Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 18 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
కేసీఆర్ సర్కార్‌కు షర్మిల పార్టీ నేతల ఫస్ట్ అల్టిమేటం: రోడ్డెక్కి..నిరసనలు
- Sports
అక్కడ గెలిస్తేనే టీమిండియా అత్యుత్తమ జట్టు: మైకేల్ వాన్
- Movies
చిలికి చిలికి గాలివానలా.. సారంగ దరియాపై సుద్దాల అలా.. కోమలి ఇలా!
- Finance
బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
నిస్సాన్ ఇండియా, గడచిన డిసెంబర్ 2020 నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మోడల్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్యూవీ అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఈ కారు మార్కెట్లోకి విడుదలైన 45 రోజుల్లోనే 35,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకుంది.

మాగ్నైట్ కోసం ఇప్పటికే 2 లక్షలకు పైగా ఎంక్వైరీలు వచ్చాయని కంపెనీ పేర్కొంది. నిస్సాన్ తమ మాగ్నైట్ ఎస్‌యూవీని భారత్‌లోనే కాకుండా, పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తోంది. ఆయా మార్కెట్ల నుండి కూడా ఈ మోడల్‌కు అశేష ఆదరణ లభిస్తున్నట్లు నిస్సాన్ తెలిపింది.

నిస్సాన్ గత నెలలో ఈ కారును కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే విడుదల చేసింది. అయితే, జనవరి 2021లో ఈ ప్రారంభ వేరియంట్ ధరను మాత్రమే రూ.50,000 మేర పెంచి రూ.5.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విక్రయిస్తోంది.
MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నిస్సాన్ మాగ్నైట్ బేస్ వేరియంట్ ధర పెరిగినప్పటికీ, ఇది ఈ విభాగంలోనే అత్యంత సరమైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా కొనసాగుతుంది. అంతేకాకుండా, మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చు కూడా ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్‌కు అయ్యే ఖర్చు ప్రతి కిలోమీటరు కేవలం 29 పైసలు (మొదటి 50,000 కిలోమీటర్ల వరకు) మాత్రమే. ఈ సెగ్మెంట్లోని ఇతర పోటీదారులతో పోల్చితే, నిస్సాన్ మాగ్నైట్ అతి తక్కువ నిర్వహణ వ్యయం (మెయింటినెన్స్ కాస్ట్)ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
MOST READ:అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

కొత్తగా నిస్సాన్ మాగ్నైట్ కారును బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఆన్లైన్లో కానీ లేదా అధీకృత నిస్సాన్ డీలర్షిప్ కేంద్రాలలో కానీ దీనిని బుక్ చేసుకోవచ్చు. ఈ కారుని స్టాండర్డ్ 2-సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీతో అందిస్తున్నారు. కస్టమర్లు కావాలనుకుంటే, 5 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వరకూ ఎక్స్టెండెడ్ వారంటీని కొనుగోలు చేయవచ్చు.

నిస్సాన్ మాగ్నైట్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్ఈడీ డిఆర్ఎల్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు మొదలైన అనేక బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు లభిస్తాయి.
MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

మాగ్నైట్ ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.
MOST READ:ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి

అంతేకాకుండా, ఇది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

నిస్సాన్ ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కోసం ఆకర్షణీయమైన యాక్ససరీస్ ప్యాక్‌లను కూడా అందిస్తోంది. ఇందులో ఎసెన్షియల్స్, స్టైలింగ్ మరియు ప్రీమియం ప్యాక్‌లు ఉన్నాయి. వీటిని వరుసగా రూ.2,249, రూ.4,799 మరియు రూ.8,999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. - ఈ యాక్ససరీ ప్యాక్‌లలో లభించే పూర్తి ఫీచర్ల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.