Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ (Nissan), భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ (Magnite) లో మరొక కొత్త వేరియంట్ ను త్వరలోనే విడుదల చేయనుంది. నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌వి ఎగ్జిక్యూటివ్ (Nissan Magnite XV Executive) పేరుతో ఈ వేరియంట్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఈ కొత్త వేరియంట్ లో లభించే ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నిస్సాన్ మాగ్నైట్ XL మరియు XV వేరియంట్ల మధ్యలో ఈ కొత్త XV Executive వేరింయట్ ను ప్రవేశపెట్టనున్నారు మరియు XL వేరియంట్ కంటే రూ. 52,000 అధిక ధరను ఉంటుందని సమాచారం. ఈ అధనపు ధరకు తగినట్లుగానే, కంపెనీ ఇందులో అనేక అధనపు ఫీచర్లను మరియు పరికరాలను కూడా అందిస్తోంది.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

నిస్సాన్ మాగ్నైట్ వేరియంట్ లైనప్ లో కొత్త XV Executive వేరియంట్ రావడంతో, కస్టమర్‌లు ఇప్పుడు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో మరో కొత్త ఎంపికను పొందుతారు. దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న విభాగంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం కూడా ఒకటి. ఈ విభాగంలో పోటీ అధికంగా ఉన్నప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలు మాత్రం సజావుగానే సాగుతున్నాయి.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

ప్రస్తుతం నిస్సాన్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ గా మాగ్నైట్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, నిస్సాన్ మాగ్నైట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ ఇందులో మరొక కొత్త వేరియంట్ (XV Executive)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

Nissan Magnite XV Executive లో లభించే ఫీచర్లు ఏమిటి?

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కొత్తగా రాబోయే ఎక్స్‌వి ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లో 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు డోర్లపై సిల్వర్ క్లాడింగ్ లభిస్తుంది. అలాగే, ఇంటీరియర్ ఫీచర్లలో పిల్లల భద్రత కోసం ISOFIX చైల్డ సీట్ యాంకర్స్, కప్‌హోల్డర్‌లతో కూడిన వెనుక సీటు ఆర్మ్‌రెస్ట్‌లు, 60:40 స్ప్లిట్ సీట్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, ఫ్రంట్ సీటుపై బ్యాక్ పాకెట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

వీటితో పాటుగా, నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌వి ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లో ఆండ్రాయిడ్ ఆటో, ఇన్-బిల్ట్ నావిగేషన్, వైర్‌లెస్ మిర్రర్ లింక్ మరియు వీడియో ప్లేతో కూడిన 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా లభిస్తుంది. అలాగే, పార్కింగ్ ను మరింత సులభతరం చేయడానికి, ఈ కారులో రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా లభిస్తుంది. ఈ ఫీచర్లతో పాటుగా మాగ్నైట్ ఎక్స్ఎల్ వేరియంట్‌ లో లభించే అన్ని ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

ఈ కారులోని ఫీచర్ల విషయానికి వస్తే, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబ్ సైడ్ మిర్రర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, పవర్ బూట్, రియర్ విండో వైపర్ మరియు డీఫాగర్ మొదలైనవి ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూస్తే, ఈ చిన్న కారులో రెండు ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు పవర్ డోర్ లాక్ మొదలైనవి ఉన్నాయి.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి పవర్ మరియు 152 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

ప్రస్తుతం మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ XE (బేస్), XL (మిడ్), XV (హై) మరియు XV (ప్రీమియం) అనే వేరియంట్లలో లభిస్తుంది. నిస్సాన్ ఇండియా దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో 1500 కి పైగా నగరాల్లో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది తద్వారా, దేశవ్యాప్తంగా అమ్మకాల తర్వాత సేవా (ఆఫ్టర్ సేల్స్ సర్వీస్) నెట్‌వర్క్‌ను మెరుగుపరిచింది. నిస్సాన్ మాగ్నైట్ కు విపరీతమైన డిమాండ్ ఉన్నందున కంపెనీ తన చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తిని కూడా పెంచుతోంది.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

ప్రస్తుతం, నిస్సాన్ మాగ్నైట్ కోసం 60,000 యూనిట్లకు బుకింగ్ లు ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 2020 నెలలో కంపెనీ ఈ చిన్న కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ కారు కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. నిస్సాన్ మాగ్నైట్ తక్కువ వ్యవధిలో బాగా ప్రాచుర్యం పొందడానికి కారణం దాని సరసమైన ధర మరియు అద్భుతమైన ఫీచర్లే అని చెప్పొచ్చు.

Nissan Magnite లో మరొక కొత్త వేరియంట్.. త్వరలోనే విడుదల..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

నిస్సాన్ మాగ్నైట్ ఈ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా మారింది, ఇది దేశంలోని అన్ని రకాల కస్టమర్ల నుండి మంచి ఆదరణను పొందుతోంది. ఈ మోడల్ కారణంగా నిస్సాన్ బ్రాండ్, భారతీయ మార్కెట్లో తన స్వంతంగా నిలదొక్కుకోగలిగింది, అయితే తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలంటే, రాబోయే కాలంలో కంపెనీ ఇలాంటి మరిన్ని ఉత్పత్తులను తీసుకురావలసి ఉంటుంది.

Most Read Articles

English summary
Nissan magnite to get new variant launch expected soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X