బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మరియు ఖరీదైన కార్లలో ఒకటైన బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీ కోసం కంపెనీ ఓ సరికొత్త ఎస్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. బ్రటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ బెంట్లీ యొక్క ఫ్లాగ్‌షిప్ మరియు మొట్టమొదటి ఎస్‌యూవీ మోడల్ అయిన బెంటైగాలో కొత్తగా వచ్చిన ఈ ఎస్ వెర్షన్ మరింత డైనమిక్ మరియు స్పోర్టి డ్రైవ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

బెంట్లీ బెంటైగా శ్రేణిలోని నాల్గవ మోడల్ అయిన ఈ ఎస్ వెర్షన్‌లో కంపెనీ సమర్థవంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్, 4.0-లీటర్ టర్బోచార్జ్డ్ వి8 మరియు శక్తివంతమైన 6.0-లీటర్, 12-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఆల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీ నాలుగు, ఐదు లేదా ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.

బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

కొత్త బెంట్లీ బెంటైగా ఎస్ మోడల్‌లో డిజైన్ పరంగా స్వల్ప మార్పులు ఉంటాయి. ఇందులో చాలా చోట్ల క్రోమ్ గార్నిష్ మరియు గ్లోసీ బ్లాక్ యాక్సెంట్ డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. హెడ్ ​​లాంప్స్ మరియు టెయిల్ లాంప్స్, బ్లాక్ డోర్ మిర్రర్స్ మరియు బ్లాక్ స్ప్లిట్ ఓవల్ టెయిల్ పైప్‌లకు బెంట్లీ డార్క్ టింట్ లెన్స్‌లను జోడించారు. కానీ, దీని 22 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను మాత్రం బ్లాకవుట్ చేయలేదు.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

ఇంటీరియర్స్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, కొత్త బెంట్లీ బెంటైగా ఎస్ స్పోర్టీ వెర్షన్‌లో కొత్త సీట్లు, ప్రత్యేకమైన కుట్టు, కొత్త కలర్ స్ప్లిట్ మరియు అల్కాంటారా ప్రీమియం లెథర్, అధునాతన ఇన్స్ట్రుమెంట్ పానెల్, సెంటర్ కన్సోల్, డోర్ ప్యాడ్లు మరియు సీట్ బోల్స్టర్లలో కలర్ యాక్సెంట్స్ ఉంటాయి. ఇవి కొత్త బెంటైగా ఎస్ మోడల్ యొక్క ఎక్స్టీరియర్ థీమ్‌కి మ్యాచ్ అయ్యేలా ఉంటాయి.

బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

ఇంజన్ పరంగా చూసుకుంటే, కొత్త 2021 బెంటైగా ఎస్ వెర్షన్‌లో 4.0 లీటర్, ట్విన్-స్క్రోల్ టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 542 బిహెచ్‌పి శక్తిని మరియు 770 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 4.4 సెకన్లలో సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 290 కిలోమీటర్లు.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

కొత్త బెంట్లీ బెంటైగా ఎస్ అనేక ఆఫ్-రోడ్ టెర్రైన్ మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది. వీటిలో స్నో అండ్ వెట్ గ్రాస్, డర్ట్ అండ్ గ్రావెల్, మడ్ అండ్ ట్రైల్ మరియు సాండ్ మోడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీ 500 మి.మీ వాటర్ వేడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

బెంట్లీ బెంటైగా ఎస్ మెరుగైన స్పోర్ట్ మోడ్ ద్వారా ఉత్తమ సామర్థ్యాన్ని అందిస్తుంది. దీని ఎయిర్ సస్పెన్షన్ డంపింగ్‌లో అదనంగా 15 శాతం పెరుగుదల ఉంటుంది మరియు ఇందులోని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కారణంగా మెరుగైన స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ మరియు తక్కువ బాడీ-రోల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

ఈ అధునాతన బెంట్లీ ఎస్ ఎస్‌యూవీలో బెంట్లీ డైనమిక్ రైడ్ సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ యాక్టివ్ రోల్ కంట్రోల్ టెక్నాలజీని కలిగిన ఎస్‌యూవీ. అంటే, ఈ కారుని వేగంగా నడుపుతున్నప్పుడు లేదా మలుపుల వద్ద ప్రమాదవశాత్తూ దొర్లిపోకుండా ఉండేందుకు ఈ ఫీచర్ సహకరిస్తుంది. ఇది ఈ విభాగంలో ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్, లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్‌ఎస్‌క్యూ 8 లేదా రాబోయే పోర్ష్ కయూన్ టర్బో వంటి ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.

బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

ఆల్ట్రా లగ్జరీ సెడాన్లను తయారు చేసే ఈ బ్రిటీష్ కార్ బ్రాండ్ తొలిసారిగా తయారు చేసిన మొట్టమొదటి ఎస్‌యూవీనే ఈ బెంట్లీ బెంటైగా. బెంట్లీ ఈ పాపులర్ ఎస్‌యూవీని 2015లో ప్రపంచానికి పరిచయం చేసింది. 2012 జెనీవా మోటార్ షోలో బెంట్లీ ఆవిష్కరించిన ఈఎక్స్‌‌పి 9 ఎఫ్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది.

MOST READ:నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]

బెంట్లీ బెంటైగా ఎస్ వెర్షన్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల!

భారతదేశంలో కూడా బెంట్లీ తమ బెంటైగా ఎస్‌యూవీని విక్రయిస్తోంది. కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త 2021 మోడల్‌ను కూడా విడుదల చేసింది. భారత మార్కెట్లో దీని ధర రూ.4.10 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఢిల్లీ, ముంబై మరియు హైదరాబాద్ నగరాల్లో ఈ మోడల్ కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

Most Read Articles

English summary
New Bentley Bentayga S Version Revealed, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X