కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ సి-క్లాస్‌లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టింది. మెర్సిడెస్ బెంజ్ ఈ కొత్త కారును సెడాన్ మరియు ఎస్టేట్ రూపాల్లో పరిచయం చేసింది.

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

గడచిన 2014లో ఈ మోడల్‌లో నాల్గవ తరాన్ని ప్రవేశపెట్టిన మెర్సిడెస్ బెంజ్, ఇప్పుడు దీనిని సరికొత్తగా డిజైన్ చేసి ఐదవ తరం మోడల్‌గా విడుదల చేసింది. ఈ మోడల్ ముందుగా అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యం కానుంది. ఆ తర్వాతి కాలంలో ఇండియాలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న అల్టిమేట్ లగ్జరీ కార్ ఎస్-క్లాస్ నుండి స్పూర్తి పొంది ఈ కొత్త తరం సి-క్లాస్ కారును డిజైన్ చేశారు. ఇందులోని అనేక డిజైన్ ఎలిమెంట్స్ చాలా వరకూ ఎస్-క్లాస్ మాదిరిగా అనిపిస్తాయి. మునుపటి తరం మోడల్ కంటే ఈ కొత్త తరం సి-క్లాస్ మరింత స్పోర్టీ, ప్రీమియంగా కనిపిస్తుంది.

MOST READ:భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ కారు ముందు భాగంలో క్రోమ్ త్రీ-పాయింటెడ్ స్టార్స్‌తో కూడిన సరికొత్త రేడియేటర్ గ్రిల్ డిజైన్, రివైజ్ చేయబడిన హెడ్‌ల్యాంప్ మరియు బంపర్స్‌ను ఇందులో గమనించవచ్చు. బానెట్‌పై కొత్తగా జోడించిన బాడీ లైన్స్ ఈ కారుకి మరింత స్పోర్టీ లుక్‌ని ఇవ్వటంలో సహకరిస్తాయి.

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొత్త సి-క్లాస్ రియర్ ఎండ్ ప్రొఫైల్ చూడటానికి కొత్త ఎస్-క్లాస్ మాదిరిగానే కనిపిస్తుంది. ర్యాప్అరౌండ్ టెయిల్ లాంప్స్, క్రోమ్ ఫినిష్డ్ డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్, స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్‌పై ఫేక్ ఎయిర్ వెంట్స్, బంపర్ దిగువ భాగాన స్కిడ్ ప్లేట్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.

MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

క్యాబిన్ లోపల ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో సెంటర్ కన్సోల్‌పై నిలువుగా అమర్చిన సరికొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కోసం సరికొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్‌బోర్డ్ మధ్యలో మూడు ఏసి వెంట్స్, షైనీ గ్రే అండ్ పియా బ్లాక్ ఫినిషింగ్స్ మరియు డ్యూయెల్ టోన్ ప్రీమియం లెధర్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ మాదిరిగానే ఈ కొత్త తరం సి-క్లాస్ కూడా రెండవ తరం ఎమ్‌బియూఎక్స్ డిస్‌ప్లే సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ కారు వీల్‌బేస్‌ను 25 మి.మీ మరియు పొడవును 65 మి.మీ మేర పెంచారు. పెరిగిన కొలతల కారణంగా, కారులో ఇప్పుడు విశాలమైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో ఫెరారీ సూపర్ స్పోర్ట్స్ కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ కారులో ఆటోమేటెడ్ వాలెట్ పార్కింగ్, గంటకు 129 కిలోమీటర్ల వేగంతో అటానమస్‌గా డ్రైవ్ చేసే డ్రైవ్ పైలట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్‌ను అనేక రకాల ఇంజన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. వీటిలో మైల్డ్-హైబ్రిడ్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

పెట్రోల్ ఇంజన్‌లో మూడు ఆప్షన్లు ఉన్నాయి, అవి: 1.5-లీటర్ సి180, 1.5-లీటర్ సి200 మరియు 2.0-లీటర్ సి300. ఇందులో 1.5-లీటర్ సి180 ఇంజన్ 170 బిహెచ్‌పి పవర్, 263 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే, 1.5-లీటర్ సి200 ఇంజన్ 204 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 2.0 లీటర్ సి300 ఇంజన్ 259 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

డీజిల్ వెర్షన్ కూడా మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 2.0-లీటర్ సి200డి, 2.0-లీటర్ సి220డి మరియు 2.0-లీటర్ సి300డి ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా 163 బిహెచ్‌పి పవర్, 200 బిహెచ్‌పి పవర్ మరియు 265 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.

Most Read Articles

English summary
New 2021 Mercedes-Benz C-Class Revealed; Features, Specs, And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X