రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న స్కార్పియో ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌పై పని చేస్తున్న సంగతి తెలిసినదే. కాగా, తాజాగా సరికొత్త 2021 మహీంద్రా థార్‌కి సంబంధించిన లేటెస్ట్ స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

ఈసారి మహీంద్రా తమ కొత్త తరం స్కార్పియోని రోడ్లపై కాకుండా, రాజస్థాన్ ఎడారుల్లో టెస్టింగ్ చేస్తుండటాన్ని ఈ ఫొటోల్లో చూడొచ్చు. ఈ ఎస్‌యూవీ యొక్క ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చెక్ చేసేందుకు కంపెనీ ఈ ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.

దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే కొత్త 2021 మహీంద్రా స్కార్పియో ఖచ్చితంగా 4x4 / ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఇది అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంటుందా లేక టాప్-ఎండ్ వేరియంట్లలో ఆప్షనల్‌గా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

సరికొత్త మహీంద్రా స్కార్పియోను, కంపెనీ గతేడాది మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం థార్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో, కొత్త థరం మహీంద్రా థార్‌లో కనిపించిన కొన్ని రకాల ఫీచర్లు మరియు ఉపయోగించిన పరికరాలను కూడా ఈ కొత్త తరం స్కార్పియోలో చూసే అవకాశం ఉంటుంది.

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

మహీంద్రా సంస్థకు స్కార్పియో ఎస్‌యూవీ ఓ లక్కీ చార్మ్‌లా పనిచేస్తుంది. ఇది చాలా కాలంగా సంస్థ యొక్క ప్రసిద్ధ మోడల్‌గా కొనసాగుతోంది. మార్కెట్లో లభిస్తున్న ప్రస్తుత తరం స్కార్పియో మోడల్ చాలా కాలంగా వినియోగంలో ఉంది. అయితే, ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ సెగ్మెంట్లో పెరిగిన పోటీ కారణంగా ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

ఈ నేపథ్యంలో, ఎస్‌యూవీ విభాగంలోని పోటీని గట్టిగా ఎదుర్కునేందుకు మహీంద్రా ఇప్పుడు తమ స్కార్పియోని అధునాతన డిజైన్, టెక్నాలజీ మరియు ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కొత్త తరం మహీంద్రా స్కార్పియో మునుపటి కంటే పెద్దదిగా మరియు గంభీరంగా ఉంటుందని సమాచారం.

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

కొత్త 2021 మహీంద్రా స్కార్పియో ఫ్రంట్ డిజైన్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని ఇదివరకటి స్పై చిత్రాలను చూస్తే స్పష్టమవుతోంది. దీని వెనుక భాగం ఇప్పుడు మరింత నిటారుగా అనిపిస్తుంది. మహీంద్రా స్కార్పియోను టర్బో డీజిల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో తీసుకురానున్నారు. ఇవే ఇంజన్లను కొత్త థార్‌లోనూ ఉపయోగిస్తున్నారు.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

అయితే, మహీంద్రా స్కార్పియోలో ఈ ఇంజన్లను భిన్నంగా ట్యూన్ చేసే అవకాశం ఉంది. ఇది కూడా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రానుంది. ఇందులో 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను మాత్రం ఎంపిక చేసిన వేరియంట్లలోనే ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇదివరకు లీకైన స్పైచిత్రాల్లో స్కార్పియోలోని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు సన్‌రూఫ్ ఫీచర్లు కూడా నిర్ధారించబడ్డాయి.

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

మహీంద్రా స్కార్పియోలో సన్‌రూఫ్ లాంటి ఫీచర్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం లభిస్తున్న ఎస్‌యూవీలో లోపలి భాగాన్ని డ్యూయల్ టోన్‌లో ఉంచారు, కాని కొత్త తరం మోడల్ ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇంకా ఇందులో కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఉంటుంది.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

కొత్త తరం స్కార్పియోలో లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా కంపెనీ యొక్క స్వంత కనెక్టింగ్ టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగులు, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి.

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో ప్రతి నెల సగటున 3000 - 4000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేస్తోంది. అయితే, కొత్త తరం మహీంద్రా స్కార్పియోని ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ ఈ మోడల్ అమ్మకాలను మరింత మెరుగుపరచుకోవాలని చూస్తోంది.

రాజస్థాన్ ఎడారిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో టెస్టింగ్: ఫొటో

కొత్త 2021 మహీంద్రా స్కార్పియోను ఈ ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టి, సంవత్సరం చివరిలో కానీ లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో డెలివరీలను చేయవచ్చని అంచనా. ధర విషయానికి వస్తే, మార్కెట్లో ఈ ఎస్‌యూవీని రూ.12 లక్షల నుండి రూ.18 లక్షల మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Next Gen Mahindra Scorpio Spied Testing In Rajasthan Desert. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X