బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

టెస్లా సంస్థ అధినేత ఎలోన్ మస్క్ తాజాగా ఓ స్టేట్‌మెంట్ చేశారు. బిట్ కాయిన్లతో టెస్లా కార్లను కొనుగోలు చేయవచ్చని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. బిట్ కాయిన్ల రూపంలో టెస్లాకు వచ్చిన కరెన్సీని బిట్ కాయిన్స్ రూపంలోనే ఉంచుతామని, దానిని చట్టపరమైన కరెన్సీగా మార్చబోమని కూడా ఆయన స్పష్టం చేశారు.

బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

అసలు ఈ బిట్ కాయిన్ అంటే ఏంటి?

బిట్ కాయిన్‌ను వర్చువల్ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ అంటారు. దీనికి ఒక రూపం అంటూ ఉండదు మరియు ప్రపంచంలోని ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ కూడా దీనిని కంట్రోల్ చేయదు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక ఇంటర్నెట్ కరెన్సీ లాంటింది. బిట్ కాయిన్ ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ద్వారా పనిచేస్తుంది.

బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకెళ్లి బిట్ కాయిన్‌ను కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసిన వారికి మాత్రమే యాక్సెస్ ఉండేలా ఓ డిజిటల్ ఖాతా తెరవబడుతుంది. ఈ ఖాతా సాయంతో వారు తమ బిట్ కాయిన్‌ను వర్చ్యువల్‌గా వేరొకరికి బదిలీ చేయవచ్చు లేదా తిరిగి తమ బ్యాంకు ఖాతాలోకి నగదు రూపంలో జమ చేసుకోవచ్చు.

MOST READ:మానవత్వం చాటుకున్న మంచి పోలీస్ & బైక్ రైడర్.. వీడియో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు

బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

అలాకుకుండా, టెస్లా సంస్థ మాదిరిగా ఎవరైనా తమ ఉత్పత్తులను విక్రయిస్తుంటే, వాటిని కొనుగోలు చేయటానికి ఈ బిట్ కాయిన్‌లను ఉపయోగించుకోవచ్చు. టెస్లా సంస్థ తీసుకున్న నిర్ణయంతో, ఈ కంపెనీ ప్రపంచంలోనే బిట్ కాయిన్ ద్వారా చెల్లింపులు చేసిన మొట్టమొదటి అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది.

బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

ప్రస్తుతానికి అమెరికాలోని ప్రజలు మాత్రమే బిట్ కాయిన్ల ద్వారా టెస్లా కార్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి మరికొన్ని దేశాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెస్లా సంస్థ పేర్కొంది. గత నెలలో టెస్లా ఐఎన్‌సి 1.5 బిలియన్ డాలర్ల విలువైన బిట్ కాయిన్‌లను కొనుగోలు చేసింది.

MOST READ:గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

క్రిప్టో కరెన్సీ పట్ల ఎలోన్ మస్క్ చూపిన ఆసక్తి మరియు కార్ల కొనుగోలు కోసం బిట్‌కాయిన్‌లను అంగీకరించాల్సిందిగా టెస్లా వినియోగదారుల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ కరెన్సీ అయిన బిట్‌కాయిన్ మస్క్ ట్వీట్ తర్వాత 4 శాతం కంటే ఎక్కువ పెరిగింది మరియు చివరిగా 3.5 శాతం పెరిగి 56,178 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

ఇక మనదేశం విషయానికి వస్తే, టెస్లా ఇప్పటికే తమ సంస్థను భారతదేశంలో రిజిస్టర్ కూడా చేసింది, ఇక అధికారికంగా ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించడమే తరువాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, టెస్లా ఇండియా మోటార్స్ మరియు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు విలీనం చేయబడ్డాయి. ఈ కంపెనీ రిజిస్టర్డ్ చిరునామా బెంగళూరులోని లావెల్లె రోడ్‌లో ఉంది.

MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

ప్రారంభంలో భాగంగా, టెస్లా తమ ఎంట్రీ లెవల్ కారు అయిన 'మోడల్ 3'ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఈ కారును మనకు సమీపంలో చైనా దేశంలో తయారు చేస్తోంది. ఈ కారు ధర 40,960 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.30 లక్షలు). ప్రస్తుత దిగుమతి సుంకాల ప్రకారం, ఈ కారును విదేశాల నుండి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తే, దీని ధర సుమారు రూ.60 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

అదే గనుక జరిగితే ఇది సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో, టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలను అందుబాటులో ఉంచేందుకు ఈ కంపెనీ, భారత మార్కెట్లోనే ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, స్థానికంగా తమ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని భావిస్తోంది.

MOST READ:వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

బిట్ కాయిన్లతో టెస్లా కార్లు కొనుక్కోవచ్చు: ఎలోన్ మస్క్

దేశంలో టెస్లా తమ ప్లాంటును బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. టెస్లా యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రణాళిక ప్రకారం కార్లను భారతదేశంలోనే తయారు చేస్తే, ఈ కార్లు చాలా సరసమైన ధరకే లభించే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Now You Can Buy A Tesla Car With Bitcoin, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X