా ఈ కారును భారత మార్కెట్ కోసం పరిగణలోకి తీసుకోవడం అంత రిస్కేమీ కాదనేది మా అభిప్రాయం మీరేమంటారు?

కొత్త 2022 Kia Forte సెడాన్ ఆవిష్కరణ: ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా?

భారత మార్కెట్లో కొత్త 2021 కియా కార్నివాల్ విడుదల..

ఇదిలా ఉంటే, కియా ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి కియా కార్నివాల్ (Kia Carnival) లో కంపెనీ ఓ కొత్త 2021 మోడల్ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త 2021 కియా కార్నివాల్ ధర రూ. 24.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. మునుపటి మోడల్ తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి కొత్త ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New 2022 kia forte sedan unveiled specs features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X