కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం 2021 సెలెరియో (New Gen Celerio) కోసం కంపెనీ ఇప్పుడు అఫీషియల్ యాక్ససరీ వివరాలను వెల్లడి చేసింది. కంపెనీ ఇటీవలే మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ను రూ. 4.99 లక్షల నుండి రూ. 6.94 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

సరికొత్త అవతార్‌లో వచ్చిన కొత్త తరం 2021 మారుతి సెలెరియో మునుపటి కంటే చాలా ఆకర్షణీయమైన డిజైన్ మరియు గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. ప్రత్యేకించి యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని మారుతి సుజుకి ఈ రెండవ తరం సెలెరియో కారును చాలా మోడ్రన్ గా డిజైన్ చేసింది. ఈ ఇప్పుడు ఈ చిన్న కారు కోసం కంపెనీ రెండు అధికారిక యాక్ససరీ ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టింది. ఈ యాక్ససరీ ప్యాక్ లకు సంబంధించిన మరిన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

మారుతి సుజుకి కొత్త సెలెరియో కోసం కంపెనీ రెండు విభిన్న యాక్సెసరీస్ ప్యాకేజీ లను అందిస్తోంది, ఇది కారు రూపాన్ని మరింత మెరుగుపరచడంలో సహకరిస్తుంది. వీటిలో యాక్టివ్ అండ్ కూల్ (Active and Cool) ప్యాకేజ్ మరియు పెప్పీ అండ్ స్టైలిష్ (Peppy and Stylish) ప్యాకేజ్ లు ఉన్నాయి. ఇందులో ముందుగా యాక్టివ్ అండ్ కూల్ ప్యాకేజ్ రెడ్ లేదా సిల్వర్ కలర్ లో ఉంటుంది. మార్కెట్లో ఈ ప్యాకేజ్ ధరలు వరుసగా రూ. 27,590 మరియు రూ. 24,590 లుగా ఉన్నాయి.

కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

ఈ ప్యాకేజీలను Celerio VXi ట్రిమ్ నుండి ఎంచుకోవచ్చు ఇందులో బాడీ సైడ్ మౌల్డింగ్, డోర్ వైజర్స్, విండో ఫ్రేమ్ కిట్, రియర్ విండ్‌షీల్డ్ గార్నిష్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, బూట్ మ్యాట్, డిజైనర్ మ్యాట్‌లు, నంబర్ ప్లేట్ గార్నిష్, టిష్యూ బాక్స్ మరియు స్టీరింగ్ వీల్ కవర్ వంటివి లభిస్తాయి. వీటితో కారు అందాన్ని మరింత పెంచుకోవచ్చు.

ఇక పెప్పీ అండ్ స్టైలిష్ (Peppy and Stylish) యాక్ససరీ ప్యాక్ విషయానికి వస్తే, ఇది ఆరెంజ్ కలర్ లో లభిస్తుంది మరియు దీని ధర రూ. 26,690 గా ఉంటుంది. ఇది యాక్టివ్ అండ్ కూల్ ప్యాకేజ్ మాదిరిగా చాలా సొగసైన గార్నిష్‌ ను పొందుతుంది. అదనంగా ఫ్రంట్, సైడ్ మరియు రియర్ బాడీ స్పాయిలర్ తో సెలెరియోకి మరింత స్పోర్టీ రూపం లభిస్తుంది.

కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

ఈ రెండు యాక్ససరీ ప్యాక్ లే కాకుండా, కంపెనీ ఈ కొత్తగా సీట్ కవర్లు, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు మరియు కార్ కేర్ కిట్ వంటి ఇతర యాక్ససరీలను కూడా అందిస్తోంది. కంపెనీ 100 కంటే ఎక్కువ ఒరిజినల్ యాక్సెసరీలను అందిస్తోంది. . ఆసక్తిగల కస్టమర్లు వీటిని మారుతి సుజుకి జెన్యూన్ యాక్సెసరీస్ వెబ్‌సైట్ ద్వారా లేదా డీలర్‌షిప్‌లోని కాన్ఫిగరేటర్ సహాయంతో విడిగా కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

ఎక్స్టీరియర్ యాక్ససరీస్:

  • ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్ - రూ. 1,550
  • రియర్ అండర్ బాడీ స్పాయిలర్ - రూ. 1,450
  • సైడ్ అండర్ బాడీ స్పాయిలర్ - రూ. 1,710
  • రియర్ అప్పర్ స్పాయిలర్ - రూ. 2,590
  • వీల్ ఆర్చ్ క్లాడింగ్ - రూ. 3,050
  • రియర్ విండ్‌షీల్డ్ గార్నిష్ - రూ. 890
  • ఫైర్ రెడ్ డ్రిఫ్టర్ గ్రాఫిక్స్ - రూ. 2,890
  • మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ - రూ. 26,360
  • ఫాగ్ ల్యాంప్ గార్నిష్ - రూ. 510 వరకు
  • బంపర్ కార్నర్ ప్రొటెక్టర్ - రూ. 550 వరకు
  • డోర్ వైజర్ - రూ 1,990
  • విండో ఫ్రేమ్ కిట్ - రూ 1,690
  • కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

    ఇంటీరియర్ యాక్ససరీస్:

    • ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ (నాలుగు రంగులు) - రూ. 7,990 నుండి రూ. 8,190 వరకు
    • డోర్ సిల్ గార్డ్ - రూ. 790
    • బూట్ మ్యాట్ - రూ. 1,390
    • స్టాండర్డ్ కార్పెట్ మ్యాట్ - రూ. 1,190
    • డీలక్స్ కార్పెట్ మ్యాట్ - రూ. 1,290
    • డిజైనర్ మ్యాట్ - రూ. 1,990
    • ప్రీమియం బ్లాక్ మ్యాట్ - రూ. 1,590
    • సీట్ కవర్లు - రూ. 4,990 నుండి రూ. 7,690
    • కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

      మారుతి సుజుకి తమ కొత్త తరం సెలెరియో కారును LXi, VXi, ZXi మరియు ZXi+ అనే నాలుగు ట్రిమ్ లలో మొత్తం ఏడు వేరియంట్లలో విడుదల చేసింది. ఇది ఫైర్ రెడ్ మరియు స్పీడీ బ్లూ అనే రెండు కొత్త రంగులతో పాటు సిల్కీ సిల్వర్, గ్లిస్టరింగ్ గ్రే, ఆర్కిటిక్ వైట్ మరియు కెఫిన్ బ్రౌన్ వంటి మొత్తం 6 రంగులలో లభిస్తుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.

      కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

      మారుతి సుజుకి సెలెరియో కారును కంపెనీ ఒకే ఒక పెట్రోల్ ఇంజన్‌తో అందిస్తోంది. ఇందులోని కొత్త 1.0 లీటర్ 3-సిలిండర్ కె10సి డ్యూరాజెట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి శక్తిని మరియు 89 ఎన్ఎమ్ రిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరు గరిష్టంగా 26.68 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

      కొత్త మారుతి సెలెరియో కారును స్విఫ్ట్ మరియు బాలెనో వంటి మోడళ్లను తయారు చేసినట్లుగానే సుజుకి యొక్క హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారు చేశారు. ఫలితంగా, ఇది పాత మోడల్ కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది. దీని వీల్‌బేస్ కూడా మునుపటి కంటే పొడవుగా ఉంది, కాబట్టి కారు లోపల మునుపటి కంటే ఎక్కువ ఇంటీరియర్ స్థలం లభిస్తుంది. అలాగే, ఇందులో 313 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంటుంది.

      కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

      ఈ చిన్న కారులో కంపెనీ లేటెస్ట్ టెక్ ఫీచర్లను అందిస్తోంది. వీటిలో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్, ఏసి వెంట్స్ మరియు డోర్ ట్రిమ్స్‌పై సిల్వర్ యాక్సెంట్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 7.0 ఇంచ్ సుజుకి స్మార్ట్ ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, స్మార్ట్-కీ, ఇంజన్ పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎమ్ఐడితో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

      కొత్త 2021 Celerio కోసం యాక్ససరీ ప్యాక్ వివరాలను వెల్లడించిన Maruti Suzuki

      సేఫ్టీ విషయంలో కూడా కొత్త తరం సెలెరియో చాలా మెరుగ్గా ఉంటుంది. ఇందులో డ్రైవర్ సీట్ ఎయిర్‌బ్యాగ్‌తో పాటుగా ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, ఈబిడితో కూడిన ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, పెడస్టేరియన్ సేఫ్టీ, సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్, హెడ్‌లైట్ లెవలింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, వెనుక తలుపలపై చైల్డ్ ప్రూఫ్ లాక్, హైస్పీడ్ అలెర్ట్ సిస్టమ్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ హిల్-హోల్డ్ అసిస్ట్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
New maruti suzuki celerio accessory packs detailed160812
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X