Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ Skoda (స్కోడా) భారతీయ మార్కెట్లో కొత్త Skoda Slavia (స్కోడా స్లావియా) ఏ కొత్త సెడాన్ ను విడుదల చేయడానికి సిద్దమవుతుంది. కంపెనీ ఈ కొత్త Skoda Slavia ను స్కోడా ఆటో ఇండియా ప్లాన్ చేసిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా విడుదల చేయనుంది. అయితే కంపెనీ 2021 నవంబర్ 18 న ఆవిష్కరించనుంది.

Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

Skoda కంపెనీ ఈ కొత్త సెడాన్ ధరను 2022 మొదటి త్రైమాసికంలోవెల్లడించే అవకాశం ఉంటుంది. కొత్త స్కోడా స్లావియా భారత మార్కెట్లో ఇప్పటికే ఉన్న హోండా సిటీకి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ధర కూడా దాని ప్రత్యర్థి హోండా సిటీ ధరకు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది.

Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

కంపెనీ ప్రస్తుతం ఉన్న స్కోడా ర్యాపిడ్ సెడాన్ స్థానంలో స్కోడా స్లావియాను లాంచ్ చేయనుంది. స్కోడా ఆటో ఇండియా ఇప్పటికే ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో తన కుషాక్ SUV ని విడుదల చేసింది. ఈ SUV కూడా అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది.

Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

స్కోడా కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త స్లావియా పరిమాణంలో స్కోడా ర్యాపిడ్ సెడాన్ కంటే ఎక్కువగా ఉటుంది. పొడవు మరియు కాకుండా ఈ సెడాన్ యొక్క వీల్‌బేస్ కూడా పెరిగింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం స్కోడా స్లావియా పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

Dimensions Skoda Slavia
Length 4,541 mm
Width 1,752 mm
Height 1,487 mm
Wheelbase 2,651 mm
Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

స్కోడా యొక్క కొత్త స్లావియా యొక్క ఫోటోలను కంపెనీ కొంత మభ్యపెట్టినప్పటికీ, దాని డిజైన్ కి సంబంధించిన సమాచారం కొంత ఇది వరకు వెలువడింది. ఇప్పటికే విడుదలైన సమాచారం ప్రకారం ఈ కొత్త సెడాన్ హెడ్‌లైట్, అల్లాయ్ వీల్ మరియు ఫ్రంట్ గ్రిల్‌ వంటి వాటిని పొందుతుంది.

Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

స్కోడా స్లావియా, కంపెనీ యొక్క సిగ్నేచర్ గ్రిల్ దాని ముందు భాగంలో పొందుతుంది, ఎయిర్ డ్యామ్‌లు దాని క్రింద ఇవ్వబడతాయి, ఇది పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటుంది. హెడ్‌లైట్ యూనిట్‌లు రెండు వైపులా ఉంచబడ్డాయి, ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. హెడ్‌లైట్‌ల క్రింద రౌండ్ ఫాగ్ లైట్లు ఉంచబడతాయి.

Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

ఇక దాని సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, ఇక్కడ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు, ఇవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి, కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దాని పైన ORVM ఇన్‌స్టాల్ చేయబడ్డాయి, అంతే కాకుండా ఇందులో టర్న్ ఇండికేటర్ ఇన్‌స్టాల్ చేయబడింది. డోర్ హ్యాండిల్ గుండా వెళుతున్న లైన్ వెనుక నుండి కారు ముందు వరకు కనిపిస్తుంది.

Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

ఇప్పటికి విడుదలైన ఫోటోల ప్రకారం ఈ కొత్త కారు యొక్క వెనుక భాగం బహిర్గతం చేయబడలేదు, కానీ వెనుక బంపర్ కొద్దిగా పొడుచుకు వచ్చినట్లు చూడవచ్చు. దీని రూప్ పైన యాంటెన్నా అమర్చబడింది, అయితే ఇది పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. ఇందులో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఎల్‌ఈడీ లైట్లు అని భావిస్తున్నాము.

Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

మొత్తంమీద, ఈ మిడ్ సైజ్ సెడాన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరియు ఇది స్కోడా ర్యాపిడ్ కంటే సైజులో కొంచెం పెద్దదిగా ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Slavia 1.0-litre TSI 3-cylinder 1.5-litre TSI 4-cylinder
Displacement 999 cc 1495 cc
Max Power 113 bhp 148 bhp
Max Torque 175 Nm 250 Nm
Transmission 6-Speed MT / 6-Speed AT 6-Speed MT / 7-Speed DSG
Skoda Slavia గురించి మరిన్ని వివరాలు.. వచ్చేశాయ్

Skoda Auto India (స్కోడా ఆటో ఇండియా) తన కొత్త Slavia (స్లావియా) ను రెండు ఇంజన్ ఎంపికలతో అందించే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
New skoda slavia compact sedan dimension and engine details
Story first published: Thursday, October 28, 2021, 9:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X