ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

భారతదేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో పోరాడేందుకు దేశంలోని ఆటోమొబైల్ సంస్థలు మేము సైతం అంటూ ముందుకొస్తున్నాయి. ఇప్పటికే, పలు ఆటోమొబైల్ కంపెనీలు ఆర్థిక సాయాన్ని ప్రకటించగా, మరికొన్ని సంస్థలు తమ ఫ్యాక్టరీల్లో వాహనాల ఉత్పత్తిని నిలిపివేసి, వైద్య అవసరాల కోసం ఉపయోగించే ఆక్సిజెన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.

ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

తాజాగా, క్యాబ్‌ల రంగంలో కీలకమైన బ్రాండ్ ఓలా కూడా అవసరమైన వారికి ఆక్సిజెన్‌ను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఓలా ఫౌండేషన్ ఇటీవల గివ్ఇండియాతో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఓలా యాప్ ద్వారా వినియోగదారులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించనున్నారు.

ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

ఈ సేవలను బెంగుళూరు నగరంలో ప్రారంభించనున్నారు. బెంగుళూరులో 500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లతో ఈ సేవలను ప్రారంభిస్తారు, తరువాత రాబోయే వారాల్లో ఈ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని ఇరు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

కరోనా మహమ్మారి తీవ్రతకు దేశంలో ఆక్సిజన్ కొరత ఎక్కువైన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు సాంప్రదాయ ఆక్సిజన్ సిలిండర్ల మాదిరిగా కాకుండా, ఇంటి వద్దనే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకునే విధంగా, పోర్టబల్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.

ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

అయితే, దేశంలో వీటికి ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడటంతో, సప్లయ్ తగ్గి భారీ కొరత ఏర్పడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సులభంగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉండేలా ఓలా ఫౌండేషన్ మరియు గివ్ఇండియా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు ఓలా యాప్‌కు లాగిన్ అయి అందులోని తమ సమాచారాన్ని పొందుపరచిన తరువాత వాటి కోసం అభ్యర్థించవచ్చు. అనంతరం, ఓలా తమ యాప్ ద్వారా వచ్చిన అభ్యర్థన ధృవీకరిస్తుంది. ఆ తర్వాత ఓలా తమ క్యాబ్ సేవల ద్వారా ఆక్సిజెన్ కాన్సన్‌ట్రేటర్లను వినియోగదారులకు పంపుతుంది.

ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

ఈ క్యాబ్‌లను శిక్షణ పొందిన డ్రైవర్లు నడుపుతారు, వారు ఆక్సిజెన్ కాన్సన్‌ట్రేటర్లను సదరు వినియోగదారుల ఇంటికి తీసుకెళ్లి డెలివరీ చేస్తారు. ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను తిరిగి ఉపయోగించుకోవచ్చు. వీటిని బుక్ చేసుకున్న రోగి కోలుకున్న తర్వాత, వారికి ఇకపై ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అవసరం లేదని భావిస్తే, తిరిగి వాటిని ఓలా సంస్థకు రిటర్న్ చేయవచ్చు.

ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను యాప్ ద్వారా రిటర్న్ చేయవచ్చు. వీటిని బుక్ చేసుకున్నట్లుగా రిటర్న్ కూడా బుక్ చేసుకోవాలి. అనంతరం ఓలా క్యాబ్ డ్రైవర్ సదరు వినియోగదారుని ఇంటికి వెళ్లి, ఈ పరికరాన్ని తిరిగి తనతో తీసుకువెళతారు. ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల యొక్క పికప్ మరియు డెలివరీ పూర్తిగా ఉచితం.

ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

కరోనా సోకి, ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న చాలా మంది రోగులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఓలా చైర్మన్, భవీష్ అగర్వాల్ మాట్లాడుతూ, "ఈ విపత్కర సమయంలో మనమందరం కలిసి వచ్చి మన సమాజానికి సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గివ్ఇండియా భాగస్వామ్యంతో 'ఆక్సిజన్ ఫర్ ఇండియా' ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం ద్వారా సమాజానికి మా వంతు సాయం చేస్తున్నామ"ని ఆయన అన్నారు.

ఓలా యాప్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను బుక్ చేసుకోవచ్చు!

ఓలా ఫౌండేషన్‌కు గివ్ఇండియా ఆక్సిజెన్ కాన్సన్‌ట్రేటర్లను సప్లయ్ చేస్తుంది. ఓలా తమ క్యాబ్ సేవల ద్వారా వాటిని కస్టమర్ల ఇంటికి చేర్చుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా ఉచితం. అయితే, కస్టమర్లు మాత్రం తాము ఎన్ని రోజులు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఉపయోగిస్తారో అన్ని రోజులకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Ola Foundation And GiveIndia Join Hands To Provide Oxygen Concentrators Through App. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X