Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

జపనీస్ కార్ బ్రాండ్ Honda, భారత మార్కెట్లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవలే తమ కొత్త Honda Amaze కాంపాక్ట్ సెడాన్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన Honda Cars India Limited, త్వరలోనే ఓ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

ప్రస్తుతం Honda తమ భారత ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో, కొత్త Amaze, ఐదవ తరం Honda City సెడాన్, నాల్గవ తరం Honda City సెడాన్, WR-V క్రాసోవర్ మరియు Jazz ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను విక్రయిస్తోంది. గతేడాది చివర్లో కంపెనీ తమ లైనప్‌లో ఖరీదైన సిఆర్-వి ఎస్‌యూవీ మరియు సివిక్ సెడాన్ మోడళ్లను నిలిపివేసిన సంగతి తెలిసినదే.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగం వైపు చాలా మంది కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు. ఈ విభాగంలోని డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు Honda కూడా సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, Honda నుండి రానున్న ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని అంతర్గతంగా 31XA అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ Honda City ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుందని భావిస్తున్నారు. ఈ విషయం గురించి Honda Cars India Limited సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) Rajesh Goel మాట్లాడుతూ, ఇది (కొత్తగా రాబోయే ఎస్‌యూవీ) ఇండియా స్పెసిఫిక్ మోడల్‌గా ఉంటుందని అన్నారు.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

ఈ నేపథ్యంలో, Honda తమ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని ముందుగా భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఈ కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేయడానికి చాలా పెట్టుబడి మరియు సమయం అవసరం కాబట్టి, దీనిని తర్వాతి కాలంలో విదేశీ మార్కెట్లలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

ఈ సందర్భంగా Honda Cars India Limited ప్రెసిడెంట్ మరియు సీఈఓ Gaku Nakanishi మాట్లాడుతూ.. భారతదేశంలో ఎస్‌యూవీ విభాగాన్ని హోండా ఆసక్తిగా ఆధ్యయనం చేస్తోందని తాను గతంలోనే వెల్లడించానని, ఇప్పుడు తమ సంస్థ ఓ సరికొత్త ఇండియా ఫోకస్డ్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు ధృవీకరిస్తున్నాని అన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

కొంతకాలం క్రితమే Honda 'Elivate' అనే పేరు కోసం ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది. బహుశా ఈ పేరు కంపెనీ తమ భవిష్యత్ ఎస్‌యూవీ కోసం ఉపయోగించే అవకాశం ఉంది. ప్రాధమిక సమాచారం ప్రకారం, ఈ కొత్త Honda ఎస్‌యూవీని 5-సీటర్‌తో పాటు 7-సీటర్ ఎస్‌యూవీగా కూడా అందించవచ్చని సమాచారం.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

అయితే, ప్రస్తుతానికి ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. Honda 31XA ఎస్‌యూవీని భారత మార్కెట్లోని ఈ విభాగంలో Hyundai Creta, Kia Seltos, Renault Duster, Skoda Kushaq మరియు రాబోయే Volkswagen Taigun వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

ఒకవేళ ఇది 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే, ఇది MG Hector, Tata Harrier మరియు Mahindra XUV700 వంటి మోడళ్లతో కూడా పోటీపడే అవకాశం ఉంది. ఈ కొత్త Honda ఎస్‌యూవీని City సెడాన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతున్న నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్ ఆప్షన్లు ఉండొచ్చని తెలుస్తోంది.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Honda City సెడాన్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 121 బిహెచ్‌పి పవర్‌ను మరియు 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Honda ఇవే ఇంజన్లను తమ కొత్త ఎస్‌యూవీలోనూ కొనసాగించవచ్చని అంచనా. ఈ ఇంజన్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటుగా ఈ ఎస్‌యూవీలో కంపెనీ ఓ హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Honda నుండి రానున్న సరికొత్త ఎస్‌యూవీ, Hyundai Creta గట్టి సవాల్..

కొత్త 2021 Honda Amaze విడుదల:

ఇదిలా ఉంటే, Honda భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్ 'Amaze'లో కంపెనీ కొత్తగా ఓ 2021 మోడల్‌ను ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ కొత్త 2021 Honda Amaze ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధరలు రూ.6.32 లక్షల నుండి రూ.11.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. - ఈ కారుకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కొత్త Honda Amaze లో లభించే సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో గైడ్‌లైన్స్‌తో కూడిన మల్టీ వ్యూ రియర్ పార్కింగ్ కెమెరాను కొత్తగా అందిస్తున్నారు. అలాగే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు సీట్-బెల్ట్ రిమైండర్ మొదలైన స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

Source: ET Auto

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New honda suv confirmed for india will rival hyundai creta and many more details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X