ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'స్కార్పియో'లో కంపెనీ ఓ కొత్త తరం (నెక్స్ట్ జనరేషన్) మోడల్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు, స్పై చిత్రాలు వెల్లడయ్యాయి.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!

టీమ్‌బిహెచ్‌పిలో లీకైన స్పై చిత్రాల ప్రకారం, కొత్త తరం మహీంద్రా స్కార్పియోలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త 2022 మహీంద్రా స్కార్పియో మునుపటి తరం మోడల్ కన్నా మరింత పెద్దదిగా కనిపిస్తుంది.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!

కొత్త తరం మహీంద్రా స్కార్పియో ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్ మరియు హెడ్‌ల్యాంప్స్ డిజైన్‌తో ఇది పూర్తిగా సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. కొత్త స్కార్పియో వెనుక డిజైన్ మరింత నిటారుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!

సైడ్ ప్రొఫైల్‌లో స్టెప్ గార్డ్, డోర్లపై ప్లాస్టిక్ క్లాడింగ్, 10-స్పోక్ అల్లాయ్ వీల్స్, ఎమ్ఆర్ఆఫ్ వాండరర్ టైర్స్ మరియు పెద్ద వీల్ ఆర్చెస్ వంటి డిజైన్ ఫీచర్లను ఈ స్పై చిత్రాలలో గమనించవచ్చు. ఇంటీరియర్ ఫొటోలను గమనిస్తే, ఈ టెస్టింగ్ వాహనంలో పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఉన్న డ్యాష్‌బోర్డ్ కనిపిస్తుంది.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!

అలాగే, ఇందులోని సెంటర్ కన్సోల్ డిజైన్ ఎక్స్‌యూవీ300లోని సెంటర్ కన్సోల్ డిజైన్‌ను పోలినట్లుగా ఉంటుంది. ఇంకా ఇందులో ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, దానికి ఇరువైపులా నిటారుగా ఉండే ఏసి వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!

అంతేకాకుండా, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, మ్యాన్యువల్ పార్కింగ్ బ్రేక్, కారు పైభాగంలో గమనించినట్లయితే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌కి సంబంధించిన కంట్రోల్స్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ టెస్టింగ్ వాహనం స్కార్పియో యొక్క టాప్-ఎండ్ వేరియంట్‌గా తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!

కొత్త తరం స్కార్పియోలో లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది బ్రాండ్ యొక్క స్వంత కనెక్టివిటీ యాప్‌తో పాటుగా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి టెక్నాలజీలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్, బహుళ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉంటాయని సమాచారం.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త తరం మహీంద్రా స్కార్పియోను 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు మహీంద్రా థార్‌లో ఆఫర్ చేస్తున్న 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లతో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, స్కార్పియో లోడ్ వెయిట్‌కి అనుగుణంగా ఈ రెండు ఇంజన్లను రీట్యూన్ చేసే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!

మహీంద్రా థార్‌లో ఉపయోగించిన పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుందని గమనించండి. కాగా, కొత్త తరం స్కార్పియోలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

Source: Team BHP

Most Read Articles

English summary
Next Generation Mahindra Scorpio Spotted With Electric Sunroof And AMT Gearbox, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X