రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

నిస్సాన్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మాగ్నైట్' కోసం రాజమండ్రిలోని 'కంటిపుడి నిస్సాన్' డీలర్‌షిప్ ఓ మెగా డెలివరీ డ్రైవ్‌ను నిర్వహించింది.

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజినగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు అధీకృత డీలర్ అయిన కంటిపుడి నిస్సాన్, ఒక్కరోజే 36 మంది కస్టమర్లకు నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలను డెలివరీ చేసింది.

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

నిస్సాన్ గత నెలలో ఈ మోడల్‌ను కేవలం రూ.4.99 లక్షల, (ఎక్స్-షోరూమ్, ఢల్లీ) ప్రారంభ ధరకే విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధర కారణంగా ఈ ఎస్‌యూవీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకూ ఈ మోడల్ కోసం 33,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి.

MOST READ:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ కోసం వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి దీని వెయిటింగ్ పీరియడ్ 6-8 నెలల వరకూ ఉంటోంది. ఈ నేపథ్యంలో, నిస్సాన్ మాగ్నైట్ కోసం వస్తున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది.

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

ఇందులో భాగంగానే, కంపెనీ తమ చెన్నై ప్లాంట్‌లో అదనంగా మరో 1000 మంది సిబ్బందిని నియమించుకొని, మూడవ షిఫ్టును కూడా ప్రారంభించింది. మూడవ షిఫ్ట్‌ను ప్రారంభించడం ద్వారా మాగ్నైట్ కోసం పెరుగుతున్న వెయిటింగ్ పీరియడ్‌ను 2-3 నెలలకు తగ్గించాలని నిస్సాన్ భావిస్తోంది.

MOST READ:22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

నిస్సాన్ ఇటీవలే తమ కస్టమర్లకు ఓ శుభవార్త కూడా చెప్పింది. కొత్త సంవత్సరంలో మాగ్నైట్ ధరలను పెంచుతామని గత డిసెంబర్‌లో ప్రకటించిన కంపెనీ, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మాగ్నైట్ పట్ల మార్కెట్ నుండి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని దీని బేస్ వేరియంట్ ధర మిగిలిన వేరియంట్ల ధరలను అలానే ఉంచింది.

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

బేస్ వేరియంట్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఈ ధరను కంపెనీ రూ.50,000 మేర పెంచింది. తాజా ధర పెంపు తర్వాత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభ ధర రూ.5.49 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది.

MOST READ:లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

నిస్సాన్ మాగ్నైట్ స్టైలిష్ డిజైన్ మరియు అమేజింగ్ ఫీచర్లతో లభిస్తోంది. ఇందులో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు మొదలైనవి ఉన్నాయి.

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

రాజమండ్రిలో నిస్సాన్ మాగ్నైట్ మెగా డెలివరీ; ఒక్కరోజే 36 యూనిట్లు

ఇకపోతే, రెండవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Most Read Articles

English summary
Magnite Mega Delivery Drive From Kantipudi Nissan; 36 Units Delivered In One Day. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X