పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

భారతీయ మార్కెట్లో పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా దేశంలోని దాదాపు చాలా వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాలను పెంచుకోవడానికి అద్భుతమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భాగంగానే ప్రముఖ వాహన తయారు సంస్థ అయిన Nissan (నిస్సాన్) కంపెనీ కూడా ఈ పండుగ సీజన్లో తన బ్రాండ్ వాహనాలపైన ఆఫర్స్ అందించడం ప్రారంభించింది.

పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

Nissan కంపెనీ అందించిన నివేదికల ప్రకారం, 2021 అక్టోబర్ 01 నుండి 2021 డిసెంబర్ 31 వరకు అనేక రకాల డిస్కౌంట్లను అందిస్తోంది, అంతే కాకుండా అనేక సర్వీసులను కూడా కంపెనీ ఫ్రీగా అందిస్తోంది. దీని కింద ఫ్రీ పికప్ అండ్ డ్రాప్, లేబర్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపు, ఫ్రీ టాప్ వాష్, యాక్సెసరీలపై స్పెషల్ డిస్కౌంట్, ఫ్రీ జనరల్ చెక్ మరియు ఫ్రీ ఆయిల్ ఫిల్టర్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

కంపెనీ అందిస్తున్న ఈ ప్రయోజనాలను మీ సమీప డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌లో మరింత ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కంపెనీ కొత్త డిస్కౌంట్స్ ప్రవేశపెట్టింది. నిస్సాన్ తన అన్ని కార్లపై ఈ తగ్గింపును అందిస్తోంది, అయితే కంపెనీ Nissan Magnite (నిస్సాన్ మ్యాగ్నైట్) కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.

పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

కంపెనీ దీనితో పాటు, ఈ నెలలో తన కార్లపై భారీ తగ్గింపులను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ యొక్క కిక్స్ SUV యొక్క 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై రూ. 15,000 క్యాష్ తగ్గింపు మరియు రూ. 70,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఇది కాకుండా, ఈ టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై రూ. 5,000 ఆన్‌లైన్ బుకింగ్ డిస్కౌంట్ మరియు రూ. 10,000 ఎంపిక చేసిన కార్పొరేట్ బెనిఫీట్స్ తో పాటు నిస్సాన్ కిక్స్ కొనుగోలుపై 7.99 శాతం ప్రత్యేక వడ్డీ రేటు వంటివి అందుబాటులో ఉన్నాయి.

పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

అదేవిధంగా ఇందులోని 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ పై కంపెనీ రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. దీనితో పాటు ఈ పెట్రోల్ వేరియంట్‌పై ఆన్‌లైన్ బుకింగ్ డిస్కౌంట్ రూ. 5,000 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ SUV పై రూ. 10,000 వరకు కార్పొరేట్ బెనీఫీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

ఇప్పుడు కంపెనీ యొక్క వాహనాలను మరింత సులభంగా కొనుగోలు చేయడానికి, డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫారమ్‌లో వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌ను కూడా ప్రారంభించింది. దీనితో కస్టమర్లు పూర్తిగా కొత్త మరియు మెరుగైన కారు కొనుగోలు అనుభూతిని పొందుతారని కంపెనీ పేర్కొంది. వర్చువల్ సేల్స్ అడ్వైజర్ నిస్సాన్ కస్టమర్‌లకు రియల్ టైమ్ ప్రొడక్షన్ సమాచారాన్ని అందిస్తుంది.

పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

ఈ వర్చువల్ అసిస్టెంట్ వాహనం వివరాలు, వేరియంట్లు, బుకింగ్, టెస్ట్ డ్రైవ్, ఫైనాన్సింగ్ మరియు ఎక్స్చేంజ్ వంటి వాటికీ సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది, కావున ఇది కారుని కొనుగోలు చేసే కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. కస్టమర్ కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో సహాయపడేందుకు ప్లాట్‌ఫారమ్ కస్టమర్‌కు పూర్తి ఎండ్-టు-ఎండ్ సమాచారాన్ని అందిస్తుంది.

పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి 60,000 బుకింగ్‌లను అందుకోగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ మ్యాగ్నైట్ SUV కి మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో మనకు తెలుస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ కోసం 25% బుకింగ్‌లు డిజిటల్ విక్రయాల ద్వారా పొందినవే.

కంపెనీ తన మాగ్నైట్ లాంచ్‌కు ముందు నిస్సాన్ వర్చువల్ షోరూమ్‌ను ప్రారంభించింది. వర్చువల్ డ్రైవ్ టెస్ట్‌ను ప్రవేశపెట్టిన ఆటోమోటివ్ పరిశ్రమలో నిస్సాన్ మొదటి కంపెనీ. నిస్సాన్ మాగ్నైట్ కంపెనీ ఉత్పత్తుల శ్రేణిలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది.

పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో అందించబడ్డాయి.ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉపయోగించబడింది.

పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్న Nissan: ఇక త్వరపడండి

నిస్సాన్ మాగ్నైట్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటం అల్ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికి కూడా కంపెనీ యొక్క పెరగటానికి నిస్సాన్ మ్యాగ్నైట్ ప్రధాన పాత్ర వహిస్తుంది.

నిస్సాన్ కంపెనీ ఇప్పుడు అందిస్తున్న ఈ ఆఫర్స్ ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము, కావున అమ్మకాలు మునుపటికంటే కూడా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Nissan festive offer free general checkup more details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X