Just In
- 9 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 11 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 13 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడుదలకు ముందే కొత్త 2021 రెనో ట్రైబర్ ఎమ్‌పివి ఫీచర్లు, వివరాలు లీక్!
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా, ఇటీవలే తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. రెనో కైగర్ లాంచ్ తర్వాత కంపెనీ ఇప్పుడు తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని ఇతర ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేసే పనిలో బిజీగా ఉంది.

దేశీయ విపణిలో రెనో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎమ్‌పివి ట్రైబర్‌లో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. కొత్త 2021 రెనో ట్రైబర్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉంటాయని సమాచారం.

కంపెనీ విడుదల చేసిన కైగర్‌లో ఉపయోగించిన టర్బో పెట్రోల్ ఇంజన్‌ను రెనో ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఆఫర్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. రెనో ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాదిలో ఎప్పుడైనా మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. విడుదలకు ముందే ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ గురించి కొత్త వివరాలు లీక్ అయ్యాయి.
MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

రెనో ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్లలో చేయబోయే మార్పులు, కొత్త కలర్ ఆప్షన్స్ వంటి వివిధ వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో డ్యూయెల్ హారన్ సెటప్, బ్లాక్ కలర్ రూఫ్‌తో డ్యూయెల్ టోన్ పెయింట్ ఆప్షన్, పియానో బ్లాక్‌లో ఫినిష్ చేసిన సైడ్ మిర్రర్స్ మరియు వాటిపై టర్న్ ఇండికేటర్స్, సీడర్ బ్రౌన్ అనే కొత్త బాడీ కలర్ పెయింట్ స్కీమ్ మొదలైన మార్పులను ఇందులో ఆశించవచ్చు.

ఇందులోని ఇంటీరియర్లలో కూడా పలు మార్పులు చేర్పులు ఉండనున్నాయి. వీటిలో ప్రధానంగా స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, డ్రైవర్ మరియు కో ప్యాసింజర్ సౌకర్యం కోసం బకెట్ స్టైల్ సీట్స్, కొత్త అప్‌హోలెస్ట్రీ డిజైన్ వంటి మార్పులు ఉండనున్నాయి.
MOST READ:భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

అప్‌గ్రేడ్ చేయబడిన రెనో ట్రైబర్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో రావచ్చని తెలుస్తోంది. వీటిలో వైట్, సిల్వర్, బ్లూ, మస్టర్డ్ మరియు సీడర్ బ్రౌన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో సీడర్ బ్రౌన్ కలర్ కొత్తగా జోడించిన కలర్ ఆప్షన్. ఇదివరకు కంపెనీ ఆఫర్ చేసిన రెడ్ కలర్ ఆప్షన్ స్థానంలో ఈ బ్రౌన్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు.

కొత్త రెనో ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను బ్లాక్ కలర్ రూఫ్‌తో పాటుగా పైన పేర్కొన్న ఐదు కలర్లలో డ్యూయల్-టోన్ పెయింట్ థీమ్‌తో అందించనుంది. అయితే, 2021 రెనో ట్రైబర్‌లోని డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ టాప్-ఎండ్ అయిన ఆర్ఎక్స్జెడ్ వేరియంట్లో మాత్రమే లభించే అవకాశం ఉంది.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన

ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతానికి ఇందులో టర్బో వేరియంట్ గురించి సమాచారం లేకపోయినప్పటికీ, దీని న్యాచురల్ పెట్రోల్ ఇంజన్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఇందులోని 1.0-లీటర్ త్రీ సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 71 బిహెచ్పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 18.29 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
MOST READ:ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

రెనో బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ గత నెలలో ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దాని ప్రారంభ ధర రూ.5.45 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మార్చి 3వ తేదీ నుండి కంపెనీ ఈ మోడల్ డెలివరీలను కూడా ప్రారంభించింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
Source: Carwale