భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

భారతదేశంలో చాలా వేగంగా రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో ప్రతిరోజూ దాదాపు 30 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో తెలిపారు. భారత్‌మాలా ప్రాజెక్టు కింద దేశంలోని నగరాలను రహదారుల ద్వారా అనుసంధానం చేస్తున్నామని, ఈ ప్రాజెక్టులో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు.

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

ఈ పథకం కింద రోడ్లు చాలా వేగంగా నిర్మిస్తున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో ప్రతిరోజూ 29.6 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తున్నట్లు ఆయన పార్లమెంటుకు తెలిపారు. ఇప్పటివరకు ఒక రోజులో అత్యధిక దూరం వేయడం ఇదే మొదటి సారి, అంతే కాకుండా ఇది ఒక రికార్డ్ కూడా.

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

దేశంలో ఇదే వేగంతో రహదారులు నిర్మించటం కొనసాగిస్తే, త్వరలో మనం యూరప్ మరియు అమెరికాతో సమానంగా ఉంటామని ఆయన చెప్పారు. భారత్‌మాలా ప్రాజెక్టు కింద దేశంలో 34,800 కిలోమీటర్ల రోడ్లను రూ. 5.35 లక్షల కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

MOST READ:లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆవిష్కరించబడిన కొత్త 2021 సుజుకి హయాబుసా ; వివరాలు

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

ప్రస్తుతం ఒక ప్రాజెక్టు కింద 13,521 కిలోమీటర్ల రోడ్లు ప్రారంభించారు. సాధారణంగా ఇది దాదాపు 16,500 కిలోమీటర్ల రోడ్లు ప్రారంభించాల్సి ఉందని ఆయన చెప్పారు. దీని తరువాత 4,800 కిలోమీటర్లకు ప్రత్యేక టెండర్ డ్రా చేయబడుతుంది.

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

తన ప్రసంగంలో ఢిల్లీ మరియు ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక రోజులో 2.54 కిలోమీటర్ల 4 లేన్ల కాంక్రీట్ రహదారి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో పనిచేస్తున్న పటేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకే రోజులో 2.54 కిలోమీటర్ల రహదారిని తయారు చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు తెచ్చుకుంది.

MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

2021 మార్చి 31 నాటికి ఎన్‌హెచ్‌ఏఐ 11,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని గడ్కరీ ప్రకటించారు. చార్ ధామ్ ప్రాజెక్టుపై గడ్కరీ మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఏఐ 825 కి.మీ రహదారులను వెడల్పు చేసి మెరుగుపరుస్తోందని చెప్పారు.

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

ఈ ప్రాజెక్టులో ఉత్తరాఖండ్‌లోని కైలాష్-మానస సరోవర్ మార్గంలో జానకి చట్టి (యమునోత్రి), గంగోత్రి, గౌరికుండ్ (కేదార్‌నాథ్), మన (బద్రీనాథ్) సహా రూ. 12,072 కోట్ల వ్యయంతో రిషికేశ్ నుంచి రోడ్లు నిర్మించి వెడల్పు చేస్తున్నారు.

MOST READ:తండ్రి దూరమయ్యాక జ్ఞాపకార్థం హార్దిక్ పాండ్యా పంచుకున్న వీడియో, ఇదే

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

చార్ ధామ్ ప్రాజెక్టును మార్చి 2020 లో పూర్తి చేయాల్సి ఉందని, అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించినందున, ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయం మరింత పొడిగించబడిందని గడ్కరీ తెలిపారు.

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

రహదారి నాణ్యతను మెరుగుపరిచేందుకు సరైన రహదారికి నిర్మాణం జరగకపోవడానికి కారణమైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ యోచిస్తోంది. సరిగ్గా లేని రహదారి నిర్మాణానికి సంబంధించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది, దీని కింద కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయబడి జరిమానా విధించబడుతుంది.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

రహదారి కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రభుత్వం రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లకు 5 నుంచి 0 కోట్ల రూపాయల జరిమానా విధించబడే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వారికి 3 సంవత్సరాల నిషేధం కూడా విధించవచ్చు. ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా మెరుగైన రహదారులు నిర్మించడంలో కేంద్రం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

సాధారణంగా ఒక దేశం బాగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం రహదారులు చాలా అవసరం. అప్పుడే దేశం అభివృద్ధి మార్గంలో సాగుతుంది. అందుకే కేంద్రం ఈ రకమైన ఆలోచనలు చేస్తోంది. దీని ద్వారా పటిష్టమైన రోడ్డు నిర్మాణం జరుగుతుంది.

Most Read Articles

English summary
NHAI Creates New Record By Constructing About 30 Kms Road Per Day. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X