భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి ; ధర & వివరాలు

ఎంజీ మోటార్ ఇండియా తన కొత్త 2021 జెడ్‌ఎస్ ఈవీ ఎస్‌యూవీని ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఎంజి జెడ్‌ఎస్ ఈవి ఎస్‌యువి రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లు. ఇందులో ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 20.99 లక్షలు కాగా, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ .24.18 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి ; ధర & వివరాలు

ఎంజి జెడ్‌ఎస్ ఈవి ఎస్‌యువి యొక్క కొత్త వెర్షన్ కూడా అదే మార్పును ముందుకు తీసుకువెళుతుంది. ఈ కొత్త ఎస్‌యువిలో కూడా ఎటువంటి మార్పులు లేవు. అయితే ఇందులో మారినది మాత్రం, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు బ్రాండ్ యొక్క ‘ఐ-స్మార్ట్ 2.0' కనెక్టెడ్ టెక్నాలజీతో పాటు, గానా యాప్ కోసం ప్రీమియం అకౌంట్ తో వస్తుంది. ఈ కొత్త ఎస్‌యూవీలో పిఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది.

భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి ; ధర & వివరాలు

ఎంజి జెడ్‌ఎస్ ఈవి ఎస్‌యువి లో అప్డేట్ చేసిన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఇప్పుడు 141 బిహెచ్‌పి మరియు 353 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుందని మరియు ఒకే ఛార్జీపై గరిష్టంగా 419 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 8.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగవంతం అవుతుంది.

MOST READ:ఇలాంటి రోల్స్ రాయిస్ కారును ఎప్పుడైనా చూశారా? ఇది ఏ సెలబ్రిటీదో తెలుసా?

భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి ; ధర & వివరాలు

స్టాండర్డ్ వాల్ మౌంట్ ఛార్జర్, కస్టమర్ల ఇళ్లలో లేదా ఆఫీస్ లో ఎసి ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్, ఎంచుకున్న ఎంజి అవుట్‌లెట్లలో 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్లు, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు మరియు రోడ్‌సైడ్ ఛార్జింగ్ అసిస్టెన్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి ; ధర & వివరాలు

కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి ఇప్పుడు 177 మిమీ పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. బ్యాటరీ ప్లేస్‌మెంట్‌ 205 మిమీకు పెంచారు. ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్‌ను భారతదేశంలోని 31 నగరాలకు విస్తరించింది.

MOST READ:అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి ; ధర & వివరాలు

ఎంజి జెడ్‌ఎస్ ఈవి యొక్క డిజైన్ మరియు స్టైలింగ్ విషయానికి వస్తే ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ రౌండ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో ఒకే రకమైన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్‌లు ముందు భాగంలో క్రోమ్-స్టడెడ్ గ్రిల్ మెష్‌ను కలిగి ఉంటాయి. దాని మధ్యలో ‘ఎంజి లోగో' ఉంది. దీని వెనుక ఎస్‌యూవీకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది.

భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి ; ధర & వివరాలు

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా 17 ఇంచెస్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ పైన సిల్వర్ ఫినిష్డ్ రూప్ రైల్స్ కూడా కలిగి ఉంది. వెనుక భాగంలో ఎల్ఇడి టైల్ లైట్ యూనిట్ ఉంది. ఈ ఎస్‌యూవీ పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVM లతో వస్తుంది.

MOST READ:కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

భారత్‌లో విడుదలైన కొత్త 2021 ఎంజి జెడ్‌ఎస్ ఈవి ; ధర & వివరాలు

ఎంజి జెడ్‌ఎస్ ఈవి లోపల అదే డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంది. అదే ఫీచర్స్, ఎక్విప్మెంట్స్ మరియు టెక్నాలజీ కలిగి ఉండటంతో పాటు అదే సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో కొత్త ఎంజి జెడ్‌ఎస్ ఈవి ఈ విభాగంలో హ్యుందాయ్ కోనా EV మరియు టాటా నెక్సాన్ EV వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 MG ZS EV Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X