Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా (Nissan India) భారతదేశంలోని నిస్సాన్ మరియు డాట్సన్ కస్టమర్‌ల కోసం తన ప్లాట్‌ఫారమ్ 'నిస్సాన్ ఇంటెలిజెంట్ ఓనర్‌షిప్' (Nissan Intelligent Ownership) ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్ కోసం కంపెనీ ఇప్పుడు జూమ్‌కార్ (Zoomcar) మరియు ఓరిక్స్‌ (Orix) తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

కంపెనీ ప్రారంభించిన ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ భారతీయ కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారాన్ని గమనించినట్లయితే, 'నిస్సాన్ ఇంటెలిజెంట్ ఓనర్‌షిప్' ప్రోగ్రామ్ ప్రస్తుతం ఢిల్లీ NCR, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ మరియు పూణే వంటి నగరాలలో అందుబాటులో ఉంది.

Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

నిస్సాన్ ఇంటెలిజెంట్ ఓనర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అనేది పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఎందుకంటే కస్టమర్‌లు సబ్‌స్క్రిప్షన్ ప్రారంభంలో నామమాత్రపు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను మాత్రమే చెల్లిస్తారు, అంతే కాకుండా కస్టమర్లు ఎంచుకున్న కాలవ్యవధికి, నిర్ణీత నెలవారీ రుసుము ఆధారంగా తర్వాత చెల్లిస్తారు. ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉన్న ప్రదేశాలలో నిస్సాన్ ఇండియా వెబ్‌సైట్‌లో కస్టమర్‌లు కావలసిన మెంబర్‌షిప్ ప్లాన్‌ను బుక్ చేసుకోవచ్చు.

Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

నిస్సాన్ ఇంటెలిజెంట్ ఓనర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ షెడ్యూల్డ్ మరియు అన్‌షెడ్యూల్ రిపేర్లు, టైర్ మరియు బ్యాటరీ రీప్లేస్‌మెంట్, 24×7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, పేపర్‌వర్క్ ఖర్చులు, జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్ ట్యాక్స్ మరియు RTO ఖర్చులతో సహా అన్ని నిర్వహణ ఖర్చులను కవర్ చేస్తుంది. కావున ఇది నిస్సాన్ ఇండియా కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

అంతే కాకూండా వెహికల్ ఫాస్ట్ ట్యాగ్, స్టాండర్డ్ యాక్ససరీస్ మరియు పిక్-అప్ మరియు డ్రాప్ సదుపాయం వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. దీని గురించి నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'రాకేష్ శ్రీవాస్తవ' మాట్లాడుతూ, రోజురోజుకి కస్టమర్ యొక్క జీవనశైలి అభివృద్ధి చెందుతోంది. కావున కంపెనీ ఇప్పుడు జూమ్‌కార్ మరియు ఓరిక్స్‌లతో చేతులు కలపడం వల్ల కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది, అన్నారు.

Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

నిస్సాన్ ఇంటెలిజెంట్ ఓనర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ స్పేస్‌లో షేర్-బ్యాక్‌తో చాలా వినూత్నమైనది. నిస్సాన్ మరియు డాట్సన్ కస్టమర్‌లకు పొదుపు సంభావ్యతతో ఆహ్లాదకరమైన కార్ యాజమాన్య అనుభవాన్ని అందిస్తుంది. కావున ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం.

Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

ఈ సందర్భంగా జూమ్‌కార్ సీఈఓ మరియు సహ-వ్యవస్థాపకుడు గ్రెగ్ మోరన్ మాట్లాడుతూ, వాహన యాజమాన్యం కోసం సౌకర్యవంతమైన సభ్యత్వాన్ని అందించడానికి నిస్సాన్ మోటార్ ఇండియా మరియు ఓరిక్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది కస్టమర్లకు పారదర్శకమైన మరియు చౌకైన అనుభూతిని అందిస్తుంది. మొత్తం స్థాయిలో, Zoomcar మా పరిశ్రమలో ప్రముఖ వాహన సబ్‌స్క్రిప్షన్-ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌కు నిస్సాన్ వంటి ఎంటర్‌ప్రైజ్ భాగస్వాములను జోడించడంపై దృష్టి సారిస్తుంది.

Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

అదేవిధంగా ఒరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సందీప్ గంభీర్ మాట్లాడుతూ, "కస్టమర్‌లు తమకు ఇష్టమైన కారును నడపడానికి సబ్‌స్క్రిప్షన్ ఒక గొప్ప ఛానెల్‌గా మరియు స్పష్టంగా అభివృద్ధి చెందుతోంది. కొన్ని నెలలుగా ఈ చొరవలో భాగంగానే నిస్సాన్ ఇండియాతో సన్నిహితంగా పనిచేస్తున్నాము. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

నిస్సాన్ ఇండియా కస్టమర్లకు పూర్తిగా కాంటాక్ట్‌లెస్ కార్ కొనుగోలు అనుభవాన్ని అందించడానికి షాప్@హోమ్, ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు వర్చువల్ షోరూమ్ మరియు వర్చువల్ టెస్ట్ డ్రైవ్ ప్రారంభించడం కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంది, అంతే కాకుండా ఇది ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

Zoomcar మరియు Orix తో చేతులు కలిపిన Nissan.. ఎందుకంటే?

ఇప్పటికే నిస్సాన్ కంపెనీ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఈ భాగస్వామ్యం మరింతమంది కస్టమర్లను ఆకర్షిస్తుంది, అని ఆశిస్తున్నాము. ఇప్పటికే ప్రారంభమైన పండుగ సీజన్లో ఈ నెల అమ్మకాలు మరింత మెరుగ్గా ఉంటాయని కూడా భావిస్తున్నాము.

Nissan India (నిస్సాన్ ఇండియా) 2021 అక్టోబర్ నెలలో నిస్సాన్ మరియు డాట్సన్‌లకు 3,913 కార్ల దేశీయ హోల్‌సేల్ అమ్మకాలను మరియు 3,004 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసిందని కంపెనీ తెలియజేసింది. అక్టోబర్ 2020లో, కంపెనీ దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు 1,105 కార్లు మరియు 75 కార్లు ఎగుమతి చేయబడ్డాయి. నిస్సాన్ సేల్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Nissan india partnership with zoomcar and orix for subscription program details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X