సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'విటారా బ్రెజ్జా'లో కంపెనీ ఓ కొత్త తరం (న్యూ జనరేషన్) మోడల్‌ను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో ఈ కారును తయారు చేస్తున్నట్లు సమాచారం.

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

ఆటోకార్‌ఇండియా నివేదిక ప్రకారం, కొత్త తరం మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరింత బోల్డ్ డిజైన్, భారీగా అప్‌డేట్ చేయబడిన క్యాబిన్ మరియు కొత్త ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

కొత్త తరం మారుతి విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీ 2021 చివరి నాటికి భారతదేశంలో విక్రయించే అవకాశాలు ఉన్నట్లు సదరు నివేదికలో పేర్కొన్నారు. ఈ కొత్త తరం మోడల్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది, సెకండ్ జనరేషన్ విటారా బ్రెజ్జా అవుతుంది. ఇప్పటి వరకూ ఈ మోడల్‌లో పూర్తిగా రీడిజైన్ చేయబడిన వెర్షన్ రాలేదు.

MOST READ: ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్‌ ఆవిష్కరించిన టాటా మోటార్స్ ; వివరాలు

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న విటారా బ్రెజ్జా బోల్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, కొత్తగా వస్తున్న నెక్స్ట్-జెన్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరింత బోల్డ్ కొత్త డిజైన్‌తో రానుంది. ఇందులో షార్ప్ లైన్స్, సన్నటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు కారు చుట్టూ కొన్ని స్టైలింగ్ అంశాలతో దీనిని రూపొందించే అవకాశం ఉంది.

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

అయితే, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా యొక్క ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటుంది. కొలతల పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. కొత్త-తరం విటారా బ్రెజ్జా ప్రస్తుత-తరం మోడల్ మాదిరిగానే ముందుకు సాగి ఉన్నట్లుగా కఠినమైన మరియు నిటారుగా ఉన్న వైఖరిని కలిగి ఉంటుంది.

MOST READ: షాకింగ్ న్యూస్: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డిస్‌కంటిన్యూ, వైబ్‌సైట్ నుండి మాయం!

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

ప్రస్తుతానికి ఈ కొత్త కారులో ఉండబోయే ఇంటీరియర్స్ గురించి చాలా తక్కువ సమాచారం ఉన్నప్పటికీ, కొత్త-తరం విటారా బ్రెజ్జాలో మెరుగైన క్యాబిన్ స్థలాన్ని అందించేందుకు దాని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మరియు సీటింగ్ స్ట్రక్చర్‌లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఇందులో సరికొత్త ఫీచర్లు మరియు పరికరాలను కూడా జోడించవచ్చని సమాచారం.

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి పలు ప్రీమియం ఫీచర్లను ఇందులో ఆఫర్ చేసే అవకాశం ఉంది.

MOST READ: ఇంటెర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు వెరీ సింపుల్.. ఇలా చేయండి

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

మారుతి సుజుకి బ్రాండ్ నుండి అత్యంత పాపులర్ అయిన హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త తరం విటారా బ్రెజ్జాను నిర్మించనున్నారు. ఇది మరింత మెరుగైన నిర్మాణ బలాన్ని కలిగి ఉండి, దాని భద్రతను మెరుగుపరుస్తుంది. ఈ హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై రానున్న కొత్త తరం విటారా బ్రెజ్జాలో భవిష్యత్తులో వివిధ రకాల పవర్‌ట్రైన్ ఆప్షన్లను అందించడానికి వీలుగా ఉంటుంది, ఇందులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌ను అమర్చడానికి కావల్సిన సదుపాయాలు కూడా ఉంటాయి.

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

కొత్త తరం మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో డిజైన్, కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఇందులో అదే 1.5-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. ఈ ఇంజన్ 104 బిహెచ్‌పి పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: డోనాల్డ్ ట్రంప్ వాడిన కారు వేలంలో పాల్గొంటున్న ఇండియన్, ఎవరో తెలుసా ?

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థతో కూడా వస్తుంది. కొత్త-తరం విటారా బ్రెజ్జాలో మెరుగైన సామర్థ్యం మరియు పనితీరు కోసం పెద్ద ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

కాగా, ప్రస్తుతం మార్కెట్లో టర్బో పెట్రోల్ ఇంజన్స్ మరియు డీజిల్ ఇంజన్లకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని కంపెనీ తమ విటారా బ్రెజ్జాలో కూడా ఈ తరహా ఇంజన్లను ఆఫర్ చేస్తుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి విటారా బ్రెజ్జాలోని ఏకైక ఇంజన్ ఆప్షన్ కారణంగా దీని అమ్మకాలు క్రమంగా క్షీణిస్తున్నాయి.

MOST READ: రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

సరికొత్త 2021 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నిస్సాన్ మాగ్నైట్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్, కియా సోనెట్ మరియు హ్యుందాయ్ వెన్యూ మోడళ్లకు కొత్త తరం విటారా బ్రెజ్జా పోటీగా నిలుస్తుంది. అయితే, ఈ పోటీలో విటారా బ్రెజ్జా నిలదొక్కుకొని అగ్రస్థానాన్ని చేరుకోవాలంటే, సరికొత్త డిజైన్‌తో పాటుగా విభిన్న ఇంజన్ ఆప్షన్లను కూడా కలిగి ఉండాలనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
New-Gen Maruti Suzuki Vitara Brezza India Launch May Take Place In Late 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X