మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

దేశీయ విఫణిలో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి (Maruti Suzuki) యొక్క మారుతి సుజుకి వితారా బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. హ్యుందాయ్ వెన్యూ మరియు టాటా నెక్సాన్ తర్వాత 2021 అక్టోబర్ నెలలో భారతదేశంలో విక్రయించబడిన టాప్ 3 కాంపాక్ట్ SUV లలో మారుతి సుజుకి బ్రెజ్జా ఒకటిగా నిలిచింది.

మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

మారుతి విటారా బ్రెజ్జా 2016 సంవత్సరంలో ప్రారంభించబడింది. అయితే 2020 సంవత్సరంలో ఇది లైట్ వెయిట్ ఫేస్‌లిఫ్ట్ మరియు కొత్త పెట్రోల్ ఇంజిన్‌ను పొందగలిగింది. ప్రస్తుతం ఈ విభాగంలో పెరుగుతున్న పోటీని తట్టుకోడానికి కంపెనీ తదుపరి తరం మారుతి విటారా బ్రెజ్జాను విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త తరం మారుతి విటారా బ్రెజ్జా వచ్చే ఏడాది అంటే 2022 లో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే అంతకు ముందు ఈ సబ్-4 మీటర్ SUV యొక్క కొన్ని చిత్రాలు వెలువడ్డాయి. ప్రస్తుతం బయటపడ్డ ఈ ఫోటోల ప్రకారం ఈ కొత్త తరం బ్రెజ్జా యొక్క ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ చూడవచ్చు.

మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, కంపెనీ ఇప్పుడు కొత్త తరం 2022 మారుతి బ్రెజ్జాలో సన్‌రూఫ్‌ను అందించనుంది. దీనిని మీరు ఈ ఫోటోలలో చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో మెరుగైన క్యాబిన్‌ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ వంటివి ఉంటాయి. ఈ కొత్త మారుతి విటారా బ్రెజ్జాలో ఇంజన్ లైనప్‌కి కూడా అప్‌గ్రేడ్‌లు జరిగే అవకాశం ఉంటుంది.

మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

మనం ఇక్కడ వున్న ఫోటోలను గమనించినట్లైతే ఇది ఆధునిక స్టైలింగ్ పొందినట్లు తెలుసుకోవచ్చు. ఇది మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల దాని ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. 2022 మారుతి బ్రెజ్జా ఎక్స్టీరియర్ ప్రొపైల్ కూడా ఆధునికంగా ఉంటుంది.

మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

రానున్న ఈ కొత్త మోడల్ ప్రస్తుత తరం నుండి వేరు చేయడానికి, కొత్త బాడీ ప్యానెల్లు మరియు డిజైన్ ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి. ఈ అప్‌డేట్‌లలో దాని కొత్త ఫ్రంట్ గ్రిల్, హెడ్ మరియు టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉన్నాయి. మొత్తానికి ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

మారుతి విటారా బ్రెజ్జా కాంపాక్ట్ SUV కంపెనీ యొక్క హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది, ఇది మెరుగైన భద్రతకు సంబంధించినది. గ్లోబల్ NCAP లో 4-స్టార్ రేటింగ్ పొందిన దాని ప్రస్తుత మోడల్‌లా కాకుండా కొత్త-తరం మారుతి బ్రెజ్జా 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ పొందే అవకాశం ఉంటుంది.

మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

ఈ కొత్త బ్రెజ్జాలో డ్యాష్‌బోర్డ్ కొత్త డిజైన్ థీమ్, కొత్త కన్సోల్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఇవ్వబడుతుంది. ఇది నావిగేషన్ మరియు వాయిస్ రికగ్నిషన్‌తో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకి మద్దతు ఇస్తుంది. అంతే కాకూండా ఇందులో ప్యాడిల్ షిఫ్టర్‌లు, 360 డిగ్రీ కెమెరా, పవర్డ్ ORVMలు, వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ AC వంటి అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.

మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం, కొత్త తరం మారుతి బ్రెజ్జాలో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ కె15బి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 103 బిహెచ్‌పి పవర్ మరియు 138 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్‌తో రానున్న కొత్త Maruti Vitara Brezza: వివరాలు

మారుతి సుజుకి కంపెనీ యొక్క ఈ కొత్త బ్రెజ్జా తప్పకుండా దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత మంచి ఆదరణ పొందుతుంది అని భావిస్తున్నాము. ప్రస్తుతం ఉన్న బ్రెజ్జా కంటే కూడా ఆధునిక ఫీచర్స్ కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. కావున తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుంది.

ఇదిలా ఉండగా మారుతి సుజుకి (Maruti Suzuki) ఇటీవల కొత్త 2021 మారుతి సెలెరియో ని విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి విడుదల చేసిన ఈ కొత్త మారుతి సెలెరియో ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే మారుతి సెలెరియో యొక్క టాప్ మోడల్ ధర రూ. 6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
New 2022 maruti suzuki vitara brezza suv spy images leaked details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X