కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

నిస్సాన్ ఇండియా (Nissan India) దేశీయ మార్కెట్లో కస్టమర్లకు మరింత అనుకూలంగా ఉండటం కోసం నిస్సాన్ సర్కిల్ ప్రోగ్రామ్‌ (Nissan Circle Program) ప్రారంభించింది. ఈ కొత్త ప్రోగ్రామ్ కింద కంపెనీ తన కస్టమర్లకు రివార్డ్ పాయింట్లను సంపాదించే అవకాశంతో పాటు ప్రత్యేకమైన ఆఫర్‌లు ఇవ్వబడతాయి. కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త ప్రోగ్రామ్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

నిస్సాన్ ఇండియా తన కస్టమర్ల కోసం నిస్సాన్ సర్కిల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, దీని కింద కంపెనీ కస్టమర్లకు రివార్డ్ పాయింట్లను సంపాదించే అవకాశంతో పాటు ప్రత్యేకమైన ఆఫర్‌లు ఇవ్వబడతాయి.

కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

నిస్సాన్ సర్కిల్ ప్రోగ్రామ్‌ కింద కస్టమర్స్ సంపాదించుకునే రివార్డ్ పాయింట్లను పేటీఎం క్యాష్‌గా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నగదుని కస్టమర్ కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి తినడానికి, ప్రయాణించడానికి, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయడానికి వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం తీసుకురావడం జరిగింది.

కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

నిస్సాన్ కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త ప్రోగ్రామ్ కింద తమ కస్టమర్లతో సంబంధాన్ని మరింత బలపరుచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కంపెనీ యొక్క కస్టమర్లు దీని ద్వారా ఎక్కువ సమయంలో కంపెనీతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిస్సాన్ కిక్స్ లేదా మాగ్నైట్ కార్లను బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు.

కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌ల నుండి వాల్యూ యాడెడ్ సర్వీసులు మరియు యాక్సెసరీల కోసం వాటిని పేటీఎం క్యాష్‌గా మార్చుకునే సమయంలో, కస్టమర్‌లు అనేక ప్రముఖ బ్రాండ్‌ల నుండి వోచర్‌లను వారి రివార్డ్‌లతో కొనుగోలు చేయవచ్చు. అంతే కాకూండా వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు సిఫార్సు చేస్తున్న కస్టమర్‌లు వారి సంప్రదింపు నంబర్‌ను అందించడం ద్వారా అదనపు రివార్డ్‌లను పొందవచ్చు. ఇది కూడా వారికి చాలా నగదుని అందిస్తుంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

నిస్సాన్ కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త నిస్సాన్ సర్కిల్ ప్రోగ్రామ్ యొక్క కస్టమర్‌లు వాహనాన్ని డెలివరీ చేసుకున్న తరువాత వారు పాయింట్లను సంపాదించవచ్చు. ఇవన్నీ కూడా పొందిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. కావున వీటిని వినియోగదారుడు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

నిస్సాన్ ఇండియా సేల్స్:

నిస్సాన్ ఇండియా ఇటీవల విడుదల చేసిన అమ్మకాల నివేదికల ప్రకారం, కంపెనీ యొక్క కొత్త నిస్సాన్ మాగ్నైట్ విజయవంతమైన ఉత్పత్తిగా మరో సారి నిరూపించబడింది. నిస్సాన్ ఇండియా నవంబర్ 2021 లో నిస్సాన్ మరియు డాట్సన్ విక్రయాలు దేశీయ మార్కెట్లో 2,651 యూనిట్లు. అదేవిధంగా కంపెనీ 2,954 యూనిట్లను ఎగుమతి చేసినట్లు కూడా తెలుస్తుంది.

కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

కంపెనీ గణాంకాల ప్రకారం, నవంబర్ నెలలో దేశీయ మార్కెట్లో నిస్సాన్ ఇండియా 161% వృద్ధిని సాధించగా, ఎగుమతుల విషయంలో 152% వృద్ధిని సాధించింది. 2021 నవంబర్ అమ్మకాల గురించి నిస్సాన్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కంపెనీ కొత్త నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభించినప్పటి నుండి 73,000 బుకింగ్‌లను పొందగలిగింది. ఈ SUV కి దేశీయ మార్కెట్లో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఈ SUV కి 31% బుకింగ్‌లు డిజిటల్ ఎకో-సిస్టమ్ నుండి వస్తున్నాయని అన్నారు.

కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

ఇటీవలే నిస్సాన్ ఇండియా 30,000 యూనిట్ల నిస్సాన్ మాగ్నైట్ డెలివరీలను నిరాఘాటంగా పూర్తి చేసింది. ఈ అమ్మకాల సంఖ్యను కంపెనీ కేవలం ఒక సంవత్సర కాలంలోనే సాధించింది. నిస్సాన్ మాగ్నైట్‌ దేశీయ మార్కెట్లో 2020 డిసెంబర్ 02 న రూ. 4.99 లక్షల వద్ద విడుదలైంది. అయితే ఇది 2021 అక్టోబర్ చివరి నాటికి మొత్తం 29,701 యూనిట్లను విక్రయించింది. మొత్తానికి నిస్సాన్ మాగ్నైట్ SUV కి విపరీతమైన డిమాండ్ ఉంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించిన Nissan.. ఇక కస్టమర్లు ఫుల్ ఖుష్

ప్యాసింజెర్ వెహికల్ విభాగంలో నిస్సాన్ ఇండియా వాటా ఏడాది క్రితం 0.37% (4,431 యూనిట్లు) నుండి ఏప్రిల్-అక్టోబర్ 2021 కాలంలో 1.38% (22,304 యూనిట్లు)కి మరియు యుటిలిటీ వాహన విభాగంలో 0.20% (924 యూనిట్లు) నుండి 2.78% (21,297 యూనిట్లు) కి పెరిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు క్రమంగా పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
Nissan introduces nissan circle program offers details
Story first published: Wednesday, December 8, 2021, 14:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X