ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

జపనీస్ కార్ బ్రాండ్ హోండా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న హెచ్‌ఆర్-వి మిడ్-సైజ్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌ను ఫిబ్రవరి 18, 2021వ తేదీన అధికారికంగా ఆవిష్కరించనుంది. తాజాగా, ఇందుకు సంబంధించిన పేటెంట్ చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

మునుపటి తరం హోండా హెచ్ఆర్-వి మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం 2021 హోండా హెచ్ఆర్-వి మోడల్ పూర్తిగా రీడిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా ఈ పేటెంట్ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ముందు మరియు వెనుక వైపు సన్నటి లైట్ క్లస్టర్లతో దీని ఎక్స్టీరియర్ పూర్తిగా రీడిజైన్ చేశారు.

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఈ కొత్త తరం మోడల్‌లో ముందు వైపు హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లోనే డేటైమ్ రన్నింగ్ లైట్లను మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లను జోడించారు. ఫ్రంట్ గ్రిల్ మధ్యలో పెద్ద హోండా లోగో, దాని క్రింది భాగంలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్ రియు దాని దిగువ భాగంలో సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులు ఉన్నాయి.

MOST READ:రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది సింపుల్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొత్త రకం అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను ఆశించవచ్చు. ఇకపోతే, ఈ ఎస్‌యూవీకి కూప్ స్టైల్ లుక్‌ని ఇచ్చేందుకు దీని వెనుక డోర్ హ్యాండిల్‌ను మునుపటి తరం మోడల్ మాదిరిగానే సి పిల్లర్ విండో దగ్గర అమర్చారు.

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

రియర్ డిజైన్‌ను గమనిస్తే, వెడల్పాటి టెయిల్ గేట్, సన్నటి రియర్ బంపర్ మరియు దాని దిగువ భాగంలో సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్, స్ప్లిట్ డిజైన్‌తో కూడిన సన్నటి టెయిల్ ల్యాంప్, రియర్ వైపర్ విత్ వాషర్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

ప్రస్తుతానికి ఇందులోని ఇంటీరియర్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా, హోండా ఇందులో అధునాత టెక్నాలజీతో కూడిన ఫీచర్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం హోండా జాజ్ కారులో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లే ఈ కొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీలోనూ కొనసాగించే అవకాశం ఉంది. కొన్ని మార్కెట్ల కోసం ఇందులో మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేయనున్నట్లు సమాచారం.

MOST READ:ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

హోండా ముందుగా ఈ ఎస్‌యూవీని చైనా మార్కెట్లో విడుదల చేయనుంది. ఆ తర్వాతి కాలంలో ఇది యూరప్ మరియు ఆసియా మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. అమెరికా మార్కెట్ల కోసం ఇందులో కొద్దిగా భిన్నంగా ఉన్న మోడల్‌ను ప్రవేశపెడతామని హోండా గతంలోనే వెల్లడించింది.

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఇక భారతదేశం విషయానికి వస్తే, హోండా గతంలో మునుపటి తరం హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీని ఇక్కడి మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, దాని దిగుమతికి అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకొని కంపెనీ తమ ప్లాన్స్‌ను వాయిదా వేసుకుంది.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

అయితే, ప్రస్తుతం భారత్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మరియు హోండా తమ సిఆర్-వి మోడల్‌ను మార్కెట్ నుండి నిలిపివేయటాన్ని పరిగణలోకి తీసుకొని, కంపెనీ ఈ కొత్త తరం 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీని ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 18న సరికొత్త 2021 హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఒకవేళ ఈ కొత్త తరం హోండా హెచ్ఆర్-వి భారత మార్కెట్లో విడుదలైనట్లయితే, ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్, రెనో డస్టర్ వంటి ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది. ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారం ఫిబ్రవరి 18న వెల్లడి కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New 2021 Honda HR-V SUV Patent Image Leaked Ahead Of Official Reveal. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X