వరల్డ్ వాటర్ డే 2020: నిస్సాన్-డాట్సన్ కస్టమర్లకు ఉచిత ఫోమ్ కార్ వాష్!

నేడు (మార్చి 22) ప్రపంచ నీటి దినోత్సవం (వరల్డ్ వాటర్ డే)ని పురస్కరించుకొని జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, తమ వాహనాలకు ఉచిత ఫోమ్ వాష్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఫోమ్ వాష్ టెక్నిక్ ద్వారా వాహనాలను కడగటానికి అయ్యే నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

వరల్డ్ వాటర్ డే 2020: నిస్సాన్-డాట్సన్ కస్టమర్లకు ఉచిత ఫోమ్ కార్ వాష్!

భారతదేశంలోని డాట్సన్ మరియు నిస్సాన్ కంపెనీలు తమ కస్టమర్ల కోసం ఈరోజు అన్ని కేంద్రాలలో ఉచిత ఫోమ్ వాష్ సేవలను అందిస్తున్నాయి. సాంప్రదాయక వాష్‌తో పోల్చితే తమ ఫోమ్ వాష్ టెక్నిక్‌తో కారును కడగటానికి 45 శాతం నీరు మాత్రమే అవసరమవుతుందని కంపెనీ పేర్కొంది.

వరల్డ్ వాటర్ డే 2020: నిస్సాన్-డాట్సన్ కస్టమర్లకు ఉచిత ఫోమ్ కార్ వాష్!

నిస్సాన్ ఇండియా ఈ ఫోమ్ వాష్ టెక్నిక్ ద్వారా రోజుకు 1,200 ఫోమ్ వాష్‌లతో దాదాపు 86,400 లీటర్ల నీటిని సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, 2014లో ఫోమ్-వాష్ టెక్నిక్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి సుమారు 15 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేసినట్లు నిస్సాన్ తెలిపింది.

MOST READ:విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

వరల్డ్ వాటర్ డే 2020: నిస్సాన్-డాట్సన్ కస్టమర్లకు ఉచిత ఫోమ్ కార్ వాష్!

చెన్నైలోని నిస్సాన్-రెనో అలయన్స్‌కి చెందిన ప్లాంట్‌లో ఈ ఫోమ్ వాష్ టెక్నిక్ ద్వారా కంపెనీ 205 లక్షల లీటర్ల నీటిని ఆదా చేస్తోంది. సాధారణ పద్ధతిలో కారును కడగడంతో పోలిస్తే, ఈ ఫోమ్ ద్వారా కడిగిన కారు 38 శాతం ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది.

వరల్డ్ వాటర్ డే 2020: నిస్సాన్-డాట్సన్ కస్టమర్లకు ఉచిత ఫోమ్ కార్ వాష్!

చెన్నైలోని ఒరాగాడమ్‌లో రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే‌లా ఈ ఇరు కంపెనీలు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాయి.

MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

వరల్డ్ వాటర్ డే 2020: నిస్సాన్-డాట్సన్ కస్టమర్లకు ఉచిత ఫోమ్ కార్ వాష్!

నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ భాగస్వామ్యంతో, తమకు సమీపంలో ఉన్న గ్రామాల్లోని సరస్సుల చుట్టూ 500 మొక్కలను నాటామమని, దీని ఫలితంగా సరస్సు నీటి నిల్వ సామర్థ్యాన్ని 205 లక్షలకు పెంచామని రెనాల్ట్-నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిజు బలేంద్రన్ చెప్పారు.

వరల్డ్ వాటర్ డే 2020: నిస్సాన్-డాట్సన్ కస్టమర్లకు ఉచిత ఫోమ్ కార్ వాష్!

అంతేకాకుండా, రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ ప్లాంట్ తమ ఉద్యోగులకు మరియు కాంట్రాక్టర్లకు నీటి పొదుపు పద్ధతుల్లో శిక్షణ కూడా ఇస్తుంది. ఈ ప్లాంట్ తన నీటి అవసరాలను 80 రోజుల వరకు తీర్చడానికి 1.6 లక్షల కిలోలీటర్ల నిల్వ సామర్థ్యం కలిగిన మూడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చెరువులను కూడా ఏర్పాటు చేసింది.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

వరల్డ్ వాటర్ డే 2020: నిస్సాన్-డాట్సన్ కస్టమర్లకు ఉచిత ఫోమ్ కార్ వాష్!

ప్రతి ఏటా వర్షపునీటి సేకరణ సదుపాయాల ద్వారా, ఈ ప్లాంట్ మొత్తం మంచినీటి అవసరాలలో 75 శాతానికి పైగా ఆదా అవుతుందని నిస్సాన్ ఇండియా తెలిపింది.

వరల్డ్ వాటర్ డే 2020: నిస్సాన్-డాట్సన్ కస్టమర్లకు ఉచిత ఫోమ్ కార్ వాష్!

నిస్సాన్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నిస్సాన్ మాగ్నైట్‌లో టర్బో వేరియంట్ ధరలను కంపెనీ భారీగా పెంచింది. న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌తో లభించే మాగ్నైట్ కార్లు కాకుండా టర్బో పెట్రోల్ ఇంజన్‌తో లభించే మాగ్నైట్ కార్ల ధరలు రూ.30,000 వరకూ పెరిగాయి. - తాజా ధరల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

Most Read Articles

English summary
Nissan India Offers Free Foam Wash Service To Its Customers On World Water Day. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X