పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

నిస్సాన్ ఇండియా గడచిన డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మాగ్నైట్'ను కంపెనీ రూ.4.99 లక్షల, (ఎక్స్-షోరూమ్, ఢల్లీ) ప్రత్యేక పరిచయ ప్రారంభ ధరతో విక్రయించిన సంగతి తెలిసినదే. ఈ మోడల్ ధరలను జనవరి 2021 నుండి పెంచుతామని ప్రకటించిన నిస్సాన్, ఇప్పుడు ఆ నిర్ణయంపై వెనక్కు తగ్గింది.

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

నిస్సాన్ మాగ్నైట్‌కు అనూహ్యంగా 32,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు రావటంతో, కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అదే పాత ధరలతో కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్ ధరల పెరుగుదల విషయంలో తమ తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే వరకూ మునపటి ధరలే చెల్లుబాటులో ఉంటాయని నిస్సాన్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ వేరియంట్ల వారీగా ధరలు ఇలా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ):

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

ఒక్క బేస్ వేరియంట్ (ఎక్స్ఈ) మినహా మిగిలిన అన్ని వేరియంట్ల ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఈ వేరియంట్ ధర రూ.5.49 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది. మునుపటి ధరతో (రూ.4.99 లక్షలతో) పోలిస్తే ఈ వేరియంట్ ధర అదనంగా రూ.50,000 పెంపును అందుకుంది.

MOST READ:2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. భారతీయ రేసర్లు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూడండి

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

నిస్సాన్ ఇండియా డిసెంబర్ 2, 2020వ తేదీన తమ సరికొత్త మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. మాగ్నైట్‌ను ప్రారంభించిన మొదటి నెలలోనే ఈ మోడల్ కోసం దేశవ్యాప్తంగా 32,800 యూనిట్లకు పైగా బుకింగ్‌లు మరియు 1,80,000కి పైగా ఎంక్వైరీలు వచ్చాయని కంపెనీ ప్రకటించింది.

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

నిస్సాన్ మాగ్నైట్ కోసం వస్తున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. ఇందుకోసం కంపెనీ అదనంగా 1000 మంది సిబ్బందిని నియమించుకొని, తమ ప్లాంట్‌లో మూడవ షిఫ్టును కూడా ప్రారంభించింది.

MOST READ:అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

చెన్నైలోని తమ ప్లాంట్‌లో మూడవ షిఫ్ట్ ప్రారంభించడం ద్వారా నిస్సాన్ మాగ్నైట్ కోసం పెరుగుతున్న వెయిటింగ్ పీరియడ్‌ను 2-3 నెలలకు తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. కేవలం ఫ్యాక్టరీలోనే కాకుండా, నిస్సాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌షిప్‌లలో కూడా శ్రామిక శక్తిని పెంచుతోంది.

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

నిస్సాన్ మాగ్నైట్ ఇటీవల ఏషియన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ వార్త తెలిసిన తర్వాత మాగ్నైట్ అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. మరోవైపు ఈ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయడం (మేడ్-ఇన్-ఇండియా)తో లోకల్ సెంటిమెంట్ కూడా దీనికి ప్లస్ పాయింట్ అయింది.

MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

ప్రస్తుతం మార్కెట్లో మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

ఇకపోతే, రెండవ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:కొత్త హ్యుందాయ్ ఐ 20 బుకింగ్స్ హవా.. ఇప్పటికీ తగ్గని జోరు

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నిస్సాన్ మాగ్నైట్ అనేక బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు మొదలైనవి ఉన్నాయి.

పాత ధరకే కొత్త నిస్సాన్ మాగ్నైట్; పరిచయ ధరల్లో మార్పులు లేవ్!

దీని ఇంటీరియర్స్‌లో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Nissan Magnite Introductory Prices Extended; Received 32,800 Bookings. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X