డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి - డీటేల్స్

డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఆన్‌లైన్ ప్రక్రియ మరియు దాని సంబంధిత అన్ని ప్రక్రియలను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇటీవలి కరోనాలో లాక్డౌన్ సమయంలోనే కొన్ని ఆర్టీఓ సేవలు ఆన్‌లైన్‌లో చేయబడ్డాయి.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి - డీటేల్స్

ఇప్పుడు, తాజాగా డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా ఆన్‌లైన్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే, కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ మెడికల్ సర్టిఫికెట్‌ను ధృవీకరించనున్నాయి. ఈ చర్య డ్రైవింగ్ లైసెన్సుల కోసం చేస్తున్న నకిలీ వైద్య ధృవీకరణ పత్రాలను నిలిపివేస్తుందని భావిస్తున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి - డీటేల్స్

ఇందులో భాగంగా, వైద్య అధికారుల కోసం లాగిన్ ఐడిలను సారధి పోర్టల్‌లో తయారు చేయాలని తెలియజేయాలని ఉత్తరప్రదేశ్ అదనపు రవాణా కమిషనర్ (ఐటి) దేవేంద్ర కుమార్ అన్ని అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్ (అడ్మినిస్ట్రేషన్) / లైసెన్సింగ్ అథారిటీకి లేఖ జారీ చేశారు.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి - డీటేల్స్

అధీకృత వైద్యులు ఆన్‌లైన్‌లో ఇచ్చే సర్టిఫికెట్ల ఆధారంగా మాత్రమే డ్రైవింగ్ లైసెన్సులను మంజూరు చేయాలని ఈ లేఖలో కోరారు. జిఎస్ఆర్ 240ఈ ద్వారా సవరించబడిన సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు 1989 ప్రకారం, ఫారం-1ఏ మెడికల్ సర్టిఫికెట్‌ను సారథి పోర్టల్‌లోనే ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా పొందుపరచాలనే నిబంధన ఉంది.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి - డీటేల్స్

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారు మెడికల్ సర్టిఫికేట్ కోసం కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి మెడికల్ ఆఫీసర్ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి పది రూపాయలు వసూలు చేస్తారు. ఇలా మెడికల్ సర్టిఫికెట్ పొందిన తర్వాతనే వారికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయటం జరుగుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి - డీటేల్స్

దేశంలోని ప్రతి ఆర్టీఓ కేంద్రానికి సంబంధించిన కొన్ని రకాల సేవలను ఇప్పుడు ఆన్‌లైన్ చేయటం జరిగింది. లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్ లైసెన్స్, అడ్రస్ మార్పు వంటి కొన్ని రకాల సేవలు ఇందులో ఉన్నాయి. అనేక రకాల ఆర్టీఓ సేవలు ఆన్‌లైన్ చేసిన నేపథ్యంలో, ప్రజలు ఇప్పుడు ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్ మరియు వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ మొదలైన వాటి కోసం మాత్రమే ఆర్టీఓలకు వెళ్లాల్సి ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి - డీటేల్స్

కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీకి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణ రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ శిక్షణ అందించే సెంటర్లకు సంబంధించి కొన్ని రూల్స్‌ను సవరించింది. ప్రభుత్వం ద్వారా సర్టిఫై చేయబడిన డ్రైవింగ్ స్కూల్ నుండి ఎవరైనా డ్రైవింగ్ శిక్షణ పొందిన తరువాత, సదరు వ్యక్తికి ఆర్టీఓ డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేస్తోంది.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి - డీటేల్స్

ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్లలోనే టెస్ట్ ట్రాక్స్ ఉంటాయి. డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తులు ఈ ట్రాక్స్‌పై వాహనాలను విజయవంతంగా నడిపినట్లయితే, వారికి సదరు డ్రైవింగ్ శిక్షణా కేంద్రం సర్టిఫికెట్‌ను జారీ చేసి, దానిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ఇలా శిక్షణ పొందిన వారు తిరిగి ఆర్టీఓ వద్ద ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనాల్సిన అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి.

Most Read Articles

English summary
Online Medical Certificate Is Mandatory To Issue Driving License. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X