ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ కారణంగా కొత్త కొత్త వాహనాలు కొత్త కొత్త ఫీచర్స్ తో పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన నిస్సాన్ (Nissan) మార్కెట్లో 2030 నాటికల్లా ఒకటి రెండు కాదు ఏకంగా 15 ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

నిస్సాన్ కంపెనీ 2030 నాటికి ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాల తయారీ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించాలని యోచిస్తున్నట్లు ఇటీవల అధికారికంగా తెలిపింది. చాలా కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. కావున రానున్న కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

ప్రస్తుతం ఇనియోగంలో ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వల్ల వాతావరణంలో కాలుష్యం పెరుగుతోంది. అంతే కాకుండా భారతదేశంలో ఇంధన ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ దారులు మరియు వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపైన ఆసక్తి చూపుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

నిస్సాన్ కంపెనీ తన కొత్త దీర్ఘకాలిక ప్రణాళికను వివరిస్తూ, 2030 నాటికి తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి 15 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో సహా 23 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కూడా తెలిపింది. గత సంవత్సరం నిస్సాన్ మోటార్ యొక్క గ్లోబల్ అమ్మకాలలో EV లు లేదా హైబ్రిడ్ వాహనాలు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయి. 2050 నాటికి దాని ఉత్పత్తులు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే అవుతాయి. కంపెనీ ఈ లక్ష్యంవైపు అడుగులు వేస్తూ ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

నిస్సాన్ ఇటీవలి కాలంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇందులో కరోనా మహమ్మారి సమస్య మరియు గ్లోబల్ చిప్ కొరత వంటివి వున్నాయి. కరోనా ప్రభావం మరియు సెమికండక్టర్ చిప్ కొరతలు ఉన్నప్పటికి, ప్రత్యర్థులకు సరైన పోటీ ఇస్తూ ఇప్పుడు కూడా ముందంజలో ప్రయాణిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

నిస్సాన్ కంపెనీ యొక్క ప్రణాళికల గురించి విడుదల చేసిన ఒక ప్రకటనలో, నిస్సాన్ కంపెనీ సీఈఓ, మకోటో ఉచిడా మాట్లాడుతూ.. దీర్ఘకాలిక ప్రణాళిక నిస్సాన్‌ను స్థిరమైన కంపెనీగా మారుస్తుందని అన్నారు, అంతే కాకుండా ఇది ఆటో పరిశ్రమలో కనిపించే ఒక ఎత్తుగడ, స్వీడన్ యొక్క వోల్వో 2030 నాటికి అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

అంతే కాకుండా, జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ కూడా 2040 నాటికి కంపెనీని పూర్తిగా విద్యుదీకరించాలని, తన లక్ష్యాన్ని కూడా నిర్దేశించింది. 2030 నాటికి యూరప్‌లో విక్రయించే అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ మోడల్‌గా ఉంటాయని అత్యధికంగా అమ్ముడైన టయోటా కంపెనీ కూడా స్పష్టం చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

టయోటా కంపెనీ 2035 నాటికి ఉత్తర అమెరికాలో 70 శాతం మరియు చైనాలో 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే నిస్సాన్ కంపెనీ వచ్చే ఐదేళ్లలో మొత్తం 20 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఐరోపాలో 75 శాతం అమ్మకాలను ఈ మోడళ్ల నుండి ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉంటాయి. అంతే కాకుండా 2028 నాటికి దాని యాజమాన్య బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలనే లక్ష్యంతో, విద్యుదీకరణను వేగవంతం చేయడానికి రాబోయే ఐదేళ్లలో రెండు ట్రిలియన్ యెన్లు లేదా సుమారు $17.5 బిలియన్లను పెట్టుబడి పెట్టనున్నట్లు జపాన్ వాహన తయారీదారు తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

ఇప్పటికే చాలా కంపెనీలు విడుదల చేసిన కొన్ని ప్రకటనల ప్రకారం భారతీయ మార్కెట్లో కూడా అన్ని వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉంటాయని తెలిపాయి. ఇందులో జర్మన్ లగ్జరీ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా ఉంది. ఇవన్నీ గమనిస్తూ ఉండే రానున్న తరానికి మొత్తం ఇంధన వాహనాలు కనుమరుగైపోయి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఎలక్ట్రిక్ వాహనాల తయారికై పక్కా ప్లాన్ వేసుకున్న Nissan

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

2030 నాటికి 15 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదలచేయడం లక్ష్యంగా పెట్టుకున్న నిస్సాన్ భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని శాసించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న ఈ 15 ఎలక్ట్రిక్ వాహనాలు అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో నిక్షిప్తమై ఉంటాయి, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కావున కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం.

Most Read Articles

English summary
Nissan plans to launch 15 electric cars in global market by 2030 details
Story first published: Tuesday, November 30, 2021, 10:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X