సింగపూర్‌లో అడుగుపెట్టిన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ కార్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ & మరింత అప్డేట్

జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి తన 2021 స్విఫ్ట్ స్పోర్ట్ కారును సింగపూర్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో ఒకటి. ఈ కొత్త సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఈ కొత్త సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ ఇంజిన్ కోసం కంపెనీ సింగపూర్ మార్కెట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సింగపూర్-స్పెక్ 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్‌లో 1.4-లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్లైన్ ఫోర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఈ ఇంజన్ 129 బిహెచ్‌పి పవర్ మరియు 235 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జతచేయబడింది. అంతే కాకుండా ఇందులో 48 వి మైల్డ్-హైబ్రిడ్ సిస్టం స్టాండర్డ్ గా అందించబడుతుంది. ఈ ఇంజిన్ లేటెస్ట్ యూరో 6 కాలుష్య నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది.

MOST READ:కరోనా బాధితులకోసం కొత్త హాస్పిటల్ ప్రారంభించిన ఒమేగా సెకి మొబిలిటీ; పూర్తి వివరాలు

ఈ కొత్త అప్డేటెడ్ ఇంజిన్ కలిగి ఉండటం వల్ల స్విఫ్ట్ స్పోర్ట్ మెరుగైన పనితీరును అందిస్తుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ హ్యాచ్‌బ్యాక్ కేవలం 9.1 సెకన్లలో గంటకు 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. ఈ స్విఫ్ట్ స్పోర్ట్స్ కారు దాదాపు 21.2 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది.

ఈ అప్డేటెడ్ సుజుకి స్విఫ్ట్ లో ప్రత్యేకంగా రూపొందించిన లిఫ్టింగ్ ఆర్మ్, ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్‌లో కాయిల్ స్ప్రింగ్స్‌తో మెక్‌ఫెర్సన్ స్ట్రట్ మరియు వెనుక భాగంలో ట్రైకాన్ బీమ్ సిస్టమ్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఆటోమేటిక్ ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, హాలోజన్ ఫాగ్ లాంప్స్ మరియు ఫాక్స్ కార్బన్-ఫైబర్ ట్రిమ్‌ వంటివి ఉన్నాయి.

MOST READ:రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

సుజుకి స్విఫ్ట్ యొక్క వెనుక బంపర్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, అడ్జస్టబుల్ వీల్ మిర్రర్, కీలెస్ ఎంట్రీతో పుష్-స్టార్ట్ బటన్, బ్లాక్అవుట్ మరియు సి-పిల్లర్, ఎల్ఇడి కాంబినేషన్ టైల్ లైట్స్ మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ కలిగి ఉంది.

2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ కార్ యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే ఇందులో రెడ్ ఫ్లాట్-బాటమ్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ కెమెరా మరియు డిజిటల్ క్లైమ్‌తో ఆటో క్లైమేట్, డిజిటల్ ఎంఐడి, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి.

MOST READ:తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్; 37 మంది మరణం 38 మంది గల్లంతు

అంతే కాకుండా ఇందులో ట్విన్ కప్ హోల్డర్స్, రెడ్ స్టిచ్ మరియు స్పోర్ట్ లెటరింగ్‌లతో ఫాబ్రిక్ సెమీ బకెట్ సీట్లు వంటివి కూడా ఉన్నాయి. స్విఫ్ట్ స్పోర్ట్ లో మెటల్ ఫుట్ పెడల్స్ ఉన్నాయి. 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ కారు కూడా గంటకు 210 కిమీ వేగంతో ప్రయాణించగలదు. ఈ కారు చూడటానికి అద్భుతంగా ఉండటమే కాకుండా, మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Suzuki Swift Sport Launched In Singapore. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X