పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడానికి అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. తాజాగా, రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చేలా ట్రాక్టర్లు కొనే రైతులకు భారీ సబ్సిడీ ఇచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

'ప్రధాన్ మంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజన' పేరిట ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులు ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్లనైనా సబ్సిడీతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రైతులకు ట్రాక్టర్ ధరలో సుమారు 50 శాతం వరకూ సబ్సిడీ లభిస్తుంది.

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

అంటే, రైతులు ట్రాక్టర్ అసలు ధరలో సగం ధర మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ఈ ప్రధాన్ మంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజన పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

వ్యవసాయంలో రైతులకు అతి ముఖ్యమైన పరికరాలలో ట్రాక్టర్ కూడా ఒకటి. ప్రధాన్ మంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం ద్వారా రైతులే స్వయంగా ఓ ట్రాక్టరును కొనుగోలు చేయవచ్చు, దీంతో ఇకపై వారు ట్రాక్టర్లను అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

వివిధ రాష్ట్రాల్లో ఈ సబ్సిడీ వేర్వేరుగా ఉంటుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ట్రాక్టర్లు కొనడానికి తమ సొంత స్థాయిలో 20 నుంచి 50 వరకూ శాతం సబ్సిడీని అందిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 'ఈ యంత్ర కృషి అనుదాన్' అనే పథకం క్రింద రైతులకు వివిధ వ్యవసాయ పరికరాల కొనుగోలుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది.

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

'పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన' ప్రయోజనాన్ని ఎలా పొందాలి?

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన కోసం రిజిస్టర్ చేసుకున్న రైతుకు మొదటి షరతు ఏమిటంటే.. సదరు రైతు గత 7 సంవత్సరాలలో ఏదైనా ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉండకూడదు. ఈ పథకం క్రింద ఒక రైతు ఒక ట్రాక్టర్‌ను మాత్రమే కొనుగోలు చేయగలడు.

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

అంతే కాకుండా ఈ పథకంలో మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడానికి ఒక రైతుకు అవసరమైన అన్ని పత్రాలు మరియు అతడు లేదా ఆమె పేరు మీద వ్యవసాయ భూమి కూడా ఉండాలి.

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకం కోసం రైతులు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు వారు చేయాల్సిందల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి లేదా సమీప సిఎస్‌సి కేంద్రానికి వెళ్లి ధరఖాస్తు చేసుకోవచ్చు.

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం:

సాధారణ సేవా కేంద్రంలో, దరఖాస్తు ఫారమ్ తీసుకొని అందులో అడిగిన సమాచారం పేరు, చిరునామా మొదలైన వివరాలు నింపాలి నింపండి. ఆ తరువాత, మీ పత్రాలన్నింటినీ దరఖాస్తు ఫారంతో అటాచ్ చేసి అక్కడే సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతు ఆధార్ కార్డు, ల్యాండ్ పేపర్లు, బ్యాంక్ వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో మొదలైన పత్రాలు అవసరం.

పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్ మరియు అందులో ఓ స్వంత లింక్ ఉంటాయి. వాటిపై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నింపవచ్చు. ఈ విధంగా ధరఖాస్తు చేసుకున్న వారి అర్హతను పరిశీలించిన తర్వాత వారికి ట్రాక్టర్ కొనుగోలుపై కేంద్రం సబ్సిడీని అందించడం జరుగుతుంది.

Most Read Articles

English summary
Now Farmers Can Get Upto 50 Percent Subsidy On Tractors Under PM Kisan Tractor Yojana Scheme, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X