Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- News
అక్కడ భయపడి, ఇక్కడ నాటకాలా? అమిత్ షాతో అదే చెప్పా: వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ : ధర & వివరాలు
భారత మార్కెట్లో జీప్ కంపెనీ తన కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ ఎస్యూవీ ధర దేశీయ మార్కెట్లో రూ. 16.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్). కొత్త జీప్ కంపాస్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ కొత్త జీప్ కంపాస్ ఎస్యూవీ డెలివరీ 2021 ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమవుతుంది. దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 జీప్ కంపాస్‌ను 4 ట్రిమ్స్ మరియు 11 వేరియంట్లలో అందిస్తున్నారు. ఇందులో స్పోర్ట్, లాంగిట్యూడ్, లిమిటెడ్ మరియు మోడల్ 'ఎస్' ఉన్నాయి. ఇందులో టాప్ మోడల్ ధర రూ. 24.49 లక్షల వరకు ఉంటుంది. దీనితోపాటు 80 వ యానివర్సరీ ఎడిషన్‌ను కూడా తీసుకువచ్చారు. దీని ధర రూ. 22.96 లక్షలు.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ కొత్త హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి డిఆర్ఎల్, హానీ కూంబ్ ఇన్సర్ట్లతో అప్డేట్ చేసిన 7-స్లేట్ గ్రిల్, న్యూ ఫ్రంట్ బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్ ఉన్నాయి. ఈ కారు యొక్క సైడ్ ప్రొఫైల్ కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది.
MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ కారులో కొత్త డాష్‌బోర్డ్ ఉంది, ఇది మాత్రమే కాకుండా ఈ కారులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కొత్త ఎసి వెంట్స్ మరియు హెచ్‌విఎసి కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో కంపెనీ యొక్క యుకనెక్ట్ 5 టెక్నాలజీ ఇవ్వబడింది.

అంతే కాకుండా అమెజాన్ అలెక్సా సపోర్ట్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మరియు ఓవర్ ఎయిర్ అప్డేట్ ఈ కారులో అందించబడ్డాయి.ఇప్పడు ఈ కారులోని స్టోరేజ్ ప్లేస్ మునుపటికంటే ఎక్కువగా ఉంది, దీనితోపాటు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ లోని స్టీరింగ్ వీల్ కూడా అప్డేట్ చేయబడింది. ఇందులో జీప్ బ్రాండ్ యొక్క బ్యాడ్జ్‌ను హారిజాంటల్ స్ట్రిప్‌లో ఉంచారు.
MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

కంపాస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి, ఇఎస్సి, హిల్ డీసెంట్ కంట్రోల్, పానిక్ బ్రేక్ అసిస్ట్, రెడీ అలర్ట్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ అండ్ బ్రేక్ లాక్ డిఫరెన్షియల్, రైన్ బ్రేక్ సపోర్ట్, సెలెక్ట్ టెర్రైన్ 4x4 సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి.

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌ను రెండు ఇంజన్ ఆప్షన్లలో అందించవచ్చు. మొదటిది 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, రెండవది 2.0-లీటర్ బిఎస్ 6 డీజిల్ ఇంజన్. ఇందులో ఉన్న 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 161 బిహెచ్పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందించగా, 2.0-లీటర్ బిఎస్ 6 డీజిల్ ఇంజన్, 170 బిహెచ్పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.
MOST READ:ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే

ఈ ఎస్‌యూవీకి కంపెనీ 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించింది. ఇది మొత్తం ఏడు కలర్ అప్సన్స్ లో అందుబాటులో ఉంది. 2021 జీప్ కంపాస్ ఇప్పుడు ఆకర్షణీయంగా మరియు శక్తివంతంగా కనిపిస్తుంది. ఈ కొత్త కార్ ఎక్సటీరియర్ మరియు ఇంటీరియర్ లో చాలా అప్డేట్స్ జరిగాయి.

కొత్త జీప్ కంపాస్ చూడతమికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, మునుపటికంటే మంచి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. 2021 జీప్ కంపాస్ భారత మార్కెట్లో టాటా హారియర్, ఎంజి హెక్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి