Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ (Nissan) సెప్టెంబర్ 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, కంపెనీ గత నెలలో మొత్తం 8716 యూనిట్ల వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయ మార్కెట్‌లో 2816 యూనిట్లను విక్రయించిగా 5,900 యూనిట్లను వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

గడచిన సెప్టెంబర్‌ 2020లో నిస్సాన్ విక్రయించిన 780 యూనిట్ల వాహనాలతో పోలిస్తే, గత నెల అమ్మకాలు ఏకంగా 261 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 2020 లో నిస్సాన్ మొత్తం ఎగుంతులు 211 యూనిట్లుగా ఉంటే, సెప్టెంబర్ 2021 లో ఇవి 5900 యూనిట్లుగా ఉన్నాయి.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, కంపెనీ దేశీయ మార్కెట్లో 18,591 యూనిట్ల వాహనాలను విక్రయించింది, 459 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో, ఎగుమతులలో కూడా గత ఏడాదితో పోలిస్తే 159 శాతం పెరుగుదల నమోదు చేయబడింది. ఈ సమయంలో మొత్తం 18,608 యూనిట్ల వాహనాలు భారత మార్కెట్ నుండి ఎగుమతి చేయబడ్డాయి.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చిన తరువాత, కంపెనీ అమ్మకాలలో గణనీయమైన వృద్ధి కనబరిచింది. ఈ మోడల్ కోసం దేశవ్యాప్తంగా భారీ బుకింగ్స్ వస్తున్నాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మాగ్నైట్ కోసం ఇప్పటి వరకూ 65,000 యూనిట్లకు పైగా బుకింగ్ లు వచ్చాయి.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

దేశంలోని ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే, నిస్సాన్ కూడా సెమీకండక్టర్ కొరతను ఎదుర్కొంటోంది. ఫలితంగా, నిస్సాన్ తమ వాహనాల ఉత్పత్తిలో తీవ్ర అంతయాన్ని ఎదుర్కుంటోంది. దీని కారణంగా నిస్సాన్ మాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ కూడా సాధారణం కన్నా ఎక్కువగా ఉంటోంది.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

అయితే, ఈ సవాళ్లను ఎదుర్కునేందుకు నిస్సాన్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. దేశీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ తమ వాహనాలపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఫలితంగా, ప్రతి నెలా కంపెనీ అమ్మకాలు కూడా మెరుగుపడుతున్నాయి. నిస్సాన్ తమ వాహనాల విక్రయ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కంపెనీ ఇటీవలే డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లో వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌ని కూడా ప్రారంభించింది. ఇది తమ వినియోగదారులు పూర్తిగా కొత్త మరియు మెరుగైన కారు కొనుగోలు అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

ఈ వర్చువల్ సేల్స్ అడ్వైజర్ నిస్సాన్ వినియోగదారులకు రియల్ టైమ్ ప్రొడక్ట్ సమాచారాన్ని అందిస్తుంది. ఈ వర్చువల్ అసిస్టెంట్ సాయంతో వాహన వివరాలు, వేరియంట్లు, యాజమాన్యం, బుకింగ్, టెస్ట్ డ్రైవ్, ఫైనాన్సింగ్ మరియు ఎక్స్ఛేంజ్‌ కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలను పొందవచ్చు. కస్టమర్ కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో సహాయపడటానికి ఈ ప్లాట్‌ఫామ్ సదరు కస్టమర్‌కు పూర్తిగా ఎండ్-టు-ఎండ్ సమాచారాన్ని అందిస్తుంది.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును టి20 ప్రపంచ కప్ యొక్క అధికారిక కార్ పార్ట్‌నర్‌ గా ప్రకటించింది. నిస్సాన్ బ్రాండ్ 2016 నుండి, ఐసిసి యొక్క గ్లోబల్ ప్రోగ్రామ్‌ లలో భాగస్వామిగా ఉందని మరియు దీని కింద, కంపెనీ టి20 వరల్డ్ కప్ 2021 లో కూడా భాగస్వామిగా ఉందని తెలిపింది. ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ కు నిస్సాన్ అధికారిక స్పాన్సర్‌ గా వ్యవహరిస్తుంది.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

నిస్సాన్ బ్రాండ్ భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో కూడా ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది మరియు వీరిద్దరూ కలిసి దేశంలో కోవిడ్-19 గురించి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నారు. ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ యొక్క వర్చువల్ ట్రోఫీ కోసం కపిల్ దేవ్ తన ఫిల్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు, దీనిని అందరూ ఉపయోగించుకోవచ్చు మరియు షేర్ చేసుకోవచ్చు.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

నిస్సాన్ నుండి వచ్చిన మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో లభిస్తున్న సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంటుంది. ఈ కారు కోసం ఇటీవల నిర్వహించిన ఎషియన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌ లో, మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. దేశీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

భారత మార్కెట్లో Magnite కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) అనే నాలుగు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేయడం లేదు.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో మొదటిది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్. ఇది గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Nissan సెప్టెంబర్ అమ్మకాలు భేష్.. మాగ్నైట్ ప్రభావంతో 261 శాతం పెరిగిన సేల్స్!

అలాగే, ఇందులో రెండవ ఇంజన్ ఆప్షన్ 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

Most Read Articles

English summary
Nissan car sales registered 261 percent growth in september 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X