మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ బెంట్లీ ఇండియా, ఈ రోజు (శనివారం) కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరమైన బెంగళూరులో కొత్త 2021 బెంటాయిగా, ఫ్లయింగ్ స్పర్ అనే రెండు కొత్త మోడల్స్ ప్రవేశపెట్టింది. ఇండియా టూర్ ద్వారా కంపెనీ తన రెండు కార్లను దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం కంపెనీ 20,000 యూనిట్ల బెంట్లీ బెంటాయిగా ఉత్పత్తి సంఖ్యను పూర్తి చేసింది. కొత్త బెంట్లీ బెంటెగా ధర భారత మార్కెట్లో అక్షరాలా రూ. 4.01 కోట్లు (ఎక్స్-షోరూమ్).

మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీలలో బెంట్లీ బెంటాయిగా వాహనాలు కూడా ఒకటి. ఇది మొట్టమొదట 2016 సంవత్సరంలో ప్రారంభించబడింది. కొత్త బెంటాయిగా సంస్థ యొక్క సాంప్రదాయ రూపకల్పన దాని ఆకర్షణీయమైన డిజైన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది పెద్ద మ్యాట్రిక్స్ గ్రిల్‌ను కలుపుకొని మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

కొత్త బెంట్లీ బెంటాయిగాలో సిగ్నేచర్ స్టైల్ క్రిస్టల్ గ్లాస్వేర్ కొత్త ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్ లాంప్ టెక్నాలజీతో ఇవ్వబడింది. దాని ముందు బంపర్‌ను మరింత దూకుడుగా ఉంది. ఈ ఎస్‌యూవీలో తొలిసారిగా హిట్ వెయిట్ ఆర్మ్ విండ్‌స్క్రీన్ వైపర్స్ ఇవ్వబడ్డాయి. దాని వెనుక భాగంలో, ఓవల్ షేప్ ఎల్ఈడి టెయిల్ లాంప్స్ మరియు పెద్ద బూట్ తో ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కలిగి ఉంది.

MOST READ:2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

కొత్త బెంటాయిగా క్యాబిన్‌ ఇప్పుడు మరిన్ని అప్‌డేట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ సిస్టంలో హై రిజల్యూషన్ గ్రాఫిక్స్ కూడా అందించబడ్డాయి. దీని లోపలి భాగం మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా ఉంది.

మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

కొత్త 2021 బెంటాయిగాలో 4.0 ట్విన్ టర్బో ఛార్జ్డ్ వి 8 పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్ 542 బిహెచ్‌పి శక్తిని మరియు 770 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం అవుతుంది. అంతే కాకూండా దాని టాప్ స్పీడ్ గంటకు 290 కిలోమీటర్లు అని కంపెనీ అధికారికంగా పేర్కొంది.

MOST READ:నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

ఇక బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ విషయానికి వస్తే, ఇది కంపెనీ యొక్క ప్రధాన లగ్జరీ 4-డోర్స్ సెడాన్. ఈ 5-సీట్ల కారు ఫ్లయింగ్ స్పర్ వి 8 మరియు ఫ్లయింగ్ స్పర్ డబ్ల్యూ 12 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ .3.21 కోట్లు, రూ .3.41 కోట్లు (ఎక్స్‌షోరూమ్).

మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ 4.0-లీటర్ వి 8 మరియు 6.0-లీటర్ డబ్ల్యూ 12 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. మొదటి ఇంజిన్ 528 బిహెచ్‌పి పవర్ మరియు 680 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, 6.0-లీటర్ ఇంజన్ 635 బిహెచ్‌పి పవర్ మరియు 900 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

ఇది ఇంజిన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ ని కలిగి ఉంది. 4.0-లీటర్ ఇంజిన్‌తో ఉన్న ఈ మోడల్ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నించి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో, 6.0-లీటర్ ఇంజన్ కలిగిన శక్తివంతమైన మోడల్ కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ కార్లు చూడటానికి చాలా అద్భుతంగా మరియు ఆకర్షణీయంగా ఉండటంతో పాటు లేటెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

భారతీయ మార్కెట్లో సంబంధిత విభాగంలో అత్యంత విలాసవంతమైన సమర్పణలలో బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఉన్నాయి. లగ్జరీ బ్రాండ్ దేశంలో కొనసాగుతున్న పర్యటనతో బెంట్లీ యొక్క పరిధిని పెంచడానికి మరియు ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే పనిలో ఉంది. ఈ కారణంగా ఇప్పుడు మన బెంగరూరుకి వీటిని తీసుకురావడం జరిగింది.

MOST READ:మళ్ళీ పట్టాలెక్కిన ‘గాతిమాన్ ఎక్స్‌ప్రెస్'.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్

Most Read Articles

English summary
2021 Bentley Bentayga & New Flying Spur Showcased In Bengaluru. Read in Telugu.
Story first published: Saturday, April 3, 2021, 20:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X