మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, భారత మార్కెట్లో తయారు చేసి, విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ మాగ్నైట్' ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. నిస్సాన్ ఇండియా గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది.

మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఒక్క మోడల్ భారతదేశంలో నిస్సాన్ కంపెనీ తీరును మార్చింది. సంస్థ అమ్మకాల సంఖ్యను గణనీయంగా పెంచడంలో సహకరించింది.

మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

తాజా సమాచారం ప్రకారం కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, నేపాల్ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఈ మోడల్‌ను ప్రారంభించినప్పటి నుండి, నిస్సాన్ ఇండియా మొత్తం 15,010 మాగ్నైట్ ఎస్‌యూవీలను (మే 2021 చివరి నాటికి) ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది.

మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

వీటిలో మొత్తం 13,790 యూనిట్లు భారత మార్కెట్లో అమ్ముడు కాగా, 1,220 యూనిట్లను ఎగుమతి కోసం ఉంచబడ్డాయి. 'మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్' అనే కాన్సెప్ట్ ఆధారంగా నిర్మించిన కొత్త నిస్సాన్ మాగ్నైట్, ఫిబ్రవరి 2021లో నేపాల్ మార్కెట్లో ప్రారంభించటానికి ముందే దాని విజయాన్ని పునరావృతం చేసింది.

మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

అక్కడి మార్కెట్లో 30 రోజుల్లో ఈ ఎస్‌యూవీ కోసం 2,292 బుకింగ్‌లు వచ్చాయని, 1,580 యూనిట్లు అమ్ముడైపోయాయని కంపెనీ పేర్కొంది. ఈ విషయంపై నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ అధ్యక్షుడు సినాన్ ఓజ్కోక్ వ్యాఖ్యానిస్తూ.. "విజయవంతమైన గ్లోబల్ లాంచ్ తరువాత, సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ భారత వినియోగదారుల నుండి మంచి ఆదరణ పొందుతోంది" అని అన్నారు.

మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం వస్తున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో, తమ ప్లాంట్‌లో మూడవ షిఫ్టును ప్రారంభించింది. ఇందుకోసం కంపెనీ అదనంగా 1000 మందికి పైగా సిబ్బందిని నియమించుకుంది. దీని వలన కంపెనీ భారతదేశంలోనే కాకుండా మరియు ఎగుమతి మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌ను కూడా తీర్చగలుగుతోంది.

మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) నాలుగు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేయడం లేదు. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో మొదటిది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్. ఇది గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

ఇకపోతే, ఇందులో రెండవ ఇంజన్ ఆప్షన్ 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్; గ్లోబల్ మార్కెట్లకు నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ ఇండియా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని టాప్-ఎండ్ వేరియంట్లలో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్, 3.5 ఇంచ్ ఎల్‌సిడి క్లస్టర్, ఆల్ పవర్ విండోస్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్‌లు మరియు ఫాగ్‌లాంప్స్ వంటి ఫీచర్లను అందిస్తోంది.

Most Read Articles

English summary
Nissan India Starts Magnite Compact SUV Exports To Nepal, Indonesia And South Africa. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X