ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి రానున్న కొత్త ఆఫ్-రోడర్ కింగ్: ట్రోఫీ ఎడిషన్

ల్యాండ్ రోవర్ యొక్క వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన మోడల్స్. ఇప్పుడు ల్యాండ్ రోవర్ తన కొత్త డిఫెండర్ ట్రోఫీ ఎడిషన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ట్రోఫీ సిరీస్ మోడల్ పవర్ ఫుల్ ఆఫ్-రోడర్లుగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొత్త ట్రోఫీ ఎడిషన్ ద్వారా కొత్త ఆఫ్-రోడ్ మోడల్‌ని పరిచయం చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి రానున్న కొత్త ఆఫ్-రోడర్ కింగ్: ట్రోఫీ ఎడిషన్

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ట్రోఫీ ఎడిషన్, దాని స్టాండర్డ్ డిఫెండర్ కంటే పవర్ ఫుల్ మరియు మంచి ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ట్రోఫీ ఎడిషన్ డిఫెండర్ వర్క్స్ వి8 ట్రోఫీ నుండి ప్రేరణ పొందిన బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కలయికలో వస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి రానున్న కొత్త ఆఫ్-రోడర్ కింగ్: ట్రోఫీ ఎడిషన్

ఈ కొత్త ఎడిషన్ యొక్క డోర్స్ పై పాత ల్యాండ్ రోవర్ లోగోను గమనించవచ్చు. ఆఫ్-రోడింగ్ కోసం, ట్రోఫీ ఎడిషన్ ప్రామాణికంగా ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, రూఫ్ ర్యాక్, మడ్ ఫ్లాప్స్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంప్రెసర్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి రానున్న కొత్త ఆఫ్-రోడర్ కింగ్: ట్రోఫీ ఎడిషన్

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ట్రోఫీ ఎడిషన్ అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో స్టాండర్డ్‌గా ఎయిర్ సస్పెన్షన్, కోల్డ్ క్లైమేట్ ప్యాక్, ఆఫ్-రోడ్ ప్యాక్, అడ్వాన్స్‌డ్ ఆఫ్-రోడ్ కెపాసిటీ ప్యాక్, రియర్ వ్యూ మిర్రర్ కెమెరా వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి రానున్న కొత్త ఆఫ్-రోడర్ కింగ్: ట్రోఫీ ఎడిషన్

ఈ కొత్త ల్యాండ్ రోవర్ ఎడిషన్ ఇప్పుడు నార్త్ కరోలినాలోని అషెవిల్లేలోని బిల్ట్‌మోర్ ఎస్టేట్‌లో ఒక రోజు ఆఫ్-రోడ్ టెస్ట్ నిర్వహణలో పాల్గొంది. ఇది 2022 ప్రారంభంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఈస్ట్‌నోర్ కోటలో ఇలాంటి పోటీలో పాల్గొంటుంది. ఈ కొత్త మోడల్ సాధారణ మోడల్ కంటే కూడా చాలా అప్డేటెడ్ గా ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి రానున్న కొత్త ఆఫ్-రోడర్ కింగ్: ట్రోఫీ ఎడిషన్

డిఫెండర్ వర్క్స్ వి8 ట్రోఫీ వెహికల్ గతంలో ల్యాండ్ రోవర్ క్లాసిక్ 2021 క్లాసిక్ క్యామెల్ ట్రోఫీ లాండిస్ కోసం ప్రవేశపెట్టబడింది. ఈ ఆఫ్-రోడర్‌లోని అడిషినల్ ఆల్-టెర్రైన్ కిట్‌లో ఫ్రంట్ వించ్, మల్టీ-పాయింట్ ఎక్స్‌పెడిషన్ కేజ్, రూఫ్ ర్యాక్, అండర్‌బాడీ ప్రొటెక్షన్, ఎ-బార్, ఎల్‌ఈడీ స్పాట్‌లైట్లు మరియు మడ్ ట్రెయిన్ టైర్లు ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి రానున్న కొత్త ఆఫ్-రోడర్ కింగ్: ట్రోఫీ ఎడిషన్

ఈ కొత్త డిఫెండర్ పాత డిఫెండర్ ఆధారంగా డిఫెండర్ వర్క్స్ వి8 ల్యాండ్ రోవర్ క్లాసిక్‌ను తిరిగి డిజైన్ చేసింది. ట్రోఫీ వాహనాలు ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ ఉపయోగం కోసం రూపొందించబడ్డాయి. కావున దీనికి కావలసిన అప్డేట్స్ కూడా పొందుతుంది. డిఫెండర్ వర్క్స్ వి8 ట్రోఫీ 90 మరియు 110 స్టేషన్ వాగన్ బాడీ డిజైన్‌ల మిశ్రమంలో రూపొందించబడింది

ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి రానున్న కొత్త ఆఫ్-రోడర్ కింగ్: ట్రోఫీ ఎడిషన్

ఇది ల్యాండ్ రోవర్ క్లాసిక్ యొక్క క్లాసిక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో 4x4 సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ మరియు మొబైల్ కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ డిఫెండర్ వర్క్స్ వి8 ట్రోఫీ మోడల్ అసాధారణమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కావున ఆఫ్-రోడింగ్ సమయంలో అసాధారణ ప్రతిభను చూపిస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి రానున్న కొత్త ఆఫ్-రోడర్ కింగ్: ట్రోఫీ ఎడిషన్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ట్రోఫీ ఎడిషన్‌లో 3.0-లీటర్, 6-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది బీఎండబ్ల్యూ బేస్డ్ వి8 మోటార్‌తో ప్రారంభమవుతుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ట్రోఫీ ఎడిషన్ ప్రారంభం గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.

Most Read Articles

English summary
Land Rover Defender Trophy Edition Unveiled. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X