'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; పూర్తి వివరాలు

ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసిన మహమ్మారి కరోనా వైరస్. కరోనా వైరస్ కారణంగా ఆటో మొబైల్ పరిశ్రమ కూడా భారీ పతనాలను చవిచూడవలసి వచ్చింది. అయితే భారతీయ మార్కెట్లోని కంపెనీలు వినియోగదారుల సౌలభ్యం కోసం డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించాయి.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

కరోనా మహమ్మారి సమయంలో Nissan India (నిస్సాన్ ఇండియా) కంపెనీ కూడా కొనుగోలుదారులకు సౌలభ్యంగా ఉండటానికి మరియు కారు కొనుగోలు అనుభవాన్ని పొందటానికి డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించింది. అయితే ఈ విధానం కస్టమర్‌ల కొనువులు విధానాన్ని ఇప్పటికి కూడా బాగా మార్చి వేసింది. ఇప్పుడు కూడా చాలామంది కొనుగోలుదారులు డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ ఇనియోగిస్తున్నారు.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

కంపెనీ ప్రారంభించిన ఈ డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లో వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో, వినియోగదారులు పూర్తిగా కొత్త మరియు మెరుగైన కారు కొనుగోలు అనుభవాన్ని పొందుతారని కంపెనీ స్పష్టం చేసింది.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

కంపెనీ ప్రారంభించిన ఈ వర్చువల్ సేల్స్ అడ్వైజర్ అనేది నిస్సాన్ వినియోగదారులకు రియల్ టైమ్ ప్రొడక్ట్ సమాచారాన్ని అందిస్తుంది. ఈ వర్చువల్ అసిస్టెంట్ వాహన వివరాలు, వేరియంట్లు, బుకింగ్, టెస్ట్ డ్రైవ్, ఫైనాన్సింగ్ మరియు ఎక్స్ఛేంజ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ఇది వాహన కొనుగోలుదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యక్ష కస్టమర్ పరస్పర చర్యను సవాలు చేసింది. కంపెనీ నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభించినప్పుడు, నిస్సాన్ వర్చువల్ షోరూమ్ మరియు వర్చువల్ టెస్ట్ డ్రైవ్‌ను ప్రవేశపెట్టింది. వర్చువల్ సేల్స్ అడ్వైజర్ వాహన సంబంధిత సమాచారాన్ని కస్టమర్‌కు పారదర్శకంగా అందించే ఆన్‌లైన్ కన్సల్టెంట్. ఇది కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంది.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

భారతీయ మార్కెట్లో Nissan India తన Nissan Magnite (నిస్సాన్ మాగ్నైట్) విడుదల చేసినప్పటి నుంచి దాదాపు 60,000 బుకింగ్స్ అందుకుంది. అంతే కాకుండాఈ SUV గురించి 3 లక్షలకు పైగా కస్టమర్‌లు ఆరా తీశారు. Nissan Magnite కోసం 25% బుకింగ్‌లు డిజిటల్ అమ్మకాల ద్వారా స్వీకరించబడ్డాయి.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

Nissan Magnite ప్రారంభానికి ముందు నిస్సాన్ వర్చువల్ షోరూమ్‌ను ప్రారంభించింది. నిస్సాన్ ఆటోమోటివ్ పరిశ్రమలో వర్చువల్ డ్రైవ్ టెస్ట్ ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ Nissan. Nissan Magnite కారు కంపెనీ యొక్క బెస్ట్ కారుగా అతి తక్కువ కాలంలోనే నిలిచింది.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

Nissan Magnite ఎస్‌యూవీ తన సెగ్మెంట్‌లో రెనాల్ట్ కిగర్, టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. భారతదేశంలో త్వరలో రానున్న పండుగ సీజన్స్ దృష్టిలో ఉంచుకుని, దాదాపు అన్ని కంపనీలు కార్ల డెలివరీలను చాలా వేగవంతం చేస్తుంది.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

Nissan యొక్క Nissan Magnite SUV విషయానికి వస్తే, Nissan Magnite నాలు వేరియంట్లలో అందించబడుతుంది. అవి XE, XL, XV మరియు XV వేరియంట్లు. ఇందులో XE బేస్ వేరియంట్ కాగా XL అనేది మిడ్ సైజ్ వేరియంట్, అదేవిధంగా XV అనేది హై ఎండ్ మోడల్.

Nissan Magnite అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉటుంది. ఇందులో 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్, రూఫ్ రైల్, ఎల్సిడి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ని పొందుతుంది. ఇవన్నీ కారుని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

Nissan Magnite ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో అందించబడ్డాయి.

Magnite యొక్క 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉపయోగించబడింది.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో Nissan సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి క్రాష్ టెస్ట్ లో మాగ్నైట్ కి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది. ఈ కారణంగా దాని బుకింగ్‌లు కూడా పెరుగుతున్నాయి.

'వర్చువల్ సేల్స్ అడ్వైజర్‌' ప్రారంభించిన Nissan; వివరాలు

ఈ కారులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, 360 డిగ్రీల కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటివి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న Nissan Magnite ప్రారంభ ధర రూ. 5.49 లక్షలు.

Most Read Articles

English summary
Nissan launches virtual sales advisor on its digital platform details
Story first published: Saturday, September 25, 2021, 9:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X