2021 స్కోడా ఆక్టేవియా రివ్యూ వీడియో.. లేటెస్ట్ ఫీచర్స్ & సూపర్ పర్ఫామెన్స్

స్కోడా కంపెనీ ఇప్పుడు ఎట్టకేలకు తన నాల్గవ తరం ఆక్టేవియాను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ వెర్షన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంది. ఇటీవల మేము ఈ కొత్త 2021 ఆక్టేవియాను డ్రైవ్ చేసాము. ఈ సెడాన్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూడండి.

మేము డ్రైవ్ చేరిన కారు ఎల్ అండ్ కె యొక్క టాప్ వేరియంట్. ఈ వేరియంట్ యొక్క ముందు భాగంలో చాలా ఎక్కువ మొత్తంలో క్రోమ్‌ ఉంది. మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం ఇరువైపులా స్పోర్టి బంపర్‌ను కలిగి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఆక్టేవియా మోడల్ 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. అయితే భారతమార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఆక్టేవియా 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా ఫీచర్ లేదు.

దీనికి 140 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. వెనుక భాగంలో స్కోడా లోగోను ఉండదు, కానీ బూట్ అంతటా బోల్డ్‌గా రాయబడిన 'స్కోడా' పేరును చూడవచ్చు. ఇది కంపెనీ యొక్క లేటెస్ట్ డిజైన్. కొత్త ఆక్టేవియా సెడాన్ లో రియర్ పార్కింగ్ కెమెరా ఫీచర్ కూడా ఉంటుంది.

కొత్త 2021 ఆక్టేవియా క్యాబిన్ లోపలికి అడుగు పెట్టాడనే మీకు అద్భుతమైన క్యాబిన్ స్వాగతం పలుకుతుంది. క్యాబిన్ మొత్తంలో లెదర్ మరియు అల్కాంటారా ఉపయోగించినట్లు తెలుస్తుంది. డాష్‌బోర్డ్ డ్యూయల్-టోన్ కలర్‌లో పూర్తయింది. డాష్‌బోర్డ్‌ సెంటర్ స్టేజ్ తీసుకుంటుంది. ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ద్వారా వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి వాటిని కలిగి ఉంటుంది.

2021 స్కోడా ఆక్టేవియా రివ్యూ వీడియో

కొత్త 2021 స్కోడా ఆక్టేవియాలో పుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, దీనిని వర్చువల్ కాక్‌పిట్ అని పిలుస్తారు. ఇది 10.25 ఇంచెస్ స్క్రీన్ ఇది వెహికల్ గురించి చాలా సమాచారాన్ని ఇస్తుంది. ఇందులో ఉన్న సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. కావున లాంగ్ డ్రైవ్ లో కూడా వాహనదారుణ్ని అలసిపోనివ్వకుండా చేస్తాయి.

కొత్త 2021 స్కోడా ఆక్టేవియా 2.0 లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే వస్తుంది. ఈ సెడాన్ యొక్క రెండు వేరియంట్లు ఒకే మోటారుతో అందించబడతాయి. ఇందులో ఉన్న టర్బో-పెట్రోల్ యూనిట్ 4,180 - 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 187.4 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 - 3,990 ఆర్‌పిఎమ్‌ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పవర్ మరియు టార్క్ 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు పంపబడతాయి.

కొత్త స్కోడా ఆక్టేవియాలో మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఆక్టేవియా ముందు మరియు వెనుక వైపు ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగులు, కర్టెన్ ఎయిర్‌బ్యాగులతో మొత్తం ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. దీనితోపాటు ఎబిఎస్, ఇబిడి, పార్క్ అసిస్ట్, మల్టీ-కొలిషన్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

కొత్త 2021 స్కోడా ఆక్టేవియా యొక్క కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో ఉన్న స్టైల్ వేరియంట్ మూడు కలర్స్ లో లభిస్తుంది. అవి కాండీ వైట్, లావా బ్లూ మరియు మ్యాజిక్ బ్లాక్. అదే విధంగా ఎల్ అండ్ కె వేరియంట్ ఐదు కలర్స్ లో లభిస్తుంది. అవి బ్రిలియంట్ సిల్వర్, మాపుల్ బ్రౌన్, కాండీ వైట్, లావా బ్లూ మరియు మ్యాజిక్ బ్లాక్ కలర్స్.

ఇటీవల కాలంలో వాహన వినియోగదారులు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఖర్చు చేసి ఒక సెడాన్ కొనాలనుకుంటే తప్పకుండా మీకు ఈ కొత్త స్కోడా ఆక్టేవియా మంచి ఎంపిక అవుతుంది. ఈ సెడాన్ యొక్క ధరలు కంపెనీ 2021 జూన్ 10 న అధికారికంగా విడుదల చేస్తుంది. 2021 స్కోడా ఆక్టేవియా గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
2021 Skoda Octavia Review Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X