భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

ప్రముఖ వాహన తయారీసంస్థ స్కోడా తన ఫోర్త్ జనరేషన్ ఆక్టావియాను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మహమ్మారి కారణంగా 2021 స్కోడా ఆక్టావియా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

భారతదేశంలో ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర వంటి నగరాలలో కరోనావైరస్ కేసులు ఎక్కువగా ఉన్నందున కరోనా లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ కరోనా ఉదృతి కారణంగా నాల్గవ తరం స్కోడా ఆక్టావియా విడుదల కాస్త ఆలస్యం కావచ్చని స్కోడా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాచ్ హోలిస్ తెలిపారు. స్కోడా ఇప్పటికే తన ఆక్టావియా ఉత్పత్తిని ఔరంగాబాద్ యూనిట్‌లో ప్రారంభించింది.

భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

2021 స్కోడా ఆక్టావియా కార్ డీలర్లను చేరుకోవడం ప్రారంభించింది. దీనికి సంబంధిచిన ఫోటోలు కూడా బయటపడ్డాయి. వీటన్నిటి దృష్ట్యా కొత్త ఆక్టావియాను త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. కానీ కరోనా వైరస్ కారణంగా విడుదల ఇప్పుడు వాయిదా పడే అవకాశం ఉంది.

MOST READ:కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

కంపెనీ యొక్క మునుపటి వెర్షన్ స్కోడా ఆక్టేవియా 2013 లో భారత మార్కెట్లో ప్రారంభించబడింది. విడుదలైనప్పటినుంచి దీనికి దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుంది. అధికంగా ఉన్న డిమాండ్ కారణంగా ఇప్పుడు చాలా అప్డేట్ ఫీచర్స్ తో కొత్త 2021 స్కోడా ఆక్టావియా విడుదలకు సిద్దమయ్యింది. కానీ కరోనా దీనికి అడ్డుపడింది.

భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

కొత్త 2021 స్కోడా ఆక్టావియా కారు, దాని మునుపటి మోడల్‌తో పోలిస్తే సొగసైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ కొత్త కారు యొక్క గ్రిల్ వెడల్పుగా ఉండి చాలా దూకుడుగా ఉంటుంది. ఫ్రంట్ బంపర్ డిజైన్ కూడా మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా చాలా వరకు మార్చబడింది.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

ఈ కొత్త 2021 స్కోడా ఆక్టావియా ముందు వైపు ఎయిర్ డ్యామ్ ఉంది, దీనికి ఇరువైపులా ఎల్ఇడి ఫాగ్ లాంప్స్ మరియు రెండు యూనిట్లను కలిపే సన్నని క్రోమ్ స్ట్రిప్ ఉంది. అంతే కాకుండా ఇందులో కంపెనీ యొక్క మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ కూడా ఉంది.

భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

వెనుక భాగంలో బూట్ లిడ్ ఉండటం వల్ల ఇది మరింత ఆకర్షణీయంగా మరియు దూకుడుగా కనిపిస్తుంది. బూట్ లిడ్ పొడవునా బోల్డ్ అక్షరాలతో స్కోడా అని వ్రాయబడి ఉంటుంది. ఈ కొత్త సెడాన్ కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌ను కూడా పొందుతుంది.

MOST READ:2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

2021 స్కోడా ఆక్టావియా కారు లోపల క్యాబిన్ కొత్త డిజైన్‌ను పొందుతుంది. ఇందులో కొత్త ఇన్స్ ట్రూమెంట్ క్లస్టర్ ఇప్పుడు బ్రాండ్ యొక్క కాక్‌పిట్ డిజైన్‌ను కలిగి ఉన్న 10.25 ఇంచెస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే కోసం సెడాన్ మరో 10.25 ఇంచెస్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.

భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

స్కోడా ఆక్టావియాలో 2.0 ఎల్‌టిఎస్‌ఐ టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కొత్త స్కోడా ఆక్టావియాలో 1.5 లీటర్ టిఎస్‌ఐ, ఫోర్ సిలిండర్, పెట్రోల్ ఇంజన్ అమర్చనున్నారు. ఈ ఇంజిన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

భారత్‌లో 2021 స్కోడా ఆక్టావియా విడుదల వాయిదా.. కారణం ఇదే

2021 స్కోడా ఆక్టావియా భారత మార్కెట్లో మంచి పెర్ఫార్మెన్స్ సెడాన్ కానుంది. ఇది ఆక్టావియా పెర్ఫార్మెన్స్ కార్ ప్రియులను ఎంతగానో ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇటీవల నిర్వహించిన యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ లో స్కోడా ఆక్టావియా 5 స్టార్ రేటింగ్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఇది మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
2021 Skoda Octavia Launch Could Be Delayed. Read in Telugu.
Story first published: Wednesday, April 21, 2021, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X