భారత్‌లో కొత్త వోల్వో ఎస్60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు

వోల్వో కార్స్ ఇండియా తన కొత్త ఎస్ 60 సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వోల్వో ఎస్ 60 సింగిల్ 'ఇన్‌స్క్రిప్షన్' ట్రిమ్‌తో అందించబడుతుంది. ఎస్ 60 వోల్వో ధర ఇప్పుడు దేశీయ మార్కెటులో రూ. 45.90 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఇండియా). ఈ కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు

కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ యొక్క బుకింగ్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయబడ్డాయి. వినియోగదారులు కొత్త సెడాన్‌ను లక్ష రూపాయలకు బుక్ చేసుకోవచ్చు. ఈ సెడాన్ డెలివరీలు మార్చి 2021 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు

కొత్త వోల్వో ఎస్ 60 బ్రాండ్ యొక్క లేటెస్ట్ డిజైన్ తో వస్తుంది. సెడాన్ విస్తృత గ్రిల్ కలిగి ఉంటుంది. దాని చుట్టూ క్రోమ్ దాని మధ్యలో వోల్వో బ్రాండ్ యొక్క లోగో కలిగి ఉంటుంది. గ్రిల్‌కు ఇరువైపులా ఉన్న సొగసైన ఎల్‌ఈడీ ‘థోర్ హామర్' హెడ్‌ల్యాంప్‌లు. ఫ్రంట్ బంపర్ బిగ్ ఎయిర్ ఇంటెక్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా దీనికి ఇరువైపులా ఫాగ్ లాంప్స్ కలిగి ఉంటాయి.

MOST READ:2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు

భారత్‌లో కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు

2021 వోల్వో ఎస్ 60 యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ డిజైన్స్ కూడా చాలా ఆక్షర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త సెడాన్ యొక్క సైడ్స్ వద్ద ఏకైక హైలైట్ పెద్ద డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్. వెనుక భాగంలో సి షేప్ ఎల్‌ఈడీ టైల్ లైట్స్ ఉన్నాయి. వెనుక బంపర్ బ్లాక్ ఎలిమెంట్స్‌తో పాటు, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ తో పాటు క్రోమ్‌లో పూర్తయింది.

భారత్‌లో కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు

కొత్త వోల్వో ఎస్ 60 యొక్క లోపలి భాగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రీమియం క్యాబిన్ కలిగి ఉంది. ఈ సెడాన్ లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, సీట్లు, డోర్ ప్యానెల్స్ ఉంటాయి. మధ్యలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన 9 ఇంచెస్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

MOST READ:భారత సర్కార్ సాయం చేసి ఉంటే రూ.5,000 లకే ఈ కార్ లభించేంది..

భారత్‌లో కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు

కొత్త ఎస్ 60 ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఇతర ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంది. కొత్త ఎస్ 60 చాలా సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, లేన్ మిటిగేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

భారత్‌లో కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు

2021 వోల్వో ఎస్ 60 సెడాన్‌ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 187 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్టాండర్డ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది. ప్రస్తుతం 2021 వోల్వో ఎస్ 60 లో డీజిల్ ఇంజన్ ఆఫర్‌లో లేదు.

MOST READ:స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

భారత్‌లో కొత్త వోల్వో ఎస్ 60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు

కొత్త వోల్వో ఎస్ 60 యొక్క కలర్స్ విషయానికి వస్తే, ఇది క్రిస్టల్ వైట్ పెర్ల్, ఒనిక్స్ బ్లాక్, మాపుల్ బ్రౌన్, డెనిమ్ బ్లూ మరియు ఫ్యూజన్ రెడ్ వంటి 5 కలర్స్ ఆప్సన్స్ తో అందించబడుతుంది. వోల్వో ఎస్ 60 భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ సెడాన్ ఆఫర్. 2021 ఎస్ 60 సెడాన్ భారతీయ మార్కెట్లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, ఆడి ఎ 4 ఫేస్‌లిఫ్ట్ మరియు మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
2021 Volvo S60 Sedan Launched In India. Read in Telugu.
Story first published: Wednesday, January 20, 2021, 19:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X