ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Maruti Suzuki Celerio: ధర & వివరాలు

'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఈ పేరు వాహన ప్రియులదరికి సుపరిచయమే, ఎదుకంటే దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ మార్కెట్లో ఒకప్పటినుంచి కూడా మంచి ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంది.

ఇందులో భాగంగానే మారుతి సుజుకి (Maruti Suzuki) ఇప్పుడు కొత్త 2021 మారుతి సెలెరియో (2021 Maruti Celerio) ని విడుదల చేసింది. ఈ కొత్త మారుతి సెలెరియో గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి విడుదల చేసిన ఈ కొత్త మారుతి సెలెరియో ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే మారుతి సెలెరియో యొక్క టాప్ మోడల్ ధర రూ. 6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. మారుతి సుజుకి ఈ కొత్త సెలెరియో కోసం బుకింగ్స్ ప్రారంభిచింది. కావున కొనుగోలు చేయాలనుకునే వారు 11,000 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు, డెలివరీలు త్వరలో ప్రారంభమౌతాయి.

Celerio Price
LXI MT ₹4,99,000
VXI MT ₹5,63,000
VXI AMT ₹6,13,000
ZXI MT ₹5,94,000
ZXI AMT ₹6,44,000
ZXI+ MT ₹6,44,000
ZXI+ AMT ₹6,94,000

కలర్ ఆప్సన్స్:

భారతీయ విఫణిలో విడుదలైన కొత్త సెలెరియో మొత్తం 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

అవి:

  • ఆర్కిటిక్ వైట్
  • సిల్కీ సిల్వర్
  • గ్లిస్టెనింగ్ గ్రే
  • స్పీడీ బ్లూ
  • ఫైర్ రెడ్
  • కెఫిన్ బ్రౌన్
  • మారుతి సుజుకి సెలెరియో 4 ట్రిమ్స్ 7 విభిన్న వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి LXI, VXI, VXI AGS, ZXI, ZXI AGS, ZXI+ మరియు ZXI+ AGS వేరియంట్లు.

    డిజైన్:

    కొత్త మారుతి సెలెరియోలో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు కొత్త ఫాగ్ లైట్స్ పొందుతుంది. ఇంటీరియర్స్‌లో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కాల్ మరియు మ్యూజిక్ అసిస్ట్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సింగిల్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సర్క్యులర్ డిజిటల్ స్క్రీన్ ఉన్నాయి.

    హెడ్ ​​లైట్ డిజైన్ మునుపటికంటే కూడా చాలా అప్డేటెడ్ గా ఉంటుంది. అంతే కాకుండా బాడీ డిజైన్ కూడా అనేక అప్డేట్స్ పొందుతుంది. కావున ఇది మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొత్త సెలెరియోలో 15 ఇంచెస్ బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్ మరియు ORVMలలో టర్న్ ఇండికేటర్ వంటి వాటిని పొందుతుంది.

    ఇంజిన్:

    కొత్త 2021 మారుతి సెలెరియోలో 1.0-లీటర్ K10C సిరీస్ త్రీ-సిలిండర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి పవర్ మరియు 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కూడా పొందుతుంది. కొత్త సెలెరియో 26.68 kmpl మైలేజీని అందించగలదని మారుతి సుజుకి పేర్కొంది.

    Engine Size 1.0-litre
    Engine Type Naturally aspirated, inline-3, petrol
    Power 67 PS
    Torque 89 Nm
    Transmission 5-speed MT / 5-speed AMT

    కొత్త మారుతి సెలెరియో కంపెనీ యొక్క మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో మాదిరిగానే సుజుకి యొక్క హార్టెక్ట్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంది. అయితే కొత్త సెలెరియో దాని పాత మోడల్ కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంది. దీని వీల్‌బేస్ కూడా మునుపటి కంటే పొడవుగా ఉంది. అంతే కాకుండా ఇప్పుడు కారు లోపల స్పేస్ మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది.

    కొత్త మారుతి సెలెరియో ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకు కనెక్టివిటీతో స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక కొత్త మరియు అప్‌డేట్ చేయబడిన ఫీచర్లను పొందుతుంది. ఇది కాకుండా, ఈ కారులో ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో పాటు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్ అందుబాటులో ఉన్నాయి.

    దీనితో పాటు, ఇప్పుడు కొత్త సెలెరియోలో డోర్ రిక్వెస్ట్ స్విచ్ కూడా అందుకుంటుంది. కొత్త మారుతి సెలెరియోలో బూట్ స్పేస్ ఇప్పుడు 313 లీటర్లకు పెరిగింది. మొత్తానికి ఈ కొత్త సెలెరియో అతి తక్కువ ధర వద్ద అధునాతన ఫీచర్స్ కలిగిన ఉత్తమమైన కారు కానుంది.

    సేఫ్టీ ఫీచర్స్:

    కొత్త మారుతి సెలెరియో యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్రైవర్ మరియు ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, ఏబీఎస్ విత్ ఈబిడి, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రియర్ డోర్ వద్ద వద్ద చైల్డ్ ప్రూఫ్ లాక్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి వాటిని పొందుతుంది.

    ధర పరంగా చూసినట్లయితే, కొత్త తరం మారుతి సెలెరియో మంచి కారు. అయితే ప్రస్తుతం ఈ కారు మంచి పనితీరుని అందించడమే కాకుండా మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరల మధ్య, కొత్త మారుతి సెలెరియో మెరుగైన మైలేజ్ కారణంగా వినియోగదారుల దృష్టిని తప్పకుండా ఆకర్షించగలదు. మారుతి సుజుకి అనేక మైలేజ్ CNG కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్త డిజైన్ మరియు మెరుగైన మైలేజీ కారణంగా, కస్టమర్లు సెలెరియోను కొనుగోలు చేయడానికి ఖచ్చితంగా ఇష్టపడతారు.

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో, టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV కి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి సెలెరియో ఎలాటి అమ్మకాలను పొందుతుంది ఏ విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
New maruti suzuki celerio launched at rs 4 99 lakh features mileage specification details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X