నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు: మారుతి సెలెరియో, స్కోడా స్లావియా మరెన్నో..

కోవిడ్-19 సంక్షోభం తర్వాత, ఆటోమొబైల్ పరిశ్రమలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో, ప్రస్తుత నవంబర్ నెలలో కార్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. వీటిలో ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్, స్కోడా ఆటో యొక్క మిడ్-సైజ్ సెడాన్ స్లావియా, మెర్సిడెస్ బెంజ్ నుండి పవర్‌ఫుల్ ఏఎమ్‌జి ఏ45ఎస్ హ్యాచ్‌బ్యాక్, ఆడి ఇండియా నుండి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మరియు స్వీడిష్ కార్ బ్రాండ్ వోల్వో నుండి ఎక్స్‌సి90 హైబ్రిడ్ కార్లు మొదలైనవి ఉన్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు: మారుతి సెలెరియో, స్కోడా స్లావియా, ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

1. కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో (2021 Maruti Suzuki Celerio)

పాత తరం మోడల్ తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో డిజైన్, ఫీచర్స్ మరియు మైలేజ్ పరంగా ఎంతో అధునాతంగా ఉంది. భారత మార్కెట్లో కొత్త 2021 సెలెరియో ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. అలాగే, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ప్రత్యేకించి యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని మారుతి సుజుకి ఈ రెండవ తరం సెలెరియో కారును చాలా మోడ్రన్ గా డిజైన్ చేసింది.

నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు: మారుతి సెలెరియో, స్కోడా స్లావియా, ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ కొత్త తరం సెలెరియో కారును LXi, VXi, ZXi మరియు ZXi+ అనే నాలుగు ట్రిమ్ లలో మొత్తం ఏడు వేరియంట్లలో విడుదల చేసింది. ఇది ఫైర్ రెడ్ మరియు స్పీడీ బ్లూ అనే రెండు కొత్త రంగులతో పాటు సిల్కీ సిల్వర్, గ్లిస్టరింగ్ గ్రే, ఆర్కిటిక్ వైట్ మరియు కెఫిన్ బ్రౌన్ వంటి మొత్తం 6 రంగులలో లభిస్తుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, కొత్త సెలెరియో లీటరుకు 26.68 కి.మీ (పెట్రోల్, ఏఎమ్‌టి) మైలేజీని ఇస్తుందని మారుతి సుజుకి పేర్కొంది.

నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు: మారుతి సెలెరియో, స్కోడా స్లావియా, ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

2. స్కోడా స్లావియా (Skoda Slavia)

స్కోడా ఆటో ఇండియా తమ సరికొత్త మిడ్-సైజ్ సెడైన్ 'స్కోడా స్లావియా' (Skoda Slavia) ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. కొత్త స్కోడా స్లావియా సెడాన్ ను కంపెనీ మూడు ట్రిమ్‌లలో అందించనుంది. వీటిలో యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ ట్రిమ్‌లు ఉన్నాయి. ఈ మూడు ట్రిమ్‌లు మొత్తం రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. ప్రస్తుతానికి ఈ కారులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మిడ్-సైజ్ సెడాన్లకు పోటీగా నిలుస్తుంది.

నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు: మారుతి సెలెరియో, స్కోడా స్లావియా, ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

స్కోడా స్లావియా సెడాన్ కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ అనే కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. స్కోడా స్లావియా కోసం కంపెనీ ప్రీ-బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో దీని డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి కంపెనీ ఇంకా దీని ధరను వెల్లడించలేదు. ఇది 1 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ (115 బిహెచ్‌పి పవర్ / 178 ఎన్ఎమ్ టార్క్‌) మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ (150 బిహెచ్‌పి పవర్ / 250 న్యూటన్ మీటర్ టార్క్) ఆప్షన్లతో లభ్యం కానుంది.

నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు: మారుతి సెలెరియో, స్కోడా స్లావియా, ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

3. ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ (Audi Q5 Facelift)

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి భారత మార్కెట్లో తమ కొత్త 'ఆడి క్యూ5' ఫేస్‌లిఫ్ట్ (Audi Q5 Facelift) మోడల్ ను ఇటీవలే విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 58.93 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని అల్ట్రా బ్లూ మరియు డిస్ట్రిక్ట్ గ్రీన్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో విడుదల చేశారు. మునుపటి మోడల్ తో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్ లో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసింది. ఇది రెండు వేరియంట్లలో మరియు ఒకే పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ ను సందర్శించి కానీ లేదా డీలర్‌షిప్ సందర్శించి కానీ నుండి రూ. 2 లక్షల టోకెన్ అమౌంట్ తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు: మారుతి సెలెరియో, స్కోడా స్లావియా, ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

4. మెర్సిడెస్-ఏఎమ్‌జి ఏ45ఎస్ (Mercedes-AMG A45S)

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ Mercedes-Benz భారత మార్కెట్లో తమ శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ మెర్సిడెస్-ఏఎమ్‌జి ఏ45ఎస్ ను విడుదల చేసింది. ఇది భారతదేశంలోనే 'అత్యంత శక్తివంతమైన లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ మరియు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ ఇంజన్ సిరీస్ కలిగిన ప్రొడక్షన్ కారు అని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో ఈ హై పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 79.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఈ కారులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 421 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు: మారుతి సెలెరియో, స్కోడా స్లావియా, ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

5. వోల్వో ఎక్స్‌సి90 పెట్రోల్-హైబ్రిడ్ (Volvo XC90 Petrol Hybrid)

స్వీడన్ కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో, తాజాగా భారతదేశంలో తమ కొత్త వోల్వో ఎక్స్‌‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ (Volvo XC90 Petrol Hybrid) కారును విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త వోల్వో ఎక్స్‌‌సి90 పెట్రోల్ హైబ్రిడ్ ప్రారంభ ధర రూ. 89.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ 7-సీటర్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ 48వి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడిన పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 300 హార్స్ పవర్ ల శక్తిని మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉండి, ఇంజన్ నుండి వెలువడే శక్తిని నాలుగు చక్రాలకు (ఆల్-వీల్ డ్రైవ్) సమానంగా పంపిణీ చేస్తుంది.

Most Read Articles

English summary
New cars launched in november 2021 maruti celerio skoda slavia aud q5 facelift and more details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X