దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

భారత మార్కెట్లో Force Motors (ఫోర్స్ మోటార్స్) తన 2021 Force Gurkha (ఫోర్స్ గుర్ఖా) ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Force Gurkha ఆఫ్-రోడ్ SUV ఇప్పుడు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి లోపల మరియు బయట కూడా చాలా అప్డేట్స్ పొందింది. కొత్త Force Gurkha 4X4 ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ప్రీమియం లుక్‌తో తీసుకురాబడింది. మహీంద్రా థార్‌కు ప్రత్యర్థిగా ఉన్న ఈ ఎస్‌యూవీని కంపెనీ పండుగ సీజన్‌లో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంటుంది.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

కొత్త 2021 Force Gurkha ఐదు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెడ్, గ్రీన్, వైట్, ఆరెంజ్ మరియు గ్రే కలర్స్. ఈ కొత్త SUV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఈ మార్పులన్నింటినీ చూస్తే, కొత్త Force Gurkha ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఉన్న Mahindra Thar SUV కి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

2021 Force Gurkha 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన SUV కాన్సెప్ట్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది కొన్ని అప్డేట్స్ కలిగి ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. Force Gurkha అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో పునర్నిర్మించిన రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ మరియు ఎల్ఈడీ స్టాప్ లైట్‌ వంటి వాటిని పొందుతుంది.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

2021 Force Gurkha పెద్ద అక్షరాలతో వ్రాయబడిన గూర్ఖా అనే అక్షరాలతో ఫ్రంట్ బంపర్‌ను పొందుతుంది. ఇది కాకుండా, బంపర్‌లో బ్లాక్ క్లాడింగ్ మరియు హాలోజన్ ఫాగ్ ల్యాంప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపారులము ఆకట్టుకునే విధంగా చేస్తాయి.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

ఇక Gurkha యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది 16 ఇంచెస్ స్టీల్ వీల్స్, బ్లాక్ ORVM లు, బ్లాక్ రూఫ్ రైల్స్, ఫంక్షనల్ రాక్‌లు మరియు టర్న్ ఇండికేటర్‌లను పొందుతుంది. ఇవి వాహనాన్ని చాలా దూకుడుగా చూపిస్తాయి.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

కొత్త Force Gurkha ఎక్స్టీరియర్ డిజైన్ కంటే కూడా ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి. Gurkha లోపల కొత్త బ్లాక్ థీమ్ క్యాబిన్ లభిస్తుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఇప్పుడు వెనుక భాగంలో బెంచ్ సీట్లకు బదులుగా, కెప్టెన్ సీట్లు ఇవ్వబడ్డాయి, దీని కారణంగా ఈ కారు ఇప్పుడు లోపలి నుండి మరింత ప్రీమియంగా మారింది.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

Force Gurkha ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ చేసే కొత్త 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఉంటుంది. ఇది వాహనం యొక్క స్పీడ్ వంటి ఇతర సమాచారాన్ని అందిస్తుంది.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

కొత్త 2021 Force Gurkha యొక్క స్టీరింగ్ వీల్ కూడా అడ్జస్టబుల్ చేయగల త్రీ స్పోక్ యూనిట్‌కి అప్‌గ్రేడ్ చేయబడింది. తక్కువ ఎన్‌విహెచ్ స్థాయికి మరియు ఆఫ్-రోడ్ డ్రైవ్ తర్వాత వెహికల్ మురికిగా ఉంటే శుభ్రపరిచే సౌలభ్యం కోసం ఫ్లోర్ మ్యాట్‌లు అందించబడతాయి.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

Force Gurkha కొలతల విషయానికి వస్తే, ఇది 4,116 మి.మీ పొడవు, 1,812 మి.మీ వెడల్పు, 2,075 మి.మీ ఎత్తు, 2,400 మి.మీ వీల్‌బేస్ మరియు 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. కావున ఆఫ్ రోడింగ్ చేయడానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

2021 Force Gurkha యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.6-లీటర్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ అనుసంధానించబడింది. ఇందులోని ఇంజిన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ మహీంద్రా థార్ కంటే తక్కువ శక్తివంతమైనది. మహీంద్రా థార్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

2021 Gurkha లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఏబీఎస్ విత్ ఈబిడి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహనదారుని భద్రతను నిర్ధరిస్తాయి.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

Force Gurkha యొక్క యాక్ససరీస్ విషయానికి వస్తే, కంపెనీ విండ్‌స్క్రీన్ బార్, రూఫ్ క్యారియర్, రియర్ ల్యాడర్, రూఫ్ రైల్స్, అల్లాయ్ వీల్స్ & AT టైర్లు, వెనుక వైపున ఉన్న పిల్లల సీట్లను ప్రత్యేకంగా అందిస్తుంది. అదేవిధంగా కంపెనీ ఈ కొత్త SUV కి 3 సంవత్సరాల లేదా 1,50,000 కిమీ వారంటీని అందిస్తుంది.

దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న 2021 Force Gurkha ఆవిష్కరణ; వివరాలు

ఒక సంవత్సర కాలం నిరీక్షణ తరువాత కంపెనీ 2021 Force Gurkha ఆఫ్-రోడ్ SUVని ఆవిష్కరించింది. ఇది దేశీయ మార్కెట్లో Mahindra Thar మరియు Maruti Suzuki Jimny వాటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. Force Gurkha ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని రూ. 10 లక్షల నుండి రూ .12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
New force gurkha officially revealed design features price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X