పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

భారతదేశంలో నిస్సాన్ మ్యాగ్నైట్ 2020 డిసెంబర్ 2 న విడుదల చేయబడింది. ఈ కొత్త మ్యాగ్నైట్ బుకింగ్స్ ఇప్పుడు కేవలం 3 నెలల్లో 40,000 యూనిట్లకు చేరుకుంది. భారతదేశంలో నిస్సాన్ మాగ్నైట్, కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి చాలా వేగంగా అమ్మకాలను సాగిస్తోంది. 2021 జనవరి నెలలో దాదాపు 4,500 యూనిట్లకు పైగా నిస్సాన్ మ్యాగ్నైట్ అమ్మకాలు జరిగిగాయి.

పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వినియోగదారులు మాగ్నైట్ డెలివరీ కోసం ఇంకా 6 నెలలు వేచి ఉండాలి. కానీ ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తిని పెంచడం ద్వారా వెయిటింగ్ పీరియడ్ త్వరలో తగ్గిపోతుందని కంపెనీ ప్రకటించింది. నిస్సాన్ మాగ్నైట్‌ను కంపెనీ డీలర్‌షిప్‌లో మరియు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

ఇటీవల నిస్సాన్ తన బేస్ వేరియంట్ ధరను కొత్త సంవత్సరం నుండి పెంచారు. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 5.49 లక్షలకు లభిస్తుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) వేరియంట్లలో ప్రవేశపెట్టారు.

MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, దాని బేస్ వేరియంట్లో 16 ఇంచెస్ వీల్స్, స్కిడ్ ప్లేట్, రూఫ్ రైల్స్, ఎల్‌సిడి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అన్ని పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ లభిస్తాయి.

పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో అందించబడ్డాయి.

MOST READ:భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

మాగ్నైట్ యొక్క 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉపయోగించబడింది.

పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నిస్సాన్ సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి క్రాష్ టెస్ట్ లో మాగ్నైట్ కి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది. ఈ కారణంగా దాని బుకింగ్‌లు కూడా పెరుగుతున్నాయి.

MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

ఈ కారులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, 360 డిగ్రీల కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటివి ఉన్నాయి.

పరుగులుపెడుతున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ ; కేవలం 3 నెలల్లో 40000 యూనిట్లు

నిస్సాన్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యాక్ససరీస్ కూడా వెల్లడించింది. ఇందులో ఎస్సెన్షియల్స్, స్టైలింగ్ మరియు ప్రీమియం ఉన్నాయి, వీటి ధరలు వరుసగా రూ .2,249, రూ .4,799 మరియు రూ .8,999 కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Nissan Magnite Booking Crosses 40,000 Units Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X