షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) యొక్క డ్యూయల్-టోన్ (ఒనిక్స్ బ్లాక్ మరియు ఫ్లేర్ గార్నెట్ రెడ్‌) కలర్ అప్సన్ నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుంచి మరియు బ్రోచర్ నుండి ఈ డ్యూయల్-టోన్ కలర్ అప్సన్ వేరియంట్ తీసివేయబడింది.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

కంపెనీ యొక్క మాగ్నైట్ SUV ఎనిమిది కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 5 మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన మూడు డ్యూయెల్ టోన్ వేరియంట్స్. మోనోటోన్ కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇందులో బ్లేడ్ సిల్వర్, ఓనిక్స్ బ్లాక్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, సాండ్‌స్టోన్ బ్రౌన్ మరియు స్టార్మ్ వైట్ కలర్స్ ఉన్నాయి. ఇక డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో వివిడ్ బ్లూ/ స్టార్మ్ వైట్, టూర్మలైన్ బ్రౌన్‌/ ఓనిక్స్ బ్లాక్ మరియు పెర్ల్ వైట్‌/ ఓనిక్స్ బ్లాక్ ఉన్నాయి.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

సాధారణంగా, తక్కువ డిమాండ్ ఉన్న వేరియంట్‌లను, కలర్ ఆప్షన్‌లను మరియు ఫీచర్స్ వంటి వాటిని కంపెనీ ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటుంది. దీనిద్వారా కంపెనీకి అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఈ వేరియంట్లు మార్కెట్లో అంత గొప్ప విజయాన్ని సాధించలేకపోవడం వల్ల కంపెనీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

ఇదిలా ఉండగా, నిస్సాన్ మాగ్నైట్ యొక్క కొత్త వేరియంట్ త్వరలో విడుదల కానున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. త్వరలో మార్కెట్లో విడుదలయ్యే నిస్సాన్ మాగ్నైట్ యొక్క కొత్త వేరియంట్ XV ఎగ్జిక్యూటివ్ వేరియంట్ కానుంది. ఈ కొత్త వేరియంట్ XL మరియు XV వేరియంట్‌ల మధ్య ఉంచబడుతుంది. అయితే ఈ కొత్త వేరియంట్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

నిస్సాన్ మాగ్నైట్ యొక్క కొత్త వేరియంట్ ధర దాని మునుపటి మోడల్స్ కంటే కూడా దాదాపు రూ. 52,000 ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న ఈ కొత్త వేరియంట్ యొక్క వివరాల విషయానికి వస్తే, ఇది మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో అత్యంత పోటీతత్వ విభాగంలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

నిస్సాన్ మాగ్నైట్ యొక్క అమ్మకాలు ఇప్పటికి కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అంతే కాకూండా ఈ SUV కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా కూడా నిలిచింది. ఈ కారణంగానే కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచుకోవడానికి కంపెనీ ఈ కొత్త వేరియంట్ తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

ఈ సబ్-కాంపాక్ట్ SUV యొక్క వెలుపలి భాగంలో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు డోర్‌లపై సిల్వర్ క్లాడింగ్‌ను పొందుతుంది. పిల్లల భద్రతను నిర్ధారించడానికి లోపలి భాగంలో కప్‌హోల్డర్‌లతో కూడిన రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్‌లు, 60:40 స్ప్లిట్ సీట్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్, ముందు సీటుపై బ్యాక్ పాకెట్ మరియు ఐసోఫిక్స్ మౌంట్ వంటివి ఉన్నాయి.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

అంతే కాకుండా కంపెనీ యొక్క ఈ కొత్త XV ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ఆండ్రాయిడ్ ఆటో, ఇన్-బిల్ట్ నావిగేషన్, వైర్‌లెస్ మిర్రర్ లింక్ మరియు వీడియో ప్లేతో కూడిన 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. పార్కింగ్‌ను మరింత సులభతరం చేయడానికి, ఈ కారు రియర్ పార్కింగ్ కెమెరాను కూడా పొందుతుంది. ఇవి మాత్రమే కాకుండా XL వేరియంట్‌లోని దాదాపు అన్నాయి ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

కంపెనీ అందించనున్న ఈ కొత్త వేరియంట్ లో మల్టిపుల్ ఫంక్షన్‌లు, పవర్ అడ్జస్టబుల్ ORVM, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, పవర్ బూట్, రియర్ విండో వైపర్ మరియు డీఫాగర్ మొదలైన వాటితో కూడిన స్టీరింగ్ వీల్ ఇవ్వబడుతుంది.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు పవర్ డోర్ లాక్‌ని వంటివి ఉంటాయి, కావున ఇవి వాహన వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకోవాలంగా ఉంటాయి.

షాకింగ్ న్యూస్.. Nissan Magnite నుంచి ఈ వేరియంట్ అవుట్

నిస్సాన్ మాగ్నైట్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, దీనికి 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఆప్సన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్సన్ కూడా ఇవ్వబడుతుంది. ఇందులోని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్‌తో లభిస్తుండగా, టర్బో పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు CVT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి పవర్ మరియు 152 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారతీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ యొక్క అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే జరుగుతున్నాయి. అయితే ఇందులో మరో కొత్త వేరియంట్ అందుబాటులోకి వస్తే, ఈ అమమకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Nissan magnite dual tone color option discontinued details
Story first published: Friday, November 26, 2021, 11:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X