ప్రస్తుత తరం మారుతి సుజుకి సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా?

మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ బ్యాచ్‌బ్యాక్ సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా? తాజా నివేదికలు అవుననే చెబుతున్నాయి. మారుతి సుజుకి సెలెరియోలో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ప్రస్తుత తరం సెలెరియో అమ్మకాలను కంపెనీ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుత తరం మారుతి సుజుకి సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా?

అయితే, కంపెనీ వెబ్‌సైట్ నుండి ఈ మోడల్ ఇంకా తొలగింపబడలేదు. అంతేకాకుండా, దేశంలోని కొన్ని మారుతి సుజుకి అరెనా డీలర్‌షిప్ కేంద్రాలలో ఇప్పటికీ ప్రస్తుత తరం సెలెరియో స్టాక్ ఉన్నట్లు సమాచారం. ఈ స్టాక్ పూర్తిగా క్లియర్ చేయగానే కంపెనీ తమ కొత్త తరం సెలెరియోని విడుదల చేసే అకాశం ఉంది.

ప్రస్తుత తరం మారుతి సుజుకి సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా?

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మారుతి సుజుకి తమ ప్లాంట్‌లో ఈ పాత తరం సెలెరియో ఉత్పత్తిని కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మారుతి తమ కొత్త తరం సెలెరియో కారును దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది.

ప్రస్తుత తరం మారుతి సుజుకి సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా?

మారుతి సుజుకి ఇండియా తొలిసారిగా 2014లో సెలెరియో కారును దేశీయ విపణిలో విడుదల చేసింది. అప్పట్లో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో వచ్చిన మొట్టమొదటి మోడల్ కూడా ఇదే. సాంప్రదాయమైన సివిటి (కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పోల్చుకుంటే ఈ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ చాలా తక్కువ ధరను కలిగి ఉంటుంది.

ప్రస్తుత తరం మారుతి సుజుకి సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా?

ఈ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ పెర్ఫార్మెన్స్ విషయంలో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇతర ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లకు ఏమాత్రం తీసిపోదు. సెలెరియో అత్యంత సరసమైన ధరకే లభించే ఆటోమేటిక్ కారుగా మంచి ఆదరణ పొందింది. అయితే, మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా, కాలక్రమేణా ఈ మోడల్ అమ్మకాలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి.

ప్రస్తుత తరం మారుతి సుజుకి సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా?

ఈ నేపథ్యంలో, సెలెరియోకి పూర్వవైభవాన్ని కల్పించేందుకు మారుతి సుజుకి ఈ మోడల్‌కు సరికొత్త రూపాన్ని ఇవ్వనుంది. అలాగే, ఈ కొత్త తరం సెలెరియోలోని ఇంజన్, గేర్‌బాక్స్ మరియు ఫీచర్లలో కూడా కంపెనీ పలు మార్పులు చేర్పులు చేయనుంది. మారుతి సుజుకి ప్రస్తుతం మార్కెట్లో అందిస్తున్న అధునాతన మోడళ్ల మాదిరిగానే ఈ కొత్త తరం సెలెరియోని కూడా హియర్టెక్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తోంది.

ప్రస్తుత తరం మారుతి సుజుకి సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా?

ప్రస్తుతం తరం సెలెరియోతో కంటే, ఇది మరింత పెద్దదిగా ఉంటుంది. ఇందులో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లు మరియు బంపర్‌లతో ఇది రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ కూడా మునుపటి కన్నా ఎక్కువగా ఉంటుందని సమాచారం. పెరిగిన వీల్‌బేస్ కారణంగా, కొత్త సెలెరియో మునుపటి కన్నా మరింత మెరుగైన క్యాబిన్ స్పేస్ లభించే అవకాశం ఉంది.

ప్రస్తుత తరం మారుతి సుజుకి సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా?

ఇంకా ఇందులో, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన కొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, రెండు చివర్లలో రీడిజైన్ చేయబడిన బంపర్‌లు మొదలైన మార్పులను ఆశించవచ్చు. ఇంటీరియర్‌లో కూడా క్యాబిన్ లేఅవుట్‌ని పూర్తిగా రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత తరం మారుతి సుజుకి సెలెరియో డిస్‌కంటిన్యూ అయిందా?

అంతేకాకుండా, ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
New Gen Maruti Celerio Launch Expected Soon; Current Gen Celerio Will Be Discontinued. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X