లెర్నర్ లైసెన్స్ పొందే విధానంలో మార్పు.. జూలై 1 నుంచే అమలు

భారతదేశంలో రోజురోజుకి వాహనాల సంఖ్య పెరుగుతున్న కారణంగా ట్రాఫిక్ కూడా ఎక్కువవుతోంది. ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం కేవలం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే కాదు, డ్రైవింగ్ పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా.

జులై 1 నుంచి గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్‌కి కొత్త రూల్స్

దేశంలోని ప్రజా రహదారులపై వాహనాలు డ్రైవ్ చేయాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అయితే ఇప్పుడు ఈ లైసెన్స్ పొందాలంటే ప్రాంతీయ రవాణా కార్యాలయం సందర్శించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం దీనిని మరింత సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జులై 1 నుంచి గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్‌కి కొత్త రూల్స్

ఇందులో భాగంగానే పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు విజయవంతగా ఉత్తీర్ణత సాధించిన తర్వాత వారు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే సమయంలో వారికి అక్కడ ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ నిర్వించబోరు. కానీ ప్రస్తుతం ఇది మొత్తం ఆర్.టి.ఓ చూసుకుంటుంది. కానీ ఇకపై ఆర్.టి.ఓ కార్యాలయంలో ఇటువంటివి ఉండవని రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

జులై 1 నుంచి గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్‌కి కొత్త రూల్స్

రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, ఈ నియమ 2021 జులై 01 నుంచి అమల్లోకి వస్తుంది. దీని వల్ల గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ లో చేరే అభ్యర్థులకు దీనిపై అవసరమైన ట్రైనింగ్ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉంటుంది, కావున ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది.

జులై 1 నుంచి గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్‌కి కొత్త రూల్స్

ప్రభుత్వంచే గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ కి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏవో ఇక్కడ చూద్దాం..

గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ లో అభ్యర్థులకు ఉత్తమమైన ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ సెంటర్ లో సిమ్యులేటర్లు మరియు దానికి కావాల్సిన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే అభ్యర్థి దాదాపు తన ట్రైనింగ్ మొత్తాన్ని ట్రైనింగ్ సెంటర్ లోనే నేర్చుకుంటారు కావున, దానికి కావలసిన అన్ని సదుపాయాలు అక్కడ అందుబాటులో ఉంచాలి.

జులై 1 నుంచి గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్‌కి కొత్త రూల్స్

1988 మోటారు వాహన చట్టం ప్రకారం ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న అభ్యర్థులకు అనుకూలమైన రెమెడియల్ మరియు రిఫ్రెషర్ కోర్సులు పొందవచ్చు.

జులై 1 నుంచి గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్‌కి కొత్త రూల్స్

ప్రస్తుతం డ్రైవింగ్ టర్నింగ్ సెంటర్స్ లో డ్రైవింగ్ గురించి మొత్తం తెలుసుకున్న తరువాత వారికి డ్రైవింగ్ లైసెన్స్ కి దరఖాస్తు చేసిన సమయంలో వారికి అక్కడ టెస్ట్ డ్రైవ్ నిర్వహించే అవకాశం ఉండదు. కావున గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ లో తీసుకునే డ్రైవింగ్ లైసెన్స్ పొందే వారికీ సహాయంగా ఉంటుంది.

జులై 1 నుంచి గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్‌కి కొత్త రూల్స్

మనం ముందు చెప్పుకున్నట్లుగా డ్రైవింగ్ చేయడంలో అనుభవం లేకపోవడం కూడా నైపుణ్యం రోడ్డు ప్రమాదానికి కారణమవుతుంది. ఎందుకంటే సరైన నియమాలు పాటించని వాహనదారుడు తనకు తాను ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే కాకుండా, తన తోటి ప్రయాణకులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది.

జులై 1 నుంచి గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్‌కి కొత్త రూల్స్

2019 మోటారు వాహన చట్టం ప్రకారం అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ అక్రిడిటేషన్‌కు సంబంధించి నియమాలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన డ్రైవింగ్ సెటర్ లో సమర్ధవంతమైన డ్రైవింగ్ నేర్చుకున్న వాహనదారుల వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గుతుంది.

Most Read Articles

English summary
New Rules For Driver Training Center Applicable From Next Month. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X